1991 డిసెంబర్ 30వ తేదీ నుండి 1999 నవంబర్ 29 వ తేదీ మధ్య కాలంలో 15 సంవత్సరాల కన్నా తక్కువ సర్వీసును కలిగివుండి విధి నిర్వహణలో ఉంటూ మరణించిన, లేదా అశక్తులైన రక్షణ విభాగం సిబ్బంది కొంత మందికి 180 రోజుల వరకు సెలవును నగదుగా మార్చేందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
ఈ నిర్ణయం పైన పేర్కొన్న కాలంలో మరణించిన లేదా దుర్భలురైన రక్షణ విభాగం అధికారులు మరియు ఇతరేతర సిబ్బందికి చెందిన 9777 కుటుంబాలకు ప్రయోజనాన్ని అందించగలదు. ఈ కాలం ఎంతో ప్రముఖమైనటువంటి కాలం; ఎందుచేతనంటే, కార్గిల్ పోరాటం (“ఆపరేషన్ విజయ్”) సందర్భంగాను మరియు అదే కాలంలో జమ్ము & కశ్మీర్ లోను, ఈశాన్య ప్రాంతంలోను విద్రోహ కార్యకలాపాలను ఎదుర్కొనే సందర్భంగా పెద్ద సంఖ్యలో సైనికులు హతులవడమో, క్షతగాత్రులవడమో జరిగింది.