Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఝార్ ఖండ్ లో అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ఝార్ ఖండ్ లో అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ఝార్ ఖండ్ లో అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

ఝార్ ఖండ్ లో అభివృద్ధి పథకాలను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఝార్ ఖండ్ లోని సాహెబ్ గంజ్ లో అభివృద్ధి పథకాలను ఈ రోజు ప్రారంభించారు.

గంగా నది మీదుగా నాలుగు వరుసల వంతెన నిర్మాణానికి, దానితో పాటే ఒక మల్టి- మోడల్ టర్మినల్ కు ఆయన శంకు స్థాపన చేశారు. వారాణసీ నుండి హల్దియా వరకు జాతీయ జల మార్గాన్ని అభివృద్ధిపరచే ప్రక్రియలో మల్టి- మోడల్ టర్మినల్ ఒక ముఖ్యమైన భాగంగా ఉంది.

ప్రధాన మంత్రి 311 కిలోమీటర్ల మేర సాగే గోవింద్ పూర్-జమ్ తారా-దుమ్ కా-సాహెబ్ గంజ్ హైవేను ప్రారంభించారు; ఇంకా, సాహెబ్ గంజ్ జిల్లా న్యాయస్థాన భవనం వద్ద మరియు సాహెబ్ గంజ్ జిల్లా ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన ఒక సౌర విద్యుత్తు సదుపాయాన్ని కూడా ఆయన దేశ ప్రజలకు అంకితం చేశారు.

ప్రధాన మంత్రి పహాడియా స్పెషల్ ఇండియా రిజర్వ్ బెటాలియన్ కానిస్టేబుల్స్ కు నియామక పత్రాలను; స్వయంసహాయక బృందాలకు చెందిన మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు స్మార్ట్ ఫోన్ లను అందజేశారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ, ఈ అభివృద్ధి పథకాలు సంథాల్ పరగణా ప్రాంతానికి మేలు చేస్తాయని, ఆదివాసీ సముదాయాలకు మరింత సాధికారతను ప్రసాదించడంలో తోడ్పడుతాయన్నారు. భారతదేశంలోని పేద ప్రజలు గౌరవంగా జీవించాలని కోరుకుంటున్నారని, వారు తమను తాము నిరూపించుకొనేందుకు తగ్గ అవకాశాలను వాంఛిస్తున్నారని ప్రధాన మంత్రి అన్నారు. వారి సామర్థ్యం పట్ల తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన చెప్పారు.

భారతదేశంలో నిజాయతీతో కూడిన శకం ఆరంభమైందని ప్రధాన మంత్రి అన్నారు. పేదలు వారికి దక్కవలసింది పొందేటట్లు చూసేందుకు తాను పడుతున్న ప్రయాస సఫలం కావడంలో ప్రజల దీవెనలు తనకు కావాలని ఆయన కోరారు.