రోడ్డు రవాణా మరియు హైవేల మంత్రిత్వ శాఖ లో గ్రూప్ ‘ఎ’ లోకి వచ్చే సెంట్రల్ ఇంజినీరింగ్ సర్వీస్ (రోడ్స్) క్యాడర్ సమీక్ష కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదనను వెంటనే అమలు చేయనున్నారు.
సిఇఎస్ (రోడ్స్) క్యాడర్ సంఖ్యను ఈ కింది విధంగా సవరించడడం జరుగుతుంది:-
(i) సిఇఎస్ (రోడ్స్) పదవుల సంఖ్యను పెంచనున్నారు, అది ఎలాగంటే:
ఎ. హెచ్ఎజి స్థాయి లో 2;
బి. ఎస్ఎజి స్థాయి లో 5;
సి. జెటిఎస్ స్థాయి లో 36 పదవులు ఉంటాయి.
(ii) ఎస్ టిఎస్ స్థాయి పదవుల సంఖ్యను తగ్గిస్తారు. ఈ స్థాయిలో 28 పదవులు ఉంటాయి.
(iii) క్యాడర్ లో జెటిఎస్ స్థాయిలో ఉత్పన్నమయ్యే సాధారణ ఖాళీలకు తోడు, స్పెషల్ రిజర్వ్ ఎట్ ఎంట్రీ లెవెల్ (జెటిఎస్)లో 86 పదవులను కేవలం డిప్యుటేషన్ కోసం భర్తీ చేస్తారు; ఈ ఖాళీలను క్యాడర్ సంఖ్యకు కలపబోరు.
సిఇఎస్ (రోడ్స్) ను 1959లో ఏర్పాటు చేయడమైంది. గ్రూప్ ‘ఎ’ టెక్నికల్ పోస్టు కు ఒకటో అలకేషన్ ను 1976లో 189 గా ఖరారు చేయడమైంది. సర్వీసులో కడపటి క్యాడర్ రివ్యూను 1987లో చేపట్టడం జరిగింది.
మెకానికల్ క్యాడర్ లో ఉద్యోగ ఖాళీలను అందులోనే సివిల్ ఇంజినీర్ లతో భర్తీ చేయడానికి వినియోగించుకొంటారు. తద్వారా, ఇప్పటికే ఉన్న అధికారులపై ఎటువంటి ప్రతికూల ప్రభావం ప్రసరించకుండా, మెకానికల్ క్యాడర్ ను దశల వారీగా సివిల్ క్యాడర్ లో కలిపేస్తారు.
పైన పేర్కొన్న ప్రకారం క్యాడర్ రివ్యూ ప్రతిపాదనను అమలులోకి తీసుకురావడానికి సంవత్సరానికి దాదాపు రూ.1.8 కోట్ల అదనపు వ్యయం అవుతుంది. ఇక డిప్యూటేషన్ కోసం స్పెషల్ రిజర్వ్ విషయంలో ఎటువంటి ఆర్థిక భారం పడదు.
***