ప్రధాన మంత్రి కార్యాలయ (పిఎంఒ) సంబంధిత సమాచారం కోసం సమాచార హక్కు చట్టం (ఆర్ టిఐ యాక్ట్) కింద వచ్చే దరఖాస్తులను సౌత్ బ్లాక్ లోని తపాలా విభాగం స్వీకరిస్తుంది. ఇందుకోసం సమాచార హక్కు చట్టం-2005 కింద నిర్దేశిత రుసుమును చెల్లించాల్సి ఉంటుంది. దీంతోపాటు ఈ కార్యాలయానికి అందే అన్ని సమాచార దరఖాస్తులను పరిశీలించేందుకు పిఎంఒ లో ప్రత్యేకంగా ఒక ఆర్ టిఐ విభాగం కూడా ఏర్పాటైంది.
2. దీనికి ప్రత్యామ్నాయంగా ఆర్ టిఐ ఆన్లైన్ పోర్టల్ RTI Online Portal ద్వారా కూడా సమాచార దరఖాస్తులను పంపవచ్చు.
3. చట్టం నిర్దేశించిన వివిధ రుసుములను పిఎంఒ లోని ఆర్ టిఐ విభాగంలో నగదు రూపేణా చెల్లించి తగు రసీదు పొందవచ్చు. అలాగే ‘‘సెక్షన్ ఆఫీసర్, పిఎంఒ’’ పేరిట తీసిన ఇండియన్ పోస్టల్ ఆర్డర్, డిమాండ్ డ్రాఫ్ట్, బ్యాంకర్స్ చెక్ ల రూపంలోనూ చెల్లించవచ్చు. ఆన్లైన్లో సమర్పించే దరఖాస్తుల కోసం రుసుమును ఆన్లైన్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఉంటుంది.
4. పిఎంఒ లో సమర్పించిన దరఖాస్తుల తాజా స్థితితో పాటు ఇతరత్రా అవసరమైన వివరాలపై పిఎంఒ లోని ఆర్ టిఐ విభాగం దరఖాస్తుదారులకు సమాచారం ఇస్తుంది. ఆర్ టిఐ విభాగానికి సంబంధించిన మరిన్ని వివరాలను దిగువన చూడవచ్చు:
చిరునామా | ఆర్ టిఐ విభాగం ప్రధాన మంత్రి కార్యాలయం సౌత్ బ్లాక్, న్యూఢిల్లీ-110011 |
టెలిఫోన్ నంబరు | 011-23382590 |
వేళలు | ఉదయం 09:00 నుంచి సాయంత్రం 5:30 వరకు |
అందుబాటులో ఉన్న సదుపాయాలు |
ఎ) ప్రజలు/తపాలా ద్వారా పిఎంఒ కు అందే ఆర్ టిఐ దరఖాస్తుల స్వీకరణ. బి) నగదు, ఇతర రూపాల్లో ఆర్ టిఐ చట్టం-2005 నిర్దేశించిన రుసుముల స్వీకరణ సి) దరఖాస్తుదారులకు వాటి తాజా స్థితిని గురించి సమాచారం అందజేసే సదుపాయం |
రుసుములు | దరఖాస్తు రుసుము : రూ.10/-అదనపు రుసుములు: – ఎ) ఎ-3, అంతకన్నా చిన్న కాగితంపై సమాచారం కోసం ఒక్కో పుటకు రూ.2/-; బి) పెద్ద సైజు కాగితంలో ఫొటోకాపీ వాస్తవ వ్యయం లేదా ధర; సి) సిడి లేదా డివిడి వాస్తవ వ్యయం; డి) రికార్డుల పరిశీలనకు తొలి గంట వరకు రుసుము లేదు; ఆ తరువాత గంట అంతకు లోపు రూ.5/- వంతున; ఇ) రూ.50కి మించిన పక్షంలో సమాచారం పంపేందుకు ఎంత తపాలా చార్జీలు అవుతాయో అంత. |
రుసుము మినహాయింపు |
దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ఏ వ్యక్తి నుండి అయినా ఎటువంటి రుసుము వసూలు చేయబోరు; అయితే ఇందుకోసం తగినటువంటి ప్రభుత్వం నుండి జారీ అయిన ధ్రువీకరణ పత్రం ప్రతి ని దరఖాస్తుతో పాటు జత చేయవలసివుంటుంది. | ఆర్ టిఐ విభాగం |
---|