1. వివిధ మంత్రిత్వ శాఖలు / విభాగాలు లేదా రాష్ట్ర ప్రభుత్వాల పరిధి లోకి వచ్చే అంశాలకు సంబంధించి పెద్ద సంఖ్యలో ప్రజా ఫిర్యాదులు ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరుతూ ఉంటాయి. అటువంటి ఫిర్యాదులను ఈ కార్యాలయానికి చెందిన ప్రజా విభాగం సంబంధిత మంత్రిత్వ శాఖ/విభాగం లేదా రాష్ట్ర ప్రభుత్వాల పరిశీలనకు పంపుతుంది.
2. ప్రతి ఫిర్యాదుపైన ఒక సంఖ్యను తప్పకుండా సూచించి, ఆ ఫిర్యాదును సంబంధిత మంత్రిత్వ శాఖ / డిపార్టుమెంటు లేదా రాష్ట్ర ప్రభుత్వానికి పంపుతూ, ఆ సమాచారం తాలూకు ఒక ప్రతి ని ఫిర్యాదుదారుకు కూడా పంపడం జరుగుతుంది. దీనికి అదనంగా, ప్రజా విభాగంలో ఫిర్యాదును నమోదు చేసి / తగిన చర్య తీసుకునే సమయంలోనే, నమోదు సంఖ్యను ఫిర్యాదుదారుకు ఇ-మెయిల్ మరియు ఎస్ఎంఎస్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది. తనకు అందజేసిన లేఖ లో పొందుపరచిన ఫిర్యాదు నమోదు సంఖ్యను https://pgportal.gov.in/Status/Index లో నమోదు చేసినట్లయితే, ఇంటర్ నెట్ ద్వారా ఫిర్యాదుదారు తన ఫిర్యాదు ఏ స్థితిలో ఉన్నదో తెలుసుకోవచ్చు.
3. తాము ప్రధాన మంత్రి కి పంపిన లేఖ పై చర్య తీసుకునే ప్రక్రియ ఎంతవరకు వచ్చిందో కనుగొనేందుకు పౌరులు 011-23386447 అనే నంబరుకు ఫోన్ చేయడం ద్వారా కూడా విచారణ చేయవచ్చు.
4. అటువంటి కేసులలో – సమస్య పరిష్కారం – ఫిర్యాదును ఎవరికి పంపడం జరిగిందో – ఆ సంబంధిత అధికారి అధీనంలో ఉంటుంది. అందువల్ల, దరఖాస్తుదారులు వారి ఫిర్యాదుకు సంబంధించి తదుపరి సమాచారం కోసం ఆయా మంత్రిత్వ శాఖ / విభాగం లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించవచ్చు.
5. దీనికి తోడు, ప్రధాన మంత్రి కార్యాలయానికి చెందిన ప్రజా విభాగం లో ఈ లేఖల ప్రక్రియ అంతా పూర్తిగా కంప్యూటరీకరించబడింది. ఏ విధమైన ఫైల్ నోటింగు ఉండదు.
6. ప్రధానమంత్రి కార్యాలయానికి దాఖలు చేసిన తమ ఫిర్యాదుల స్థాయి ని సమాచార హక్కు చట్టం ద్వారా తెలుసుకోవాలను కునే వారు ఈ విషయమై సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించడానికన్నా ముందు పైన తెలియజేసిన వివరాలను దయచేసి గమనించగలరు.