Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మిజోరమ్, అరుణాచల్ ప్రదేశ్ ల రాష్ట్ర అవతరణ దినం నాడు ఆ రెండు రాష్ట్రాల ప్రజలకు అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ మిజోరమ్, అరుణాచల్ ప్రదేశ్ ల ప్రజలను వారి రాష్ట్ర అవతరణ దినం సందర్భంగా అభినందించారు.

“మిజోరమ్ రాష్ట్ర అవతరణ దినాన్ని పురస్కరించుకొని ఆ రాష్ట్ర ప్రజలకు ఇవే నా అభినందనలు. రానున్న సంవత్సరాలలో మిజోరమ్ గొప్ప పురోగతిని సాధించాలని ఆ ఈశ్వరుడిని ప్రార్థిస్తున్నాను.

అరుణాచల్ ప్రదేశ్ పౌరులకు రాష్ట్ర అవతరణ దిన సందర్భంగా నా అభినందనలు. రానున్న కాలంలో అరుణాచల్ ప్రదేశ్ అభివృద్ధి పథంలో సరి కొత్త శిఖరాలను అందుకోవాలిగాక” అని ప్రధాన మంత్రి తన సందేశంలో ఆకాంక్షించారు.