Search

పిఎంఇండియాపిఎంఇండియా

స‌మాఖ్య విధానాన్ని మ‌రింత విస్తృత ప‌రిచేందుకు అన్ని రాష్ట్రాల‌కు సాధికార‌త క‌లిగించ‌టం


దేశాభివృద్ధికి రాష్ట్రాల‌తో క‌లిసి కేంద్రం ‘టీమ్ ఇండియా’ లాగా క‌లిసి పనిచేసిన సంద్భాలెప్పుడు గ‌తంలో ఎప్పుడూ జ‌ర‌గ‌లేదు.

Empowering_Different_States_1 [ PM India 297KB ]

గ‌తంలో ఎవ‌రూ చేప‌ట్ట‌నంత వినూత్నంగా.. దేశాభివృద్ధిలో రాష్ట్రాలు కూడా క‌లిసి రావాల్సిందేన‌ని ప్ర‌ధాన మంత్రి మోదీ గారు ప‌ట్టుబ‌ట్టి స‌మాఖ్య విధానం ద్వారా స‌ర్వ‌తోముఖాభివృద్ధికి బాట‌లు వేశారు. చాలా కాలంగా కేంద్రం, రాష్ట్రాల మ‌ధ్య పెద్ద‌న్న త‌ర‌హా సంబంధం మాత్ర‌మే కొన‌సాగుతూ వ‌చ్చింది. అంద‌రికీ ఒకే విధానం అనే ప‌ద్ధ‌తిలో ప‌ని జ‌రిగింది. రాష్ట్రాల అవ‌స‌రాల‌ను గుర్తించి వాటిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాల‌న్న ఆలోచ‌నే ఇన్నాళ్లూ క‌ల‌గ‌లేదు.

The Prime Minister, Shri Narendra Modi chairing the Team India, first meeting of the Governing Council of NITI Aayog, in New Delhi on February 08, 2015. [ PM India 314KB ]

రాష్ట్రాల‌ను బ‌లోపేతం చేసేందుకు వాటికి సాధికార‌త పెంచేందుకు నితి ఆయోగ్ ప్రారంభించ‌బ‌డింది. కేంద్రం నుంచి రాష్ట్రాల‌కు అనే పాల‌సీని పూర్తిగా ప‌క్క‌న పెట్టి.. ఇక‌పై కేంద్రంతో రాష్ట్రాలు భాగ‌స్వాములుగా మారి అభివృద్ధి జ‌రిపేందుకు అవ‌కాశం ఏర్ప‌డింది. వ్యూహాత్మ‌క పాల‌సీల విష‌యంలో నితి ఆయోగ్ వేగంగా స్పందిస్తూ.. రాష్ట్రాల‌కు స‌హాయంచేయ‌టంతో పాటు.. స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి చొర‌వ తీసుకుంటుంది.

Empowering_Different_States_3 [ PM India 611KB ]

జాతీయ లక్ష్యాలు, జాతీయ అభివృద్ధి ప్రాధ‌మ్యాల‌ను దృష్టిలో పెట్టుకుని.. వివిధ రంగాల్లో రాష్ట్రాల‌ను క‌లుపుకుపోతూ.. వ్యూహాత్మ‌కంగా ప‌నిచేయ‌టం నితి ఆయోగ్ ప‌ని. ఈ దిశ‌గా నితి ఆయోగ్ జాతీయ ఎజెండాకు రూప‌క‌ల్ప‌న చేసి ప్ర‌ధాన మంత్రి, ముఖ్య‌మంత్రులు ప్రేర‌ణ పొంది ప‌నిచేసేలా కార్యాచ‌ర‌ణ సిద్ధం చేస్తుంది. రాష్ట్రాలతో నిరంతరం సంప‌ర్కంలో ఉంటూ..వారి స‌హ‌కారం, నిర్మాణాత్మ‌క మ‌ద్ద‌తుతో.. ప‌ర‌స్ప‌రం స‌హాయం చేసుకునే స‌మాఖ్య‌విధానాన్ని బ‌లోపేతం చేస్తుంది. త‌ద్వారా బ‌ల‌మైన దేశాన్ని ఏర్పర్చ‌టంతో రాష్ట్రాల పాత్ర‌కు మ‌రింత ప్రాధాన్యం ల‌భిస్తుంది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి మొద‌లై.. ఉన్న‌త స్థాయి వ‌ర‌కు చేరేలా వ్య‌వ‌స్థ‌ను న‌డిపించేందుకు విశ్వ‌స‌నీయ‌మైన ప్ర‌ణాళిక‌ల‌ను రూపొందిస్తుంది.

Empowering_Different_States_4 [ PM India 1226KB ]

చారిత్రాత్మ‌క నిర్ణ‌యం తీసుకున్న ఎన్డీఏ ప్ర‌భుత్వం.. 14వ ఆర్థిక సంఘం సూచ‌న‌ల‌ను స్వీక‌రించింది. దీని ప్ర‌కారం గ‌తంలో రాష్ట్రాల‌కున్న రెవ‌న్యూ వాటా 32 శాతం నుంచి 42 శాతానికి పెరిగింది. దీని వ‌ల్ల కేంద్రానికి రావాల్సిన నిధులు త‌క్కువ‌గా ఉన్నా.. రాష్ట్రాల ఆర్థిక ప‌రిస్థితిని మెరుగుప‌రిచేందుకు కేంద్రం 14వ ఆర్థిక‌సంఘం సూచ‌న‌ల‌ను అమలుచేసేందుకు సిద్ధ‌మైంది. దీని వ‌ల్ల రాష్ట్రాలు స్థానికంగా అవ‌స‌ర‌మైన ప‌థ‌కాలకు రూప‌క‌ల్ప‌న చేసి వాటి అమ‌లుకు ఆర్థికంగా ఇబ్బందులు ప‌డాల్సిన అవ‌స‌రం లేకుండా చేస్తుంది. రాష్ట్రాలు త‌మ ప్రాధామ్యాల‌ను గుర్తించి వాటిని నెర‌వేర్చుకోవ‌టంలో కేంద్రం తీసుకున్న ఈ నిర్ణ‌యం కీల‌కంగా మారింది.

Empowering_Different_States_5 [ PM India 435KB ]

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ గారు.. త‌న చైనా ప‌ర్య‌ట‌న‌కు ఇద్ద‌రు ముఖ్య‌మంత్రుల‌ను వెంట‌పెట్టుకుని వెళ్లి.. ఆయా రాష్ట్రాల్లో చైనా కంపెనీలు అభివృద్ధి ప‌నులు ప్రారంభించేలా చొర‌వ తీసుకున్నారు. ఇది చారిత్ర‌క నిర్ణ‌యం. రాష్ట్రాల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికి ఇది మ‌రింత ఉప‌యోగ‌క‌రం కానుంది.

రాష్ట్రాల‌కు మ‌రింత మేలుచేకూర్చేలా, మ‌రీ ముఖ్యంగా బొగ్గు నిల్వ‌లు ఎక్కువ‌గా ఉన్న తూర్పు రాష్ట్రాల్లో.. వెలికితీసిన బొగ్గును వేలం వేయ‌టం ద్వారా వ‌చ్చిన మొత్తంలో అధిక భాగాన్ని ఆయా రాష్ట్రాల‌కు అందేలా కేంద్రం నిర్ణ‌యం తీసుకుంది.

నితి ఆయోగ్ గురించి మ‌రింతగా తెలుసుకునేందుకు ఇక్క‌డ క్లిక్ చేయండి.

లోడ్ అవుతోంది... Loading