వ్యవసాయానికి ఊతమందించేందుకు తీసుకున్న పలు చర్యలు
దేశానికి రైతులే వెన్నెముక. అందుకే ఎన్డీయే ప్రభుత్వం నవ్యమైన ఆలోచనలు, స్పష్టమైన ప్రమాణాలతో రైతులకు దన్నుగా నిలిచేందుకు అహర్నిశలు ప్రయత్నిస్తోంది.
ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన ద్వారా నీటిపారుదల వ్యవస్థ మెరుగుపడి పంట ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుంది. పంట పండే ప్రతి ఎకరాకూ నీరు అందాలి.. నీటి పారుదల వ్యవస్థ మెరుగవ్వాలనేదే ఈ పథకం ముఖ్య ఉద్దేశం. ‘ప్రతి చుక్కకు మరింత పంట’ (పర్ డ్రాప్ మోర్ క్రాప్) నినాదంతో.. రైతు నూతన నీటిపారుదల విధానాన్ని అర్థం చేసుకునేలా వారిని చైతన్య పరచటం చేస్తున్నారు.
అన్నదాతలకు సేంద్రీయ వ్యవసాయంలో శిక్షణనిచ్చి వారిని చైతన్య పరిచేందుకు పరంపరాగత్ కృషి వికాస్ యోజన పథకాన్నిప్రారంభించారు. ఈశాన్య రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయం, సేంద్రీయ ఉత్పత్తుల ఎగుమతి కోసం కొత్త పథకాన్ని ప్రారంభించారు.
పంటల ఉత్పత్తిని మరింత పెంచేందుకు భూసార ఆరోగ్య కార్డులను ప్రవేశపెట్టారు. దేశంలోని 14 కోట్ల కమతాల్లో ఈ కార్డులను ఇచ్చారు. దాదాపు రెండున్నర కోట్ల (248 లక్షల) శాంపిళ్లను మూడేళ్లకోసారి పరీక్షిస్తారు, విశ్లేషిస్తారు.
దేశీయంగా తయారయ్యే యూరియా ఉత్పత్తిని పెంచటం, గోరఖ్‌పూర్, బరౌనీ, తాల్చేరుల్లోని ఎరువుల తయారీ కేంద్రాల సామర్థ్యం పెంచేందుకు కొత్త యూరియా పాలసీని కేంద్రం ప్రకటించింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో కేంద్రం ముందస్తు చర్యగా.. 33శాతం లేదా అంతకన్నా ఎక్కువ పంటనష్టం జరిగిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో పాటు నష్టపోయిన రైతులకు చేసే ఆర్థిక సాయాన్ని 50శాతానికి పెంచింది. గతంలో కేవలం 50 శాతం పంట నష్టపోయిన రైతులే ఇన్‌పుట్ సబ్సిడీ అందేది.
ధరల స్థిరీకరణకు రూ.500 కోట్లతో మూలనిధిని ఏర్పాటు చేయటం ద్వారా.. మార్కెట్‌లో ధరల ఒడిదుడుకుల ప్రభావం వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తులపై ధరలపై లేకుండా నియంత్రిస్తుంది. దీని వల్ల ధరల పెరుగుదలను క్రమబద్ధం చేయటంతోపాటు తగ్గించవచ్చు.
గ్రామ్ జ్యోతి యోజన ద్వారా ఫీడర్లను వేరుపరిచి రైతులకు నిరంతరాయంగా విద్యుత్ అందిస్తున్నారు. దీని వల్ల పంట ఉత్పత్తి పెరగటంతోపాటు రైతులతోపాటు కుటీర పరిశ్రమలు, విద్య వంటి రంగాలపై కూడా స్పష్టమైన ప్రభావం ఉంటుంది.
ఆహార భద్రత కల్పించటంలో భాగంగా రైతుల దీర్ఘకాలిక అవసరాలు, ఆసక్తులను దృష్టిలో పెట్టుకుని డబ్ల్యూటీవో చర్చల్లో ఎన్డీఏ ప్రభుత్వం కఠినమైన సూత్రాలకు పట్టుబట్టింది. రైతులకు ఇచ్చే వ్యవసాయ రుణాలను రూ. 8.5లక్షలకోట్ల కు పెంచింది. దీని ద్వారా తక్కువ వడ్డీకే రైతులకు రుణాలు అందుతాయి. వ్యవసాయరంగంలో వస్తున్న మార్పులతో రైతుల సాధికారత మరింత పెరుగుతోంది. కిసాన్ పోర్టల్ ద్వారా వాతావరణ మార్పులను తెలియపరచటం మొదలుకుని.. సరైన మద్దతు ధర మొదలైన విషయాలపై అన్నదాతలకు స్పష్టత వస్తోంది. వ్యవసాయరంగంలో మొబైల్ పాలన వినియోగం రైతులకు ఓ ప్రేరణ. దాదాపు కోటి మంది రైతులకు సలహాలు, సమాచారం ఇచ్చేందుకు 550 కోట్ల విలువైన చిన్న, మధ్య తరగతి వ్యాపార సంస్థలు రంగంలోకి దిగాయి.
భూసార ఆరోగ్య కార్డుల గురించి మరింత ‘ఇక్కడ’ తెలుసుకోండి
రైతులు సాధికారతను ఎలా పొందుతున్నారో ‘ఇక్కడ’ తెలుసుకోండి.