Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత పసిఫిక్ ద్వీపకల్ప దేశాల శిఖరాగ్ర సదస్సు, జైపూర్

భారత పసిఫిక్ ద్వీపకల్ప  దేశాల శిఖరాగ్ర సదస్సు, జైపూర్

భారత పసిఫిక్ ద్వీపకల్ప  దేశాల శిఖరాగ్ర సదస్సు, జైపూర్

భారత పసిఫిక్ ద్వీపకల్ప  దేశాల శిఖరాగ్ర సదస్సు, జైపూర్

భారత పసిఫిక్ ద్వీపకల్ప  దేశాల శిఖరాగ్ర సదస్సు, జైపూర్

 


గౌరవనీయ మహామహులారా

భారత పసిఫిక్ ద్వీపకల్ప దేశాల రెండో శిఖరాగ్ర సదస్సుకు ఆతిథ్యం ఇవ్వడం భారత్ కు ప్రత్యేక గౌరవం. ప్రస్తుతం ఈ సదస్సును ఫిపిక్ గా వ్యవహరిస్తున్నారు.

మీ అందరినీ నేను హృదయపూర్వకంగా భారత్ కు ఆహ్వానిస్తున్నాను. ప్రయాణం అంత తక్కువ సమయంలో జరిగినది కాదన్న విషయం నాకు తెలుసు. పైగా మీ అందరికీ ఎవరి పని షెడ్యూల్స్ వారికున్నాయి. కాని మన మధ్య గల సాన్నిహిత్యం ఆ దూరాన్ని దగ్గర చేసిందని నేను భావిస్తున్నాను.

మీ అందరినీ మా రాష్ట్రపతితో కలిసి ఢిల్లీలో ఆహ్వానించినందుకు నేను ఆనందిస్తున్నాను. దిల్లీ, ఆగ్రా, జైపూర్ ప్రయాణాన్ని మీరు ఆస్వాదించారని నేను భావిస్తున్నాను. మధ్యలో మీరు షాపింగ్ చేసుకునేందుకు మా బృందం కొంత సమయం ఇచ్చి ఉంటుందని భావిస్తున్నాను.

తాజ్ మహల్ సందర్శన కూడా మీకు ఆనందం ఇచ్చిందని భావిస్తున్నాను.

మీరు భారత్ కు రావడం ఇదే మొదటిసారైతే దేశ విస్తీర్ణం, సంస్కృతి, భిన్నత్వం, ప్రజాసముద్రం చూసి అబ్బురపడి ఉంటారు. చక్కని ద్వీపకల్పంతో ప్రకృతికి ఆలవాలంగా సామరస్యంతో జీవిస్తున్న మీ దేశాలను చూసి మేం అబ్బురపడినట్టుగానే మీకు అలాంటి అనుభవం కలిగి ఉంటుందనుకుంటాను.

ఈ భిన్నత్వమే మన భూమండలాన్ని ప్రత్యేకమైనదిగా కనిపించేలా చేస్తోంది.

చారిత్రాత్మకమైన పింక్ సిటీ జైపూర్ కు కూడా మిమ్మల్నందరినీ నేను ఆహ్వానిస్తున్నాను. లేత గులాబీ రంగులో కనిపించే రాజభవనాలు, రాళ్ళు ఈ నగరం ప్రత్యేకత. ఈ నగరం అనితర ధైర్యసాహసాలకు ప్రతీక. కళలు, సంస్కృతికి పుట్టినిల్లు. చక్కని ఆతిథ్యం ఈ నగరంతో ముడిపడి ఉన్న బలమైన సంప్రదాయం.

ఈ సదస్సు నిర్వహణకు ఎంతో ఉదారంగా మద్దతు ఇచ్చినందుకు ముఖ్యమంత్రి వసుంధరరాజేకు నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

నేను భారత్ లో ఆతిథ్యం ఇస్తున్న తొలి ప్రాంతీయ శిఖరాగ్రం ఇది. నా స్మృతుల్లో ఇది చిరస్థాయిగా నిలిచిపోతుంది.

ఈ శతాబ్దిలో భాగస్వామ్యాలకు భారత, పసిఫిక్ దేశాలు కొత్త నిర్వచనం ఇవ్వబోతున్న సమయం కూడా ఇది కావడం మరింత ప్రత్యేకం.

ఒకరి ఆశయాలు ఒకరు అర్ధం చేసుకుని, ఒకరి సవాళ్ళు ఒకరు తెలుసుకుని ఏర్పాటు చేసుకుంటున్న భాగస్వామ్యాలివి. చిన్నవైనా, పెద్దవైనా ఈ ప్రపంచంలో అన్ని దేశాలకు సమానమైన వాటా ఉంటుందనే విశ్వాసంతో ఏర్పడిన భాగస్వామ్యాలివి.

ప్రపంచం అంతా ఒక కుగ్రామంగా మారిపోయిన ఈ జగత్తు ఒకరిపై ఒకరి ఆధారనీయతను మరింతగా పెంచింది. భూగోళం భౌతిక స్వభావంపై మన ఆలోచనల్లో మార్పులు తెచ్చింది.

ప్రత్యేకించి అంతర్జాతీయ అవకాశాలు, సవాళ్ళ కేంద్రంగా ఇప్పుడు భారత పసిఫిక్ ప్రాంతం ప్రత్యేక గుర్తింపు పొందుతోంది. ఈ రెండు మహాసముద్రాల నడుమ ఉన్న దేశాల భవిత ఒక దానిపై ఒకటి అనుసంధానమై ఉంది. అందుకే ఈ ప్రాంతాన్ని కొందరు ఇండో పసిఫిక్ ప్రాంతంగా వ్యవహరిస్తున్నారు.

మనందరినీ ఒక్కటి చేస్తున్న సూత్రం అదొక్కటే కాదు.

చిన్న ద్వీపకల్ప దేశాలు విస్తీర్ణం, జనాభాపరంగా చిన్నవే అయినా ఏ ఇతర దేశంతో పోల్చినా మాకు వాటితో సమానమైనవే అనడంలో సందేహం లేదు. అంతర్జాతీయ వేదికలపై మేం మీకు అండగా నిలుస్తాం.

ఈ సుహృద్భావ వైఖరితోనే గత ఏడాది సమోవాలో జరిగిన సిడ్స్ సదస్సుకు మేం సంపూర్ణంగా మద్దతుగా నిలిచాం. అది సమోవా బాటగా కూడా ప్రసిద్ధికెక్కింది.

2015 తర్వాతి డెవలప్మెంట్ అజెండాగా వెలువరించిన పత్రం పరిధిలో సిడ్స్ ప్రయోజనాలకు మేం మద్దతుగా నిలుస్తాం. విస్తరించిన, సంస్కరించిన భద్రతా మండలిలో సిడ్స్ కు కూడా ఒక సముచిత స్థానం కల్పించేందుకు భారత్ మీతో కలిసి పని చేస్తుంది.

పసిఫిక్ ప్రాంతీయత అనే మీ కల సాకారం కావడానికి కూడా భారత్ అండగా నిలుస్తుంది. ప్రపంచంలోని ఇతరులకు కూడా స్ఫూర్తి ఇచ్చే సహకార ఫెడరలిజం ఇది.

మహామహులారా

ప్రపంచం మిమ్మల్ని తక్కువ జనాభా గల చిన్న ద్వీపకల్పాలుగా భావించవచ్చు. కాని అద్భుతమైన సామర్థ్యాలు గల సముద్ర దేశాలుగా నేను భావిస్తున్నాను.

మీలో కొందరికి భారత్ లోని ఎక్స్ క్లూజివ్ ఎకనామిక్ జోన్లన్నింటి కన్నా పెద్దదైన, భూగోళం కన్నా పెద్దవైన సంపూర్ణ ప్రత్యేక ఆర్థిక జోన్లుండవచ్చు.

అంతరిక్షం వలెనే ఆర్థిక వ్యవస్థలకు చోదకశక్తులుగా సముద్రాలు కూడా నిలిచే అవకాశం ఉన్న కొత్త శకంలో మనం ఉన్నాం. సముద్ర వనరులను స్థిరంగా వినియోగంలోకి తీసుకురావడం వల్ల సుసంపన్నత ఏర్పడుతుంది. ప్రపంచానికి స్వచ్ఛమైన ఇంధనాలు, కొత్త ఔషధాలు అందుబాటులోకి వస్తాయి. ఆహార భద్రత కూడా ఏర్పడుతుంది.

భారతదేశ భవిష్యత్తుకు కూడా సముద్రాలు చాలా కీలకం. అందుకే నేను గత ఏడాది కూడా సముద్ర కేంద్రీకృత ఆర్థిక కార్యకలాపాల గురించి భారత్ లోనూ, అంతర్జాతీయ వేదికల పైన కూడా విస్తృతంగా ప్రస్తావించాను. ఈ విభాగంలో విస్తృత భాగస్వామ్యాలకు అవకాశాలెన్నో ఉన్నాయి.

సముద్రాలు, సముద్ర వనరుల సుస్థిర వినియోగం విషయంలో భారత్ మీకు అండగా నిలుస్తుంది. ఐక్యరాజ్యసమితిలో ఇటీవల తుదిరూపం ఇచ్చిన స్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో సముద్రాలు కీలకంగా నిలుస్తాయి.

మనం ఎదుర్కొంటున్న అంతర్జాతీయ సవాళ్ళు కూడా సమానమైనవే.

పసిఫిక్ సముద్ర ప్రాంత దేశాలకు వాతావరణ మార్పులు పెను సవాలుగా నిలుస్తున్నాయి. 7500 కిలోమీటర్లు విస్తరించి ఉన్న భారత తీర ప్రాంతంలోని 1300 దీవుల్లో నివశిస్తున్న కోట్లాది మంది భద్రతకు ఇది పెను సవాలుగా నిలుస్తోంది. ఈ ఏడాది చివరిలో పారిస్ లో జరుగనున్న సిఒపి 21 వ సదస్సులో వాతావరణ మార్పులపై ధీటైన పోరాటం సాగించేందుకు నిర్దిష్టమైన చర్యలు వెలువడతాయని నేను భావిస్తున్నాను.

ఐక్యరాజ్యసమితి వాతావరణ మార్పుల విషయంలో స్థిర అభివృద్ధి లక్ష్యాలను నిర్దేశించడంపై వత్తిడి తేవడంలో మనందరం కలిసి పని చేశాం. డబ్ల్యుటీవోలో కూడా ఉమ్మడి లక్ష్యాలతో కలిసి పని చేసేందుకు మనందరం భాగస్వామ్యాలు కుదుర్చుకోవాలి. ఉదాహరణకి ఫిషరీష్ మాదిరిగానే.

ఐక్యరాజ్యసమితి 70వ వార్షికోత్సవ మైలురాయి వద్ద నిలిచింది. రానున్న కాలంలో ఐక్యరాజ్యసమితిని ముందుకు నడిపించేందుకు మార్గనిర్దేశంగా నిలిచే ప్రణాళిక రూపొందించాలని కోరుతూ నేను సభ్యదేశాలకు ఇప్పటికే లేఖ రాశాను.

ఏడు దశాబ్దాల క్రితం ఐక్యరాజ్యసమితి ఏర్పడిన నాటికి, ఇప్పటికి ప్రపంచం ఎంతో మారింది. సభ్యదేశాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. వాతావరణ మార్పుల వంటి కొత్త సవాళ్ళు మన ముందుకు వచ్చాయి. అంతరిక్షం, జల నిధి వంటి కొత్త అవకాశాలు ముందుకు వచ్చాయి. డిజిటల్ యుగంలో ప్రవేశించిన పరివర్తిత ఆర్థిక వ్యవస్థలతో కూడిన ప్రపంచీకరణ యుగంలో మనం నివశిస్తున్నాం. ప్రపంచంలోని ఈ మార్పులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితిలో కూడా మార్పులు రావలసి ఉంది.

నేటి వాస్తవాలకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో మార్పుల కోసం మనందరం వత్తిడి చేయాల్సిన అవసరం ఉంది.అది 21వ శాతాబ్ది వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా మరింత సమర్థవంతమైన వ్యవస్థగా రూపాంతరం చెందాల్సిన అవసరం ఉంది. సర్వప్రతినిధి సభ అధ్యక్షుడి ముసాయిదాలో భద్రతా మండలి సంస్కరణలు కూడా ఒక భాగం చేయాలని వత్తిడి తెచ్చే విషయంలో మీ అందరి మద్దతు అవసరం.

భద్రతా మండలిలో భారత్ శాశ్వత సభ్యత్వం కోసం మీరందరూ ఇచ్చే మద్దతు ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సంస్థగా వాస్తవ స్వభావానికి దర్పణంగా నిలుస్తుంది. కొత్త తరంలో సమతుల్యతకు మూలంగా నిలుస్తుంది.

మహోదయులారా, ఫిపిక్ శక్తివంతమైన అంతర్జాతీయ భాగస్వామ్యాల వేదిక మాత్రమే కాదు…ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారం ప్రాతిపదికన మనందరం సుసంపన్నం కావడానికి కూడా ఒక వేదికగా కూడా నిలవాలి.

గత సదస్సులో పసిఫిక్ ప్రాంత దేశాలకు భారత్ ఎన్నో కట్టుబాట్లు ప్రకటించింది. వాటిలో చాలా కట్టుబాట్లను భారత్ పూర్తి చేయగలిగిందని తెలియచేసేందుకు సంతోషిస్తున్నాను.

పసిఫిక్ సముద్ర ద్వీప దేశాలకు భారత్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ను 1.25 లక్షల అమెరికన్ డాలర్ల నుంచి 2 లక్షల డాలర్లకు పెంచడం, భారత కాయిర్ పరిశ్రమ నిపుణులను ఆ దేశాలకు డిప్యుటేషన్ పై పంపించడం, ఆ దేశాల దౌత్యవేత్తలకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం వీటిలో కొన్ని.

ఎయిడ్ కన్నా ట్రేడ్ తోనే అభివృద్ధి సాధ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని న్యూఢిల్లీలోని భారత వాణిజ్య పారిశ్రామిక వాణిజ్య మండలుల సమాఖ్య (ఫిక్కి) కార్యాలయంలో ఫిపిక్ ట్రేడ్ ఆఫీస్ ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించేందుకు నేను ఆనందిస్తున్నాను.

భారత పసిఫిక్ ద్వీపకల్ప దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను ప్రోత్సహించడంలో ఇది మొదటి అడుగు మాత్రమే.
మహామహులరా, మీ దేశాల్లో నివశిస్తున్న భారత సంతతి ప్రజలందరూ మన మధ్య ప్రత్యేక అనుసంధానంగా వ్యవహరిస్తున్నారు.

మహామహులారా, మీ అందరి అభిప్రాయాలు తెలుసుకోవాలని నేను ఆసక్తితో ఉన్నాను. ఈ అద్భుతమైన భాగస్వామ్యాన్ని మరింత ముందుకు నడిపించే విషయంలో భవిష్యత్ చొరవలపై నా భావాలు కూడా మీతో పంచుకుంటాను.

ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని ప్రకటించేందుకు చేసిన కృషిలో మీ అందరి మద్దతుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని మీ దేశాలన్నింటిలోనూ విజయవంతంగా నిర్వహించినందుకు కూడా కృతజ్ఞతలు.

ముగింపు సందర్భంగా నేను ఒక ముఖ్యవిషయం మీ అందరికీ తెలుపుతున్నాను. ద్వీపకల్ప దేశాలనే అమిత విలువైన వజ్రాలు ప్రపంచానికి ఒక కానుక అన్నదే ఈ అంశం. భగవంతుని ఆకాంక్షకు, మానవత స్ఫూర్తికి ఈ అద్భుతమైన ద్వీపకల్ప దేశాల్లో ప్రజల జీవితమే దర్పణం.

ప్రకృతి అందించిన ఈ అద్భుతమైన సంపదను, అద్భుతమైన ప్రజలను కాపాడుకునేందుకు మనందరం కలిసి కృషి చేద్దాం.
ధన్యవాదాలు

*****