Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లోని ద్వారక ప్రాంతం సెక్టర్ 24 లో ఉన్న 34.87 హెక్టార్ల భూమిని ప్రతిపాదిత సెకండ్ డిప్లొమేటిక్ ఎన్ క్లేవ్ కోసం ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ నుండి ల్యాండ్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీసుకు బదలాయించడానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి


న్యూ ఢిల్లీ లోని ద్వారక ప్రాంతం సెక్టర్ 24 లో ఉన్న 34.87 హెక్టార్ల భూమిని ప్రతిపాదిత సెకండ్ డిప్లొమేటిక్ ఎన్ క్లేవ్ కోసం ఢిల్లీ డెవలప్ మెంట్ అథారిటీ (డి డి ఎ) నుండి ల్యాండ్ అండ్ డెవలప్ మెంట్ ఆఫీసు (ఎల్ & డి ఒ)కు బదలాయించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు.

ప్రస్తుతం చాణక్యపురి లో ఒక డిప్లొమేటిక్ ఎన్ క్లేవ్ ఉన్నది. అక్కడ దౌత్య కార్యాలయాల కోసం భూమిని ఎల్ & డి ఒ కేటాయించింది. ఢిల్లీ లో విదేశీ రాయబార కార్యాలయాలు/ దౌత్య కార్యాలయాల నిర్మాణం కోసం మరింత భూమిని డిప్లొమేటిక్ మిషన్ లు/ అంతర్జాతీయ సంస్థలకు కేటాయించవలసిన అవసరం ఉందన్న అభిప్రాయాన్ని విదేశ వ్యవహారాల శాఖ మంత్రిత్వ శాఖ వ్యక్తం చేసింది. ఇందుకుగాను డి డి ఎ ప్రత్యేకించిన న్యూ ఢిల్లీ లోని ద్వారక ప్రాంతం సెక్టర్ 24 లో ఉన్న 34.87 హెక్టార్ల భూమిని ఎల్ & డి ఒ కు బదలాయిస్తారు. ఈ సంస్థ సంబంధిత భూమిని రాజధాని నగరంలో రెండో డిప్లొమేటిక్ ఎన్ క్లేవ్ కు సమకూర్చుతుంది.

***