Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

థాయ్‌లాండ్ మాజీ ప్రధానితో మోదీ భేటీ

థాయ్‌లాండ్ మాజీ ప్రధానితో మోదీ భేటీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు బ్యాంకాక్‌లో థాయ్‌లాండ్ మాజీ ప్ర‌ధాని శ్రీ త‌క్సిన్ షినావత్రా‌తో సమావేశమయ్యారురక్షణవాణిజ్యంసంస్కృతి తదితర రంగాల్లో భారత్థాయ్‌లాండ్‌ల మధ్య సహకారానికి ఉన్న అపార అవకాశాలపై చర్చించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఈ విధంగా పోస్ట్ చేశారు

థాయ్‌లాండ్ మాజీ ప్రధాని తక్సిన్ షినావత్రాను కలవడం ఆనందంగా ఉందిపాలనవిధాన రూపకల్పనకు సంబంధించిన విషయాల్లో ఆయనకు అపార అనుభవం ఉందిఆయన భారత్‌కు గొప్ప మిత్రుడు. అటల్ జీతో చాలా ఆత్మీయ సంబంధం కలిగి ఉన్నారు.

శ్రీ షినావత్రానేను భారత్‌థాయ్‌లాండ్ సహకారం గురించిఅది మన దేశాల ప్రజలకు ఏవిధంగా ప్రయోజనం చేకూరుస్తుందనే దాని గురించి సుదీర్ఘంగా మాట్లాడుకున్నాంరక్షణవాణిజ్యంసంస్కృతి తదితర రంగాల్లో ఉన్న అపారమైన అవకాశాలపై చర్చించాం.

@ThaksinLive”