Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘ఉత్కళ దిబస’ సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


ఈ రోజు  ‘ఉత్కళ దిబస’. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒడిశా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఒడిశా చరిత్ర, సాహిత్యం, సంగీతాలను చూసుకొని భారత్ గర్వపడుతోందని ఒడిశా ప్రగతిని మరింత ముందుకు తీసుకుపోవడానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో పనిచేస్తున్నాయని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కొన్ని సందేశాలను ప్రధాని పొందుపరుస్తూ, ఆ సందేశాల్లో:

‘‘ఉత్కళ దిబస సందర్భంగా నేను నా హృదయపూర్వక శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

‘‘ఒడిశా వైభవోపేత సంస్కృతికి ఒక సిసలైన ప్రతీకగా ‘ఉత్కళ దిబస’ నిలుస్తోంది. ఒడిశా చరిత్ర, సాహిత్యం, సంగీతాలను చూసుకొని భారత్ గర్వపడుతోంది. ఒడిశా ప్రజలు కష్టపడి పనిచేసే తత్వం కలిగినవారు. విభిన్న రంగాల్లో వారు రాణిస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రగతిపథంలో మరింత ముందుకు తీసుకుపోవడానికి గత సంవత్సర కాలంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం  విస్తృత స్థాయిలో కృషి చేస్తున్నాయి..’’ అని పేర్కొన్నారు.

“ଉତ୍କଳ ଦିବସରେ ହାର୍ଦ୍ଦିକ ଶୁଭେଚ୍ଛା !

ଏହି ଦିବସ ଓଡ଼ିଶାର ସମୃଦ୍ଧ ସଂସ୍କୃତି ପ୍ରତି ଏକ ଉପଯୁକ୍ତ ସମ୍ମାନ । ଓଡ଼ିଶାର ଇତିହାସ, ସାହିତ୍ୟ ଓ ସଂଗୀତକୁ ନେଇ ଭାରତ ଗର୍ବିତ। ଓଡ଼ିଶାର ଲୋକମାନେ କଠିନ ପରିଶ୍ରମୀ ଏବଂ ବିଭିନ୍ନ କ୍ଷେତ୍ରରେ ଉତ୍କର୍ଷ ହାସଲ କରିଛନ୍ତି । ଗତ ଏକ ବର୍ଷ ଧରି କେନ୍ଦ୍ର ଏବଂ ଓଡ଼ିଶା ସରକାର ରାଜ୍ୟର ଆହୁରି ପ୍ରଗତି ପାଇଁ ବ୍ୟାପକ ଭାବେ କାର୍ଯ୍ୟ କରୁଛନ୍ତି ।”

*******

MJPS/SR