Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానితో శ్రీ బిల్ గేట్స్ భేటీ


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో శ్రీ బిల్ గేట్స్ ఈరోజు న్యూఢిల్లీలో భేటీ అయ్యారు. భారత అభివృద్ధి, 2047 నాటికి వికసిత భారత్‌ సాధించే మార్గాలపై ప్రధానమంత్రి శ్రీ మోదీతో విశేషంగా చర్చించినట్టు శ్రీ బిల్ గేట్స్ తెలిపారుప్రస్తుతం ప్రపంచాన్ని అమితంగా ప్రభావితం చేస్తున్న ఆరోగ్యంవ్యవసాయంకృత్రిమ మేధతదితర రంగాలలో అద్భుత పురోగతి సాధించే దిశగానూ చర్చించామన్నారు.

రాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించడం కోసం సాంకేతికతఆవిష్కరణలుసుస్థిరత వంటి విభిన్న అంశాలపై శ్రీ బిల్ గేట్స్ తో చర్చించినట్టు శ్రీ మోదీ వెల్లడించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

ఎప్పటిలాగేబిల్ గేట్స్ తో సమావేశం అద్భుతంగా సాగిందిరాబోయే తరాలకు మెరుగైన భవిష్యత్తును అందించడం కోసం సాంకేతికతఆవిష్కరణలుసుస్థిరత వంటి విభిన్న అంశాలపై మేం చర్చించాం.’’  

*************

MJPS/ST