‘డిజిటల్ అభివృద్ధి పురస్కారం 2025’ను భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) గెలిచినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆర్బీఐని ప్రశంసించారు. బ్రిటన్ లోని లండన్‌లో సెంట్రల్ బ్యాంకింగ్ ఈ పురస్కారంతో ఆర్బీఐని సత్కరించింది. ఆర్బీఐ సంస్థాగత డెవలపర్ టీం రూపొందించగా, అమలులోకి తెచ్చిన వినూత్న డిజిటల్ కార్యక్రమాలు ‘ప్రవాహ్’, ‘సారథి’లకు సెంట్రల్ బ్యాంకింగ్ గుర్తింపు లభించింది.
ఈ విజయాన్ని ప్రధాని ప్రశంసిస్తూ, సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంలో–
‘‘ప్రశంసించదగిన విజయం ఇది.. పాలనలో నవకల్పనకు, సామర్థ్యానికి అద్దంపడుతోంది.
డిజిటల్ నవకల్పనలు భారత్‌లో ఆర్థిక విస్తారిత అనుబంధ వ్యవస్థ (ఫైనాన్షియల్ ఇకోసిస్టమ్)ను బలపరుస్తూ, ఈ క్రమంలో ఎంతో మందికి సాధికారతను కల్పిస్తున్నాయి’’ అని పేర్కొన్నారు.
A commendable accomplishment, reflecting an emphasis towards innovation and efficiency in governance.
Digital innovation continues to strengthen India’s financial ecosystem, thus empowering countless lives. https://t.co/WomTSvXTCa
— Narendra Modi (@narendramodi) March 16, 2025
***
MJPS/ST