Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మారిషస్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం

మారిషస్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రదానం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మారిషస్ 57వ జాతీయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేడుకల సందర్భంగా ప్రధాని మోదీని మారిషస్ అధ్యక్షుడు శ్రీ ధరంబీర్ గోఖుల్ ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘గ్రాండ్ కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ అండ్ కీ ఆఫ్ ది ఇండియన్ ఓషన్’ (జీసీఎస్కే.)తో సత్కరించారు. శ్రీ మోదీ ఈ గౌరవాన్ని అందుకున్న తొలి భారతీయ నేత కావడం విశేషం.

భారత్, మారిషస్ దేశాల మధ్య నెలకొన్న ప్రత్యేక స్నేహ సంబంధాలు, 1.4 బిలియన్ల భారతీయులు, మారిషస్ లో నివసిస్తున్న వారి 1.3 మిలియన్ల సోదర సోదరీమణులకు అవార్డు అంకితమని  శ్రీ మోదీ వ్యాఖ్యానించారు.

జాతీయ దినోత్సవ వేడుకల్లో భాగంగా భారతీయ నౌకాదళానికి చెందిన ఒక బృందం కవాతులో పాల్గొనగా, భారతీయ నౌకా దళానికి చెందిన ఓడ ఒకటి లాంఛనంగా ‘పోర్ట్ కాల్’లో పాల్గొంది.