Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

విక‌సిత భారత్‌ను రూపుదిద్ద‌డంలో విశిష్ట మహిళల పాత్ర‌ను కొనియాడిన ప్రధానమంత్రి


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంద‌ర్భంగా విభిన్న రంగాల్లో అద్భుత ప్ర‌తిభాపాట‌వాలు ప్ర‌ద‌ర్శిస్తున్న మహిళలకు ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ తన సామాజిక మాధ్య‌మ వేదికలను అప్పగించారుత‌ద్వారా దేశ పురోగ‌మ‌నంలో ఆద్యంతం నారీశ‌క్తి ప్రధాన పాత్రను గుర్తించ‌డంలో త‌న‌దైన ప్ర‌త్యేక‌త‌ను ఆయ‌న చాటుకున్నారు.

ఈ నేప‌థ్యంలో నేటి ఉదయం నుంచి విశిష్ట మహిళలు తమ విజ‌య‌గాథ‌ను అంద‌రితో పంచుకుంటూ ఇతర మహిళలకు స్ఫూర్తినివ్వ‌డం ఆస‌క్తిగా గ‌మ‌నిస్తున్నాన‌ని శ్రీ మోదీ పేర్కొన్నారువారి సంకల్ప శ‌క్తివిజయాలు మ‌హిళల‌ అపార సామ‌ర్థ్యాన్ని ప్ర‌తిబింబిస్తున్నాయని చెప్పారుఈ రోజున మాత్ర‌మే కాదు… విక‌సిత భార‌త్‌ను రూపుదిద్ద‌డంలో వారి కీల‌క పాత్ర‌ను నిత్యం కొనియాడుతూనే ఉంటామని ప్రధాని వ్యాఖ్యానించారు.

   ఈ మేర‌కు సామాజిక మాధ్య‌మం ఎక్స్’ ద్వారా ప్ర‌జ‌ల‌తో పంచుకున్న సందేశంలో:

విశిష్ట మ‌హిళ‌లు ఉదయం నుంచి త‌మ‌ విజ‌య‌గాథ‌ల‌ను పంచుకుంటూ దేశంలోని మ‌హిళా లోకానికి స్ఫూర్తినివ్వ‌డాన్ని మీరంతా చూస్తున్నారుదేశంలోని వివిధ ప్రాంతాల్లో నివ‌సించే ఈ మహిళామ‌ణులు వివిధ రంగాలలో ఎంత‌గానో రాణించారుఅయితేఈ ప్ర‌యాణంలోని   అంతర్లీన ఇతివృత్తం– భారత నారీశక్తి ప్ర‌తిభాపాట‌వాలే.

   మ‌హిళా లోకానికిగ‌ల‌ అపార సామ‌ర్థ్యాన్ని వారి సంకల్పం శ‌క్తివిజయాలు ప్ర‌స్ఫుటం చేస్తున్నాయిఅందుకే ఈ రోజున మాత్ర‌మే కాకుండా విక‌సిత భార‌త్‌ను రూపుదిద్ద‌డంలో వారి కృషిని మ‌నం నిత్యం కొనియాడుతూనే ఉంటాం” అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.

****