Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రిపబ్లిక్ ప్లీనరీ సదస్సులో ప్రధాని ప్రసంగం

రిపబ్లిక్ ప్లీనరీ సదస్సులో ప్రధాని ప్రసంగం


నమస్కారం!

మీరంతా అలసిపోయి ఉంటారు.. అర్నబ్ గొంతు వినీవినీ మీ చెవులూ అలసిపోయుంటాయికూర్చో అర్నబ్.. ఇంకా ఎన్నికల సీజన్ మొదలవలేదుముందుగా ఈ వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన రిపబ్లిక్ టీవీకి శుభాకాంక్షలుఇంత పెద్ద పోటీని నిర్వహించి క్షేత్రస్థాయిలో యువతను భాగస్వాములను చేయడం ద్వారా వీరందరినీ మీరిక్కడికి తీసుకొచ్చారుజాతీయ స్థాయి చర్చల్లో యువత భాగస్వామ్యం ఆలోచనల్లో కొత్తదనాన్ని రేకెత్తిస్తుందిఅది వ్యవస్థలో నవోత్తేజాన్ని నింపుతుందిదాన్నే మనమిప్పుడు ఇక్కడ ఆస్వాదిస్తున్నాంఓ రకంగా యువత భాగస్వామ్యంతో బంధనాలన్నింటినీ విచ్ఛిన్నం చేయగలంహద్దులకు అతీతంగా విస్తరించ గలందానితో అసాధ్యమైన లక్ష్యమంటూ ఏదీ ఉండదుచేరుకోలేని గమ్యమంటూ ఏదీ లేదుఈ సదస్సు కోసం రిపబ్లిక్ టీవీ కొత్త ఆలోచనలతో పనిచేసిందిఈ కార్యక్రమం విజయవంతమవడం పట్ల మీ అందరికీ అభినందనలుమీకు నా శుభాకాంక్షలుఇందులో నా స్వార్థం కూడా కొంచెం ఉందిఒకటి– నేను కొన్ని రోజులుగా లక్ష మంది యువతను రాజకీయాల్లోకి తీసుకురావాలని అనుకుంటున్నానుఆ లక్ష మందీ కూడా తమ కుటుంబాల్లో రాజకీయాల్లోకి వచ్చిన మొదటి వ్యక్తులై ఉండాలికాబట్టి ఓ రకంగా ఇలాంటి కార్యక్రమాలు నా లక్ష్య సాధనకు రంగం సిద్ధం చేస్తున్నాయిరెండు– వ్యక్తిగతంగా నాకో ప్రయోజనముందిఅదేమిటంటే 2029లో ఓటు వేయబోతున్న వారికి 2014కు ముందు వార్తాపత్రికల పతాక శీర్షికల్లో ఏ అంశాలుండేవో తెలియదుపదీ పన్నెండు లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగేవని వారికి తెలియదు. 2029లో ఓటు వేసే సమయానికి.. గతంతో పోల్చి చూసుకునే సదుపాయం వారికి ఉండదుఆ పరీక్షలో నేను పాసవ్వాలిఆ దిశగా యువతను సన్నద్ధులను చేసేలా జరుగుతున్న ఇటువంటి కార్యక్రమాలు మా ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తాయన్న విశ్వాసం నాకుంది.

మిత్రులారా,

ఇప్పుడు ప్రపంచమంతా ఈ శతాబ్ధం భారతదేశానిదే అని స్పష్టంగా చెప్తోందిగతంలో మీరిలాంటివి వినలేదుభారత్ సాధించిన విజయాలు ప్రపంచంలో కొత్త ఆశలు రేకెత్తించాయితాను మునగడమే కాకుండా తనతోపాటు మనల్నీ ముంచేస్తుందంటూ ఒకప్పుడు భారత్ గురించి చెప్పుకునేవారుకానీ నేడు మన దేశం ప్రపంచ వృద్ధికి చోదక శక్తిగా నిలుస్తోందినేడు మనం చేసే కృషిసాధించే విజయాలే భారత్ భవిష్యత్తును నిర్దేశిస్తాయని మనకు తెలుసుస్వాతంత్ర్యం వచ్చిన 65 సంవత్సరాల తరువాత కూడా భారత్ ప్రపంచంలో పదకొండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానానికే పరిమితమైందిఅయితేగత దశాబ్ద కాలంలో మనం అయిదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగాంఅదే వేగంతో ఇప్పుడు మనం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగబోతున్నాం.

మిత్రులారా,

18 సంవత్సరాల కిందట ఏం జరిగిందో కూడా నేను మీకు గుర్తు చేస్తానుసరిగ్గా 18 సంవత్సరాలనే నేను ఎంచుకోవడానికి ఓ ప్రత్యేక కారణముంది. 18 ఏళ్లు నిండిమొదటిసారి ఓటు వేయబోతున్న వారికి 18 ఏళ్ల ముందు నాటి కాలం గురించి తెలియదుఅందుకే నేను ఆ సంఖ్యను ఎంచుకున్నాను. 18 సంవత్సరాల కిందటఅంటే 2007లో భారత వార్షిక జీడీపీ ఒక ట్రిలియన్ డాలర్లకు చేరిందిఇంకా సులభంగా చెప్పాలంటే.. భారత్ లో ఆర్థిక కార్యకలాపాలు ఏడాదికి ఒక ట్రిలియన్ డాలర్లుగా ఉన్న సమయమదిఇప్పుడు నేడు ఏం జరుగుతున్నదో చూశారాఇప్పుడు ఒక్క త్రైమాసికంలోనే దాదాపు ఒక ట్రిలియన్ డాలర్ల విలువైన ఆర్థిక కార్యకలాపాలు జరుగుతున్నాయిఅంటే ఏమిటి? 18 సంవత్సరాల కిందటదేశంలో ఒక సంవత్సరంలో జరిగిన ఆర్థిక కార్యకలాపాలు ఇప్పుడు మూడు నెలల్లోనే జరుగుతున్నాయినేటి భారత్ ఎంత వేగంగా పురోగమిస్తోందో చెప్పడానికి ఇదే నిదర్శనంగత దశాబ్ద కాలంలో ఎంత పెద్ద మార్పులు వచ్చాయోవాటి ఫలితాలు ఎలా ఉన్నాయో వివరించే కొన్ని ఉదాహరణలు మీకు చెప్తానుగత పది సంవత్సరాలలో 25 కోట్ల మంది పేదరికాన్ని అధిగమించడం మనం సాధించిన విజయంచాలా దేశాల మొత్తం జనాభా కన్నా కూడా ఈ సంఖ్య పెద్దదిపేదలకు ఒక రూపాయి పంపితే 15 పైసలు మాత్రమే వారికి చేరుతున్నాయని నేరుగా ప్రధానమంత్రే చెప్పిన విషయంస్వయంగా ప్రభుత్వమే దానిని అంగీకరించిన కాలం మీకు గుర్తుండే ఉంటుందిఆ 85 పైసలను వారే తినేసేవారుఇక ఇప్పటి రోజులను చూడండి– గత దశాబ్ద కాలంలో ప్రత్యక్ష ప్రయోజన బదిలీ (డీబీటీద్వారా రూ. 42 లక్షల కోట్లను నేరుగా పేదల ఖాతాల్లో జమ చేశాంరూపాయికి 15 పైసలు లెక్కిస్తేరూ. 42 లక్షల కోట్లకు ఎంత లెక్కవుతుందిమిత్రులారాఈరోజు ఢిల్లీ నుంచి వెళ్లిన ఒక్కో రూపాయిలో మొత్తం 100 పైసలూ లబ్ధిదారులకు అందుతున్నాయి.

మిత్రులారా,

పదేళ్ల కిందటి వరకు సౌర శక్తి విషయంలో భారత్  ప్రస్తావనే ఉండేది కాదుకానీ నేడు సౌరశక్తి సామర్థ్యం పరంగా ప్రపంచంలోని అయిదు అగ్రగామి దేశాల్లో భారత్ ఒకటిమన సౌరశక్తి సామర్థ్యాన్ని 30 రెట్లు పెంచుకున్నాంసౌర మాడ్యూళ్ల తయారీ కూడా 30 రెట్లు పెరిగిందిపదేళ్ల క్రితం హోళీ పిచికారీలుపిల్లల బొమ్మలను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళంనేడు మన బొమ్మల ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయిపదేళ్ల కిందటి వరకు మన సైన్యానికి అవసరమైన రైఫిళ్లను కూడా విదేశాల నుంచి దిగుమతి చేసుకునేవాళ్ళంకానీగత పదేళ్లలో మన రక్షణ ఎగుమతులు 20 రెట్లు పెరిగాయి.

మిత్రులారా,

ఈ పది సంవత్సరాల కాలంలో మనం ప్రపంచంలో రెండో అతిపెద్ద ఉక్కు ఉత్పత్తిదారుగారెండో అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీదారుగామూడో అతిపెద్ద అంకుర సంస్థల నిలయంగా ఎదిగాంఈ పది సంవత్సరాలలోమౌలిక సదుపాయాలపై మూలధన వ్యయాన్ని ఐదు రెట్లు పెంచాందేశంలో విమానాశ్రయాల సంఖ్య రెట్టింపయ్యిందిఈ పదేళ్లలో దేశంలో ఏఐఐఎంఎస్ ల సంఖ్య మూడింతలైందిఈ పదేళ్లలో వైద్య కళాశాలలువైద్య సీట్ల సంఖ్య కూడా దాదాపు రెట్టింపైంది.

మిత్రులరా,

నేటి భారత్ భిన్నమైనదినేటి భారత్ ఆలోచనలు పెద్దవిపెద్ద లక్ష్యాలను నిర్దేశించుకుంటుందిగొప్ప ఫలితాలను సాధిస్తుందిదేశం ఆలోచన తీరులో మార్పు వల్లే ఇది సాధ్యమవుతోందిభారతదేశం గొప్ప ఆశయాలతో ముందుకు సాగుతోందిగతంలో మన ఆలోచన ఎలా ఉండేదంటే – పర్వాలేదుఅది జరుగుతూంటుందిజరగనివ్వండిఏదైనా జరగనివ్వండిఎవరేం చేయాలో అది చేస్తారుమీ పని మీరు చేసుకోండి.  గతంలో ఆలోచనా విధానం సంకుచితంగా మారిందినేను మీకో ఉదాహరణ చెప్తానుఒకప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో.. ఎక్కడైనా కరువు ఉన్నాఅది కరువు ప్రభావిత ప్రాంతమైనా ప్రజలు వినతిపత్రాలు ఇచ్చేవారుమరి వారు ఏమి డిమాండ్ చేసేవారు – సర్కరువులు వస్తూంటాయిఈ కరువు సమయంలో సహాయక చర్యలు మొదలుపెట్టండిమేం గుంతలు తవ్వి మట్టిని తీస్తాందాన్ని వేరే గుంతల్లో నింపుతాం– ప్రజలు ఇదే డిమాండ్ చేసేవారుఎవరో ఒకరు ఇలా అడిగేవారు– సర్దయచేసి మా ప్రాంతంలో చేతి పంపులు ఏర్పాటు చేయించండి అని డిమాండ్ చేసేవారుపంపు నీళ్ల కోసమే వాళ్ళు డిమాండ్ చేసేవారుఒక్కోసారి ఎంపీల ఏమిటంటే – కాస్త ముందుగానే ఆయనకు గ్యాస్ సిలిండర్ ఇవ్వండి అనిఆ పని ఎంపీలు చేశారువారికి 25 కూపన్లు వచ్చేవిపార్లమెంటు సభ్యుడు తన మొత్తం ప్రాంతంలోనూ గ్యాస్ సిలిండర్లను అందించడం కోసం ఆ 25 కూపన్లనే వినియోగించేవారుఏడాదిలో ఒక ఎంపీకి 25 సిలిండర్లు.. 2014 వరకు ఇది కొనసాగిందిఅటుగా వెళ్తున్న రైలును తమ ప్రాంతంలోనూ ఆపాలని ఎంపీలు డిమాండ్ చేసేవారురైలు ఆపేలా ఓ స్టాపేజీ కోసం వారు డిమాండ్ చేశారు.

నేను చెబుతున్న ఈ విషయాలన్నీ 2014కు ముందు దాకా జరిగినవేచాలా పాతవేం కాదుకాంగ్రెస్ దేశ ప్రజల ఆకాంక్షలను తుడిచిపెట్టిందిఅందుకే దేశ ప్రజలు ఆశలు పెట్టుకోవడం కూడా మానేశారువారి నుంచివారు చేస్తున్న పనుల నుంచి ఏ ప్రయోజనమూ కలగదని నిర్ణయానికి వచ్చేశారు. ‘‘సరే సోదరానువ్వు ఈ మాత్రమే చేయగలిగితేఇదే చెయ్యి చాలు’’ అని ప్రజలూ అనేవారుమరి నేడు పరిస్థితులుఆలోచనా తీరు ఎంత వేగంగా మారుతున్నాయో మీరు చూడవచ్చుఎవరు పని చేయగలరోఎవరు ఫలితాలను రాబట్టగలరో ఇప్పుడు ప్రజలకు తెలుసుసాధారణ పౌరుల మాటలు మాత్రమే కాదు.. పార్లమెంటులో ప్రసంగాలను విన్నా మీరో విషయాన్ని గమనించవచ్చుమోదీ గారు ఇదెందుకు చేయడం లేదంటూ ప్రతిపక్షాలు కూడా అదే ఉపాన్యాసాన్నిస్తాయిఅంటేమేం ఆ పని చేస్తామని వారికి తెలుసు.

మిత్రులారా,

నేటి మన ఆకాంక్షలను వారి మాటలు ప్రతిబింబిస్తాయిమాట్లాడే విధానం మారిందిప్రజలిప్పుడు ఏం డిమాండ్ చేస్తున్నారు?- గతంలో తమ దగ్గర రైలును ఆపమని అడిగేవారుమరిప్పుడు.. మా ప్రాంతంలో కూడా వందే భారత్ రైలు ప్రారంభించడండంటూ డిమాండ్ చేస్తున్నారుకొన్నాళ్ల కిందట నేను కువైట్ వెళ్లినప్పుడు మామూలుగానే లేబర్ క్యాంపు దగ్గరికి వెళ్లానునా దేశ ప్రజలు ఎక్కడ పనిచేస్తున్నా వారిని కలవడానికే ప్రయత్నిస్తానునేనక్కడ కార్మికులుండే కాలనీకి వెళ్లి కువైట్ లో పనిచేసే కార్మిక సోదరీ సోదరులతో మాట్లాడుతున్నానుఅక్కడ కొందరు పదేళ్ల నుంచికొందరు 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్నారుఇప్పుడు చూడండీ – బీహార్‌లోని ఒక గ్రామానికి చెందిన ఓ కార్మికుడు సంవత్సరాలుగా కువైట్‌లో పనిచేస్తున్నాడుఅప్పుడప్పుడు ఇక్కడికి వస్తారునేను ఆయనతో మాట్లాడుతుండగా.. ‘‘సార్నాదో ప్రశ్న’’ అంటే అడగమన్నానువాళ్ల ఊరి దగ్గర జిల్లా కేంద్రంలో ఓ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించాలని ఆయన అడిగారునేనెంతో ఆనందించానుబిహార్ లోని ఓ ఊరి నుంచి వెళ్లి సంవత్సరాలుగా కువైట్ లో పనిచేస్తున్న ఓ కార్మికుడు కూడా తన జిల్లాలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మిస్తారన్న ఆలోచన చేయడం సంతోషాన్నిచ్చిందిఇదీ నేటి సగటు భారతీయ పౌరుడి ఆకాంక్షఈ ఆకాంక్షే అభివృద్ధి చెందిన భారత్ గా ఎదిగే లక్ష్యం దిశగా దేశాన్ని నడిపిస్తోంది.  

మిత్రులారా,
పౌరులపై ఆంక్షలనువారికి ఉన్న అడ్డంకులను తొలగించినప్పుడుఆటంకాల గోడలను కూల్చినప్పుడే సమాజందేశం బలం పెరుగుతుందిఅప్పుడే ఆ దేశ పౌరుల బలం కూడా పెరుగుతుందిఆకాశం కూడా ఎత్తులో చిన్నదిగా అవుతుందిఅందుకే గత ప్రభుత్వాలు ప్రజల ముందు ఉంచిన అడ్డంకులను నిరంతరం తొలగిస్తున్నాంఇప్పుడు నేను అంతరిక్ష రంగానికి సంబంధించిన ఒక ఉదాహరణ ఇస్తున్నానుగతంలో అంతరిక్ష రంగంలో ప్రతిదానికి ఇస్రో బాధ్యత వహించేదిఇస్రో ఖచ్చితంగా గొప్ప పని చేసింది.. కానీ అంతరిక్ష విజ్ఞానంవ్యవస్థాపకతకు సంబంధించి దేశంలో ఉన్న సామర్థ్యాన్ని ఉపయోగించుకోలేదుఈ సామర్థ్యం అంతా ఇస్రోకే పరిమితమైందిఅంతరిక్ష రంగ ద్వారాలను యువ ఆవిష్కర్తల కోసం తెరిచాంనేను ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు అది ఏ వార్తాపత్రికలో శీర్షికగా రాలేదుఎందుకంటే దీనిపై అవగాహన కూడా లేదుఈ రోజు దేశంలో 250కి పైగా అంతరిక్ష రంగ అంకురాలు ఏర్పాటయ్యాయని తెలిస్తే రిపబ్లిక్ టీవీ వీక్షకులు సంతోషిస్తారుఇది నా దేశ యువత సాధించిన అద్భుతంఈ అంకురాలు నేడు విక్రమ్ఎస్అగ్నిబాన్ వంటి రాకెట్లను తయారు చేస్తున్నాయిమ్యాపింగ్ రంగంలోనూ అదే జరిగిందిచాలా ఆంక్షలు ఉండేవిఅట్లాస్ కూడా తయారు చేయలేకపోయేవారుటెక్నాలజీ మారిందిఇంతకుముందు భారత్‌లో మ్యాప్ తయారు చేయాలంటే ఏళ్ల తరబడి ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేదిఈ నియంత్రణను కూడా తొలగించాంప్రస్తుతం జియో స్పేషియల్ మ్యాపింగ్‌కు సంబంధించిన డేటా కొత్త అంకురాలకు మార్గం సుగమం చేస్తోంది.

మిత్రులారా,
అణుశక్తిదానికి సంబంధించిన రంగాలు కూడా గతంలో ప్రభుత్వ నియంత్రణలో ఉండేవిఆంక్షలుఅడ్డంకులుగోడలు నిర్మించారుఇప్పుడు ఈ ఏడాది బడ్జెట్‌లో ఈ రంగంలో ప్రైవేటుకు అనుమతి ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 2047 నాటికి 100 గిగావాట్ల అణుశక్తి సామర్థ్యాన్ని అదనంగా సాధించాలన్న లక్ష్యాన్ని ఇది బలోపేతం చేసింది

మిత్రులారా,
రూ. 100 లక్షల కోట్లఅంతకంటే ఎక్కువ ఊపయోగించుకొని ఆర్థిక సామర్థ్యం మన పల్లెల్లోనే ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారుదీన్ని మీ ముందు మళ్లీ చెబుతున్నాను – రూ.100 లక్షల కోట్లుఇది చిన్న సంఖ్య కాదుఈ ఆర్థిక సామర్థ్యం గ్రామాల్లో ఇళ్ల రూపంలో ఉందిమరింత సరళంగా మీకు వివరిస్తానుఇప్పుడు దిల్లీ వంటి నగరంలో మీ ఇంటి విలువ రూ.50 లక్షలుకోటిరూ.2 కోట్లు ఉంటే.. ఆ విలువపై బ్యాంకు రుణం కూడా లభిస్తుందిమీకు దిల్లీ నగరంలో ఇల్లు ఉంటే బ్యాంకు నుంచి కోట్ల రూపాయల రుణం తీసుకోవచ్చుఇప్పుడు ప్రశ్న ఏమిటంటే.. ఇళ్లు దిల్లీలోనే కాదుపల్లెల్లో కూడా ఉన్నాయిఅక్కడ కూడా ఇళ్ల యజమానులు ఉన్నారుఇక్కడ జరిగింది అక్కడ ఎందుకు జరగడం లేదుగ్రామాల్లో ఇళ్లపై రుణాలు అందడం లేదు ఎందుకంటే దేశంలో గ్రామాల్లో ఇళ్లకు చట్టబద్ధమైన పత్రాలు లేవుమ్యాపింగ్ కూడా సరిగ్గా లేదుదీనివల్ల గ్రామాల్లో ఉన్న ఈ ఆర్థిక సామర్థ్య ప్రయోజనాన్ని దేశందేశ ప్రజలు సరిగ్గా పొందలేకపోయారుఇది కేవలం భారత్‌ సమస్య మాత్రమే కాదుప్రపంచంలోని పెద్ద దేశాలలోని ప్రజలకు కూడా ఆస్తి హక్కులు లేవుప్రజలకు ఆస్తి హక్కులు కల్పించే దేశ జీడీపీ పెరుగుతుందని పెద్ద పెద్ద అంతర్జాతీయ సంస్థలు చెబుతున్నాయి

మిత్రులారా,
భారతదేశంలోని గ్రామాల్లో ఇళ్లకు ఆస్తి హక్కులు కల్పించడానికి మేం స్వామిత్వ పథకాన్ని తీసుకొచ్చాంఇందులో ప్రతి గ్రామంలో డ్రోన్ సర్వే నిర్వహించి ప్రతి ఇంటిని మ్యాపింగ్ చేస్తున్నాంనేడు దేశవ్యాప్తంగా ఇళ్లకు సంబంధించిన యాజమాన్య కార్డులు అందుతున్నాయిప్రభుత్వం రెండు కోట్లకు పైగా యాజమాన్య హక్కులకు సంబంధించిన కార్డులను పంపిణీ చేసిందిఈ పని నిరంతరాయంగా జరుగుతోందిగతంలో యాజమాన్య హక్కుల కార్డులు లేకపోవడంతో గ్రామాల్లో అనేక వివాదాలు ఉండేవిప్రజలు కోర్టులకు వెళ్లాల్సి వచ్చేదిఇవన్నీ ఇప్పుడు ముగిశాయిఇప్పుడు ఈ యాజమాన్య కార్డులపై బ్యాంకుల నుంచి రుణాలు పొందుతుండటంతో గ్రామస్థులు సొంతంగా వ్యాపారం ప్రారంభించి స్వయం ఉపాధి పొందుతున్నారుమొన్న నేను ఈ స్వామిత్వ పథకం  లబ్ధిదారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడానుఈ సందర్భంగా రాజస్థాన్‌కు చెందిన ఓ సోదరితో సంభాషించానుఆమె యాజమాన్య కార్డు వచ్చాక రూ.9 లక్షలు రుణం తీసుకొనివ్యాపారం ప్రారంభించిసగం రుణం తిరిగి చెల్లించారుమిగతా రుణం తిరిగి చెల్లించేందుకు ఎక్కువ సమయం పట్టదనిఇంకా మరిన్ని రుణాల వచ్చే అవకాశం కూడా ఉందని ఎంతో అత్మధైర్యంతో చెప్పారు.
మిత్రులారా,
నేను ఇచ్చిన అన్ని ఉదాహరణల్లో అత్యంత ఎక్కువ లబ్దిపొందింది దేశ యువతేఅభివృద్ధి చెందిన భారత్‌లో అతిపెద్ద భాగస్వాములుగా ఉన్న యువత నేటి భారత్‌కు ఎక్స్ఫ్యాక్టర్‌గా ఉన్నారుఈ ఎక్స్ అంటే ఎక్స్‌పెరిమెంటేషన్ఎక్సలెన్స్ఎక్స్‌టెన్షన్ఎక్స్‌పెరిమెంటేషన్‌ అంటే మన యువత పాత మార్గాలను దాటి కొత్త మార్గాలను సృష్టించారుఎక్సలెన్స్ అంటే యువత ప్రపంచ స్థాయి మైలురాళ్లను నిర్ణయించిందిఎక్స్‌టెన్షన్‌ అంటే 140 కోట్ల మంది దేశప్రజల సృజనాత్మకతను మన యువత పెంచిందిమన యువత దేశంలోని ప్రధాన సమస్యలకు పరిష్కారాలను అందించగలదుకానీ ఈ సామర్థ్యాన్ని ఇంతకు ముందు సరిగ్గా ఉపయోగించుకోలేదుయువత కూడా హ్యాకథాన్ల ద్వారా దేశ సమస్యలకు పరిష్కారం చూపగలరని గత ప్రభుత్వాలు భావించలేదుఈ రోజు మేం ప్రతి సంవత్సరం స్మార్ట్ ఇండియా హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నాంఇప్పటి వరకు 10 లక్షల మంది యువత ఇందులో భాగస్వాములయ్యారుపాలనకు సంబంధించిన అనేక సమస్యలను అనేక మంత్రిత్వ శాఖలుప్రభుత్వ విభాగాలు యువతు ముందు ఉంచిపరిష్కారం ఏమిటో చెప్పాలని కోరాయిహ్యాకథాన్‌లో మన యువత రెండున్నర వేల పరిష్కారాలను అభివృద్ధి చేసి దేశానికి అందించారుమీరు కూడా ఈ హ్యాకథాన్ సంస్కృతిని ముందుకు తీసుకెళ్లడం సంతోషంగా ఉందివీటిలో విజేతలుగా నిలిచిన యువతను అభినందిస్తున్నానుఆ యువజనులను కలిసే అవకాశం నాకు లభించినందుకు నేను సంతోషంగా ఉన్నాను.
మిత్రులారా,
గత పదేళ్లలో దేశం పాలనలో కొత్త యుగాన్ని చవిచూసిందిప్రభావం లేని పాలనను గడచిన దశాబ్దంలో  ప్రభావవంతమైన పాలనగా మార్చాంక్షేత్రస్థాయికి వెళ్లినప్పుడు ఫలానా ప్రభుత్వ పథకం ప్రయోజనాన్ని తొలిసారిగా పొందామని ప్రజలు చెబుతున్నారుఅంతకు ముందు ఆ ప్రభుత్వ పథకాలు లేవని కాదుగతంలో కూడా పథకాలు ఉండేవి కానీ ఈ స్థాయిలో చిట్టచివరి వ్యక్తి వరకు అవి అందేలా చూడటం ఇదే మొదటిసారిప్రధాన మంత్రి ఆవాస్ యోజన లబ్ధిదారుల ముఖాముఖిలను మీరు తరచుగా నిర్వహిస్తారుగతంలో పేదలకు ఇళ్లు కాగితాలకే వరకే మంజూరయ్యాయినేడు క్షేత్రస్థాయిలో నిరుపేదలకు ఇళ్లు కట్టిస్తున్నాంగతంలో ఇంటి నిర్మాణ ప్రక్రియ మొత్తం ప్రభుత్వ ఆధీనంలో ఉండేదిఏ రకం ఇల్లు నిర్మించాలిఎలాంటి సామగ్రిని ఉపయోగించాలనేది ప్రభుత్వం నిర్ణయించేదిఈ విషయంలో ఇంటి యజమానే నిర్ణయం తీసుకునేలా చేశాంప్రభుత్వం లబ్ధిదారుడి ఖాతాలో డబ్బులు వేస్తుంది.. ఎలాంటి ఇల్లు కట్టుకోవాలో లబ్ధిదారుడే నిర్ణయిస్తాడుఅలాగే ఇంటి డిజైన్ కోసం దేశవ్యాప్తంగా పోటీలు నిర్వహించిఇళ్ల నమూనాలను ప్రజల ముందుకు తీసుకురావడండిజైనింగ్ కోసం ప్రజలను భాగస్వామ్యం చేయడంప్రజా భాగస్వామ్యంతో నిర్ణయాలు తీసుకోవటం వంటివి చేశాందీంతో ఇళ్ల నాణ్యత కూడా మెరుగై ఇళ్ల నిర్మాణం కూడా శరవేగంగా పూర్తౌతోందిఇటుకలురాళ్లతో సగం నిర్మించిన ఇళ్లే పేదలకు దిక్కుగా ఉండేవిమేం వారి కళల ఇంటిని నిర్మిస్తున్నాంఈ ఇళ్లకు కుళాయి నీరుఉజ్వల పథకం కింద గ్యాస్ సదుపాయంసౌభాగ్య పథకం కింద విద్యుత్ సౌకర్యం ఉన్నాయినాలుగు గోడలతో నిర్మించటమే కాదు ఆ ఇళ్లకు జీవం పోశాం.
మిత్రులారా,
ఏ దేశ అభివృద్ధికైనా జాతీయ భద్రత చాలా ముఖ్యమైన అంశంగత దశాబ్ద కాలంలో భద్రత విషయంలో ఎంతో కృషి చేశాంగతంలో వరుస బాంబు పేలుళ్ల బ్రేకింగ్ న్యూస్ టీవీల్లో ప్రసారమయ్యేవిస్లీపర్ సెల్స్ నెట్‌వర్క్‌ గురించి ప్రత్యేక కార్యక్రమాలు ఉండేవిఇవన్నీ నేడు టీవీ తెరపైభారత్ నుంచి మాయమయ్యాయిగతంలో మీరు రైలులో ప్రయాణించినప్పుడు లేదా విమానాశ్రయానికి వెళ్లినప్పుడు ఎవరు ఉపయోగించని బ్యాగ్‌ ఎక్కడైన పడి ఉండే  దానిని తాకొద్దు అనే హెచ్చరికలు వినిపించేవినేడు ఈ 18-20 సంవత్సరాల యువకులు ఇది విని ఉండరునేడు దేశంలో నక్సలిజం తన చివరి గడియలను లెక్కిస్తోందిగతంలో వందకు పైగా జిల్లాలు నక్సలిజం గుప్పిట్లో ఉంటే నేడు రెండు డజను జిల్లాలకే అది పరిమితమైందిఅన్నింటికంటే ముందు దేశం అనే స్ఫూర్తితో పనిచేసినప్పుడే ఇది సాధ్యమైందిఈ ప్రాంతాల్లో పరిపాలనను చిట్టచివరి స్థాయి వరకు తీసుకెళ్లాంఅనతికాలంలోనే ఈ జిల్లాల్లో వేలాది కిలోమీటర్ల మేర రోడ్లుపాఠశాలలుఆసుపత్రులు నిర్మించాం. 4జీ మొబైల్ నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తెచ్చాందేశం నేడు ఈ ఫలితాలను చూస్తోంది.
మిత్రులారా,
ప్రభుత్వ నిర్ణయాత్మక నిర్ణయాల వల్ల నేడు నక్సలిజం అడవుల నుంచి తుడిచిపెట్టుకుపోతోంది కానీ పట్టణ కేంద్రాల్లో తన మూలాలను విస్తరిస్తోందిఅర్బన్ నక్సల్స్ ఎంత వేగంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరింపజేశారంటే.. ఒకప్పుడు గాంధీజీ స్ఫూర్తితోఅర్బన్ నక్సల్స్‌ను వ్యతిరేకించిన భారత మూలాలతో ముడిపడి ఉన్న రాజకీయ పార్టీల్లోకి ఇప్పుడు అర్బన్ నక్సల్స్ ప్రవేశించారునేడు ఆయా పార్టీల్లో అర్బన్ నక్సల్స్ గొంతువారి భాష వినిపిస్తోందిదీన్ని బట్టి వాటి మూలాలు ఎంత లోతుగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చుదేశాభివృద్ధికిమన వారసత్వానికి అర్బన్ నక్సల్స్ గట్టి వ్యతిరేకులని మనం గుర్తుంచుకోవాలిఅర్బన్ నక్సల్స్‌ను బట్టబయలు చేసే బాధ్యతను కూడా అర్నబ్ తీసుకున్నారుఅభివృద్ధి చెందిన భారత్‌కు అభివృద్ధి అవసరందీనితో పాటు వారసత్వాన్ని బలోపేతం చేయడం కూడా అవసరంఅందుకే అర్బన్ నక్సల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి.
మిత్రులారా,
ప్రతి సవాలును ఎదుర్కొంటూనే నేటి భారతదేశం కొత్త శిఖరాలను అధిరోహిస్తోందిరిపబ్లిక్ టీవీ నెట్వర్క్‌లోని మీరంతా దేశం ప్రథమం అనే స్ఫూర్తితో జర్నలిజానికి కొత్త కోణాన్ని అందిస్తారని నేను విశ్వసిస్తున్నానుమీ జర్నలిజం ద్వారా అభివృద్ధి చెందిన భారత్‌ ఆకాంక్షను మీరు ఉత్తేజపరచడం కొనసాగిస్తారని నమ్ముతూ.. మీకు కృతజ్ఞతలుశుభాకాంక్షలు తెలియజేస్తున్నానుధన్యవాదాలు!

గమనికప్రధాన మంత్రి హిందీలో చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం.

 

***