Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేప‌థ్యంలో మహిళా సాధికారతపై నిబద్ధతను పునరుద్ఘాటించిన ప్రధానమంత్రి


అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నారీశ‌క్తికి వంద‌నం చేస్తున్నాన‌ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు.

దేశంలోని మహిళల సాధికారత లక్ష్యంగా త‌మ ప్రభుత్వం స‌దా కృషి చేస్తున్న‌ద‌ని వివ‌రిస్తూ– నేను ఇదివ‌ర‌కే వాగ్దానం చేసిన మేర‌కు విభిన్న రంగాలలో తమదైన ముద్ర వేస్తున్న మహిళామ‌ణుల‌కు ఈ రోజున నా సామాజిక మాధ్య‌మ ఖాతాల‌ను అప్ప‌గిస్తున్నాను అని శ్రీ మోదీ ప్ర‌క‌టించారు.

ఈ మేర‌కు సామాజిక మాధ్య‌మం ఎక్స్‘ ద్వారా పంపిన సందేశంలో:

“#మహిళా దినోత్సవం సందర్భంగా మ‌న నారీశక్తికి స‌గౌర‌వ వంద‌నంమా ప్రభుత్వం స‌దా మహిళల సాధికారత కోసం కృషి చేస్తుందిమా పథకాలుకార్యక్రమాలు ప్ర‌భుత్వ ల‌క్ష్యాన్ని ప్రతిబింబిస్తాయిఇక నేనిదివ‌ర‌కే వాగ్దానం చేసిన ప్ర‌కారం– విభిన్న రంగాల్లో త‌మ‌దైన ముద్ర వేస్తున్న మ‌హిళామ‌ణుల‌కు ఇవాళ నా సామాజిక మాధ్య‌మ ఖాతాల‌ను స్వాధీనం చేస్తున్నాను!” అని ప్ర‌ధాన‌మంత్రి పేర్కొన్నారు.