మిత్రులారా,
ఈ రోజు గంగామాత జన్మ స్థలమైన ఈ పవిత్ర భూమి నుంచి దేవభూమి, దేశ నలుమూలల, తూర్పు–పడమర–ఉత్తర–దక్షిణం, మధ్య ప్రాంతాలకు చెందిన వారికి, ముఖ్యంగా యువ తరానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
మిత్రులారా,
శీతాకాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు ఉండి సూర్యుడు కూడా కనిపించని పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో పర్వతాలపై వచ్చే సూర్యరశ్మిని అక్కడి ప్రజలు ఆస్వాదిస్తారు. ఇది ఒక ప్రత్యేక కార్యక్రమంగా మారొచ్చు. మరి గర్వాలీలో దీన్ని ఏమని పిలుస్తాం? ‘ఘమ్ తపో పర్యాతన్‘, అవునా! ‘ఘమ్ తపో పర్యాతన్‘. దీనికోసం దేశం నలుమూలల నుంచి ప్రజలు ఉత్తరాఖండ్‌లో తప్పక పర్యటించాలి. ముఖ్యంగా కార్పొరేట్ ప్రపంచానికి చెందిన స్నేహితులు శీతాకాల పర్యాటకంలో భాగం కావాలి. సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించేందుకు శీతాకాలం, దేవభూమి కంటే మంచి ప్రదేశం మరొకటి ఉండదు. కార్పొరేట్ ప్రపంచంలోని పెద్దలు నిర్వహించే సెమినార్ల కోసం ఉత్తరాఖండ్‌కు రావాలని, ఇక్కడి మైస్ రంగంలో అవకాశాలను అన్వేషించాలని నేను కోరుతున్నాను. ప్రజలు ఇక్కడకు వచ్చి యోగా, ఆయుర్వేదం ద్వారా ద్వారా పునరుత్తేజం పొందొచ్చు, తిరిగి శక్తిని నింపుకోవచ్చు. దేశంలోని విశ్వవిద్యాలయాలు, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలలోని యువ స్నేహితులందరూ శీతాకాల పర్యటనల కోసం ఉత్తరాఖండ్‌ను ఎంచుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను.
మిత్రులారా,
పెళ్లిళ్లకు సంబంధించిన మన ఆర్థిక వ్యవస్థ వేల కోట్ల విలువైనది. పెళ్లిళ్ల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంటారు. ఇది చాలా పెద్ద ఆర్థిక వ్యవస్థ. భారత్‌లో పెళ్లి చేసుకోవాలి అని నేను దేశ ప్రజలను కోరిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ఈ రోజుల్లో ప్రపంచంలోని ఇతర దేశాలకు పెళ్లి కోసం వెళ్తుంటారు. ఇక్కడ ఏం లోటు ఉంది? ఇక్కడ ఖర్చు చేయండి. ఈ విషయంలో ఉత్తరాఖండ్ కంటే గొప్ప ప్రాంతం ఏముంటుంది. శీతాకాలంలో డెస్టినేషన్ పెళ్లిల కోసం దేశ ప్రజలు ఉత్తరాఖండ్‌కు ప్రాధాన్యత ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. అలాగే భారత సినీ పరిశ్రమల నుంచి కూడా నాకు చాలా అంచనాలు ఉన్నాయి. సినిమాలకు సంబంధించి అత్యంత స్నేహపూర్వక రాష్ట్రంగా ఉత్తరాఖండ్ అవార్డును అందుకుంది. ఇక్కడ ఆధునిక సౌకర్యాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. అందువల్ల చలికాలంలో సినిమా షూటింగులకు ఉత్తరాఖండ్ యావత్ భారతదేశానికి ఇష్టమైన గమ్యస్థానంగా మారే సామర్థ్యం ఉంది.
మిత్రులారా,
శీతాకాల పర్యాటకం ప్రపంచంలోని అనేక దేశాలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఉత్తరాఖండ్‌లో శీతాకాల పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు, దీనికి సంబంధించి ఇలాంటి దేశాల నుంచి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు. ఉత్తరాఖండ్ పర్యాటక రంగానికి సంబంధించిన వివిధ భాగస్వాములు, హోటళ్లు, రిసార్టులన్నీ ఆయా దేశాలను అధ్యయనం చేయాలని నేను కోరుతున్నాను. నేను ఇప్పుడు ఇక్కడ ఉన్నాను కదా.. నేను ఒక చిన్న ప్రదర్శనను చూశాను. అది నన్ను చాలా ఆకట్టుకుంది. వారి ఊహించి వేసిన చిత్రాలు, చూపించిన ప్రదేశాలు, తయారు చేసిన అధునిక సృష్టి, వివిధ ప్రదేశాలను తెలిపే ప్రతి చిత్రం చాలా ఆకట్టుకున్నాయి. నేను మరోసారి ఇక్కడకు వచ్చి నా 50 సంవత్సరాల నాటి జీవితాన్ని మీ మధ్య గడుపుడూ.. ప్రతి ప్రాంతాన్ని సందర్శించే అవకాశం కోసం అన్వేషించాలని అనిపిస్తోంది. ప్రతి ప్రాంతాన్ని చాలా చక్కగా చూపించారు. విదేశాల్లో చేసిన అధ్యయనాల నుండి వచ్చే కార్యాచరణ అంశాలపై చురుకుగా పనిచేయాలని నేను ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. స్థానిక సంప్రదాయాలు, సంగీతం, నృత్యం, వంటకాలను ప్రోత్సహించాలి. ఇక్కడ చాలా వేడి నీటి బుగ్గలు ఉన్నాయి. కేవలం బద్రీనాథ్‌లో మాత్రమే కాదు మరెన్నో ఇతర ప్రాంతాల్లో కూడా ఉన్నాయి. ఆయా ప్రాంతాలను ఆరోగ్య కేంద్రాలుగా కూడా అభివృద్ధి చేయొచ్చు. శీతాకాల యోగా కార్యక్రమాలను ప్రశాంతమైన మంచు ప్రాంతాలలో నిర్వహించొచ్చు. శీతాకాలంలో ఉత్తరాఖండ్‌లో సంవత్సరానికి ఒకసారి తమ శిష్యుల కోసం యోగా శిబిరాన్ని నిర్వహించాలని మహర్షులు, మఠాలు, దేవాలయాల అధిపతులు, యోగా గురువులందరినీ కోరుతున్నాను. శీతాకాలంలో వన్యప్రాణుల సఫారీకి సంబంధించి ఉత్తరాఖండ్ ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చే సామర్థ్యం ఉంది. అంటే 360 డిగ్రీల విధానంతో ముందుకు సాగి ప్రతి స్థాయిలో పనిచేయాలి.
మిత్రులారా,
సౌకర్యాల అభివృద్ధితో పాటు ప్రజలకు సమాచారం అందించడం కూడా అంతే ముఖ్యం. దీని కోసం నేను దేశంలోని యువ కంటెంట్ క్రియేటర్లకు విన్నవిస్తున్నాను. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో పెద్ద సంఖ్యలో ఇన్ఫ్లూయెన్సర్లు, కంటెంట్ క్రియేటర్లు ఉన్నారు. వారంతా నా ఉత్తరాఖండ్, నా దేవభూమికి సేవ చేయొచ్చు. ఇంట్లో కూర్చొని వారి పని చేసుకోవచ్చు. దేశంలో పర్యాటక రంగాన్ని వేగవంతం చేయడంలో, ప్రజలకు సమాచారం అందించడంలో మీరు చాలా పెద్ద పాత్ర పోషించగలరు. మీరు ఇప్పటికే పోషించిన పాత్రను మరింత విస్తరించాల్సిన అవసరం ఉంది. ఉత్తరాఖండ్‌లో శీతాకాల పర్యాటకాన్ని ప్రచారం చేయటంలో మీరు కూడా భాగం కావాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక పెద్ద పోటీని నిర్వహించాలని నేను కోరుతున్నాను. ఈ కంటెంట్ క్రియేటర్లు, ఇన్ఫ్లూయెన్సర్లు శీతాకాల పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 5 నిమిషాల వీడియోను రూపొందించాలి. వారందరికి పోటీ పెట్టి, ఉత్తమ చిత్రాన్ని రూపొందించిన వ్యక్తికి మంచి బహుమతి ఇవ్వాలి. దేశం నలుమూలల నుంచి ఇందులో పాల్గొనాలని ప్రజలను కోరాలి. చాలా ప్రచారం ప్రారంభమౌతుంది. ఇలాంటి పోటీలు జరిగినప్పుడు కొత్త ప్రదేశాలను అన్వేషిస్తారు. కొత్త సినిమాలు తీస్తారు. వాటి గురించి ప్రజలకు తెలియజేస్తారు. ఇది ఖచ్చితంగా జరుగుతుందని నేను భావిస్తున్నాను.
మిత్రులారా,
రాబోయే సంవత్సరాల్లో ఈ రంగంలో వేగవంతమైన అభివృద్ధిని చూస్తామని నేను విశ్వసిస్తున్నాను. 365 రోజులు, సంవత్సరం పొడవునా జరిగే పర్యాటకం విషయంలో ప్రచారానికి, ఉత్తరాఖండ్ సోదర సోదరీమణులందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను.
మీరంతా నాతో పాటు అనండి–
గంగా మాతాకీ– జై
గంగా మాతాకీ– జై
గంగా మాతాకీ– జై
ధన్యవాదాలు
గమనిక: ఇది ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం. వాస్తవ ప్రసంగం హిందీలో ఉంది.
***
डबल इंजन सरकार में डबल गति से जारी विकास कार्यों से साफ है कि ये दशक उत्तराखंड का दशक है। आज देवभूमि के हर्षिल में अपने परिवारजनों से मिलकर अत्यंत हर्षित हूं। https://t.co/SLFidzuX2Y
— Narendra Modi (@narendramodi) March 6, 2025
Blessed to be in Devbhoomi Uttarakhand once again: PM @narendramodi in Harsil pic.twitter.com/O6O5Ef2rUK
— PMO India (@PMOIndia) March 6, 2025
This decade is becoming the decade of Uttarakhand: PM @narendramodi pic.twitter.com/dfL6zq4Exv
— PMO India (@PMOIndia) March 6, 2025
अपने टूरिज्म सेक्टर को diversify करना...बारहमासी बनाना...उत्तराखंड के लिए बहुत जरूरी है: PM @narendramodi pic.twitter.com/9yqpJ6Q1dq
— PMO India (@PMOIndia) March 6, 2025
उत्तराखंड को विकसित राज्य बनाने के लिए हमारी डबल इंजन की सरकार मिलकर काम कर रही हैं: PM @narendramodi pic.twitter.com/Pwy70l7VnX
— PMO India (@PMOIndia) March 6, 2025
मां गंगा की कृपा से ही मुझे दशकों तक आध्यात्मिक ऊर्जा से ओतप्रोत उत्तराखंड की सेवा का सौभाग्य मिला है। यह मां गंगा का दुलार और स्नेह ही है कि आज मुझे उनके मायके मुखवा आने का सुअवसर प्राप्त हुआ है। pic.twitter.com/yd3DyvjMCX
— Narendra Modi (@narendramodi) March 6, 2025
बाबा केदार के आशीर्वाद से उत्तराखंड नित-नई सफलताओं और नए लक्ष्यों की ओर बढ़ते हुए विकास के अपने संकल्प को साकार कर रहा है। शीतकालीन पर्यटन इस दिशा में एक और बड़ा कदम है। pic.twitter.com/W0jT5Ap7H2
— Narendra Modi (@narendramodi) March 6, 2025
मुझे विश्वास है कि डबल इंजन सरकार के प्रयासों से उत्तराखंड में कोई भी सीजन ऑफ सीजन नहीं रहेगा और हर सीजन में यहां टूरिज्म ऑन रहेगा। pic.twitter.com/PMQClVJGrE
— Narendra Modi (@narendramodi) March 6, 2025
टूरिज्म हो या फिर डेस्टिनेशन वेडिंग, देवभूमि से देशवासियों विशेषकर हमारी युवा पीढ़ी से मेरा यह आग्रह… pic.twitter.com/GgRVxsVi1K
— Narendra Modi (@narendramodi) March 6, 2025