Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మార్చి 6న ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మార్చి నెల 6న ఉత్తరాఖండ్‌లో పర్యటించనున్నారుముఖ్‌వాలో గంగా నదిని సందర్శించే స్థలం వద్ద ఆయన ఉదయం సుమారు తొమ్మిదిన్నర గంటలకు దర్శనంపూజ కార్యక్రమాలలో పాల్గొంటారుదాదాపు 10 గంటల 40 నిమిషాలకు మోటార్‌ సైకిళ్లపై చేసే సాహస యాత్రను ప్రధాని ప్రారంభిస్తారుర్సిల్‌లో నిర్వహించే ఒక కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు.

ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఈ సంవత్సరం శీతకాల పర్యాటకం కార్యక్రమాలను ప్రారంభించిందిచలికాలంలో పర్యటించదగ్గ గంగోత్రియమునోత్రికేదార్‌నాథ్‌లతోపాటు బద్రీనాథ్‌ను వేల మంది భక్తులు ఇప్పటికే సందర్శించారుధార్మిక పర్యాటకాన్ని ప్రోత్సహించడంతోపాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకుహోంస్టేలకుపర్యాటకంతో ముడిపడ్డ ఇతరత్రా వ్యాపారాలకు ఊతాన్నివ్వాలన్నదే ఈ కార్యక్రమం లక్ష్యం.