Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గౌరవ బెల్జియం యువరాణి ఆస్ట్రిడ్ ను కలిసిన భారత ప్రధాని


భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం గౌరవ బెల్జియం యువరాణి ఆస్ట్రిడ్ ను కలిశారు. 300 మంది సభ్యులతో కూడిన ఆర్థిక బృందంతో భారత పర్యటన కోసం ఆమె తీసుకున్న చొరవను భారత ప్రధానమంత్రి అభినందించారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఆయన ఇలా పేర్కొన్నారు:

గౌరవ బెల్జియం యువరాణి ఆస్ట్రిడ్ ను కలవడం సంతోషాన్నిస్తోంది. 300 మంది సభ్యులతో కూడిన ఆర్థిక బృందానికి నేతృత్వం వహిస్తూ భారత పర్యటన కోసం చొరవ చూపడంపట్ల ఆమెకు హృదయపూర్వక అభినందనలువాణిజ్యంసాంకేతికతరక్షణవ్యవసాయంజీవ శాస్త్రాలుఆవిష్కరణలునైపుణ్యాభివృద్ధివిద్యాపరమైన వినిమయాల్లో సరికొత్త భాగస్వామ్యాల ద్వారా మన ప్రజలకు అపరిమితమైన అవకాశాలను అందించడం కోసం ఎదురుచూస్తున్నాను.

@MonarchieBe”