ఊబకాయంతో బాధపడుతున్న వ్యక్తుల సంఖ్య పెరుగుతూ పోతుండడంతో ఈ సమస్యపై పోరాడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చెప్పారు. వంట నూనె వినియోగాన్ని తగ్గించడానికి ప్రముఖులను ఆయన నామినేట్ చేశారు. ఆ పది మందిని వారు మరో పది మందిని దీని కోసం నామినేట్ చేయాల్సిందిగా కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.
‘‘ఎక్స్’’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా రాశారు:
‘‘నిన్నటి #MannKiBaat కార్యక్రమంలో నేను ప్రస్తావించిన ప్రకారం, శరీరం లావెక్కడం అనే సమస్యతో పోరాడడానికీ, ఆహారంలో నూనెల వినియోగంపై అవగాహనను పెంచడానికీ ఈ కింది వ్యక్తులను నేను నామినేట్ చేయదలచుకొన్నాను. వారు వారి వంతుగా తలా పది మంది చొప్పున నామినేట్ చేయాలని కూడా వారిని నేను కోరుతున్నాను. అలా చేస్తే మన ఉద్యమం మరింత విస్తరిస్తుంది.
శ్రీ ఆనంద్ మహీంద్ర (@anandmahindra)
శ్రీ నిరహువా (@nirahua1)
మను భాకర్ (@realmanubhaker)
మీరాబాయి చాను (@mirabai_chanu)
శ్రీ మోహన్‌లాల్ (@Mohanlal)
శ్రీ నందన్ నిలేకనీ (@NandanNilekani)
శ్రీ ఉమర్ అబ్దుల్లా (@OmarAbdullah)
శ్రీ మాధవన్ (@ActorMadhavan)
శ్రేయ ఘోషాల్ (@shreyaghoshal)
శ్రీమతి సుధామూర్తి (@SmtSudhaMurty)
రండి, మనమంతా కలసి భారత్‌ను మరింత ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండేటట్లు తీర్చిదిద్దుదాం.
#FightObesity”
As mentioned in yesterday’s #MannKiBaat, I would like to nominate the following people to help strengthen the fight against obesity and spread awareness on reducing edible oil consumption in food. I also request them to nominate 10 people each so that our movement gets bigger!… pic.twitter.com/bpzmgnXsp4
— Narendra Modi (@narendramodi) February 24, 2025