భారత్‌లో రైతులకు అందడండలను అందిస్తూ వారి అభ్యున్నతికి అంకితం చేసిన ఒక ప్రధాన కార్యక్రమమైన ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన’ ఆరో వార్షికోత్సవ సందర్బంగా దేశవ్యాప్తంగా రైతు సోదరులకు, రైతు సోదరీమణులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. రైతుల ఖాతాలలో ఇంత వరకు దాదాపు రూ.3.5 లక్షల కోట్లు జమ కావడం తనకు సంతోషాన్నిచ్చిందన్నారు.
‘‘ఎక్స్’’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా రాశారు:
‘‘పీఎం–కిసాన్‌కు 6 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా దేశమంతటా మన రైతు సోదరులకు, రైతు సోదరీమణులకు అభినందనలు. వారి ఖాతాలలో ఇంతవరకు సుమారు 3.5 లక్షల కోట్ల రూపాయలు జమ కావడం నాకు అత్యంత సంతోషాన్ని, గర్వాన్నీ కలిగించింది. మా ఈ ప్రయత్నం అన్నదాతలకు గౌరవాన్నీ, సమృద్ధినీ, కొత్త శక్తినీ ఇస్తోంది’’.
#PMKisan
पीएम-किसान के 6 वर्ष पूरे होने पर देशभर के हमारे किसान भाई-बहनों को बहुत-बहुत बधाई। मेरे लिए अत्यंत संतोष और गर्व का विषय है कि अब तक करीब साढ़े तीन लाख करोड़ रुपये उनके खाते में पहुंच चुके हैं। हमारा ये प्रयास अन्नदाताओं को सम्मान, समृद्धि और नई ताकत दे रहा है। #PMKisan
— Narendra Modi (@narendramodi) February 24, 2025