Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఢిల్లీ ముఖ్యమంత్రిగా శ్రీమతి రేఖ గుప్తా పదవీప్రమాణం.. ప్రధానమంత్రి అభినందనలు

ఢిల్లీ ముఖ్యమంత్రిగా శ్రీమతి రేఖ గుప్తా పదవీప్రమాణం.. ప్రధానమంత్రి అభినందనలు


ఢిల్లీ ముఖ్యమంత్రిగా శ్రీమతి రేఖ గుప్తా పదవీప్రమాణం స్వీకరించిన సందర్భంగా, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆమెకు అభినందనలు తెలిపారు. అట్టడుగు స్థాయి నుంచి ఆమె ఎదిగారని, కేంపస్ రాజకీయాలలో, రాష్ట్ర స్థాయి విభాగాల్లో, మహా నగర యంత్రాంగాల్లో చురుకుగా పనిచేశారని, ఇక ఇప్పుడు శాసనసభ్యురాలు కావడంతోపాటు ముఖ్యమంత్రి కూడా అయ్యారని శ్రీ మోదీ అన్నారు.

 

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఇలా రాశారు:

‘‘ఢిల్లీ ముఖ్యమంత్రిగా పదవీప్రమాణం స్వీకరించిన సందర్భంగా శ్రీమతి రేఖ గుప్తాకు అభినందనలు. అట్టడుగు స్థాయి నుంచి ఆమె ఎదిగారు. కేంపస్ రాజకీయాలలో, రాష్ట్ర స్థాయి విభాగాల్లో , మహా నగర యంత్రాంగాల్లో చురుకుగా పనిచేశారు, ఇప్పుడు శాసనసభ్యురాలు కావడంతోపాటు ముఖ్యమంత్రి అయ్యారు. ఢిల్లీని అభివృద్ధి చేయడం కోసం ఆమె తన పూర్తి శక్తితో పనిచేస్తారని నాకు గట్టి నమ్మకముంది. ఆమె పదవీకాలం ఫలప్రదం కావాలి. ఆమెకు నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.

@gupta_rekha”