Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సరైన పోషకాహారం తీసుకుంటే పరీక్షలు బాగా రాయగలుగుతారు: ప్రధానమంత్రి


పరీక్షలు బాగా రాయడానికి సరైన పోషకాహారం, తగినంత నిద్ర దోహదపడతాయని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. రేపు ప్రసారమయ్యే పరీక్షా పే చర్చా నాలుగో ధారావాహికను అందరూ వీక్షించాలని కోరారు.

విద్యా మంత్రిత్వశాఖ ఎక్స్‌ లో చేసిన పోస్టుకు శ్రీ మోదీ స్పందిస్తూ:

‘‘సరైన పోషకాహారం తీసుకుంటే, మీరు పరీక్షలు బాగా రాయగలుగుతారు! పరీక్షలకు సన్నద్ధమవడంలో ఆహారం, నిద్ర ప్రాధాన్యంపై ‘పరీక్షా పే చర్చ’ నాలుగో ధారావాహిక వివరిస్తుంది. రేపు ఈ అంశంపై సోనాలి సబ్రేవాల్, రుజుతా దివేకర్, రేవంత్ హిమత్‌సింగ్కా తమ అభిప్రాయాలను పంచుకుంటారు. #PPC2025 #ExamWarriors @foodpharmer2’’

 

 

***

MJPS/SR