సుప్రసిద్ధ ఆలోచనాపరుడు, సంఘ సంస్కర్త, జాతీయవాదీ అయిన మహర్షి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో ప్రధాని సందేశమిస్తూ…
“గొప్ప ఆలోచనాపరుడు, సంఘ సంస్కర్త, జాతీయవాది మహర్షి దయానంద సరస్వతి జయంతి సందర్భంగా వారికి కోటి నమస్సులు. సమాజంలోని అజ్ఞానం, అంధవిశ్వాసాలు, ఆడంబరాలకు వ్యతిరేకంగా ప్రజలని జాగరూకులను చేసేందుకు ఆయన తన మొత్తం జీవితాన్ని వెచ్చించారు. విద్య, మహిళా సాధికారత సహా భారతీయ సంస్కృతీ వారసత్వాలను కాపాడేందుకు ఆయన చేసిన కృషి దేశవాసులకు నిరంతరం ప్రేరణను కలిగిస్తూనే ఉంటుంది” అని పేర్కొన్నారు.
महान चिंतक, समाज सुधारक और प्रखर राष्ट्रवादी महर्षि दयानंद सरस्वती जी को उनकी जन्म-जयंती पर कोटि-कोटि नमन। वे जीवनपर्यंत समाज को अज्ञानता, अंधविश्वास और आडंबर के खिलाफ जागरूक करने में जुटे रहे। शिक्षा और महिला सशक्तिकरण के साथ-साथ भारतीय विरासत और संस्कृति के संरक्षण के लिए उनके…
— Narendra Modi (@narendramodi) February 12, 2025