ఎన్‌సీఎస్‌కే కాలవ్యవధిని మరో మూడేళ్లు పొడిగించడం వల్ల సుమారుగా కలిగే ఆర్థిక భారం సుమారుగా రూ.50.91 కోట్లు.
పారిశుద్ద్య కార్మికుల అభ్యున్నతికి, పారిశుద్ద్య రంగంలో పనిచేసే వారికి మెరుగైన పరిస్థితులను కల్పించేందుకు, ప్రమాదకర పరిస్థితుల్లో వ్యర్థాలను తొలగిస్తున్నప్పుడు మరణాలను పూర్తిగా నివారించేందుకు ఇది సాయపడుతుంది.
కమిషన్ విధులు:
ఎన్‌సీఎస్‌కే బాధ్యతలు:
(a) హోదా, సౌకర్యాలు, అవకాశాల్లో సఫాయి కర్మచారులకు ఎదురవుతున్న అసమానతలను తొలగించే దిశగా కేంద్ర ప్రభుత్వానికి నిర్ధిష్టమైన కార్యాచరణను సిఫారసు చేయడం.
(b) పారిశుద్ధ్య కార్మికుల సామాజిక, ఆర్థిక పునరావాసానికి సంబంధించిన కార్యక్రమాల అమలును అధ్యయనం చేయడం, మూల్యాంకనం చేయడం.
(c) నిర్ధిష్టమైన ఫిర్యాదులను దర్యాప్తు చేయడం, (i) సఫాయి కర్మచారుల సమాజానికి సంబంధించి అమలు చేస్తున్న కార్యక్రమాలు లేదా పథకాలు (ii) సఫాయి కర్మచారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించే నిర్ణయాలు, మార్గదర్శకాలు మొదలైనవి. (iii) సఫాయి కర్మచారుల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి చేపట్టిన చర్యలను సరిగ్గా అమలు చేయకపోతే వాటిని సుమోటోగా స్వీకరించడం.
(d) సఫాయి కర్మచారీల ఆరోగ్య భద్రత, వేతనాలతో సహా వారు పనిచేస్తున్న పరిస్థితులను అధ్యయనం చేసి పర్యవేక్షించడం.
(e) పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించిన ఏదైనా అంశంపై, సఫాయి కార్మికులకు ఎదురైన ఇబ్బందులు లేదా వైకల్యాలను పరిగణనలోకి తీసుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలను సమర్పించడం.
(f) కేంద్ర ప్రభుత్వం సూచించిన అంశంపై నివేదిక సమర్పించడం.
మానవ పారిశుద్ధ్య కార్మిక ఉద్యోగాల నిషేధం, వారికి పునరావాసం కల్పించే చట్టం-2013 (ఎంఎస్ చట్టం 2013) ప్రకారం ఎన్‌సీఎస్‌కే నిర్వహించాల్సిన విధులు:
i. చట్టం అమలును పర్యవేక్షించడం
ii. చట్టంలోని నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన ఫిర్యాదులపై విచారణ చేపట్టడం, తదుపరి చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు సిఫార్సులు చేయడం.
Iii. చట్టంలోని నిబంధనలను సమర్థవంతంగా అమలు చేయడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సలహాలు ఇవ్వడం. iv. చట్టం అమలు చేయకపోతే ఈ అంశాన్ని సుమోటోగా తీసుకోవడం.
నేపథ్యం:
జాతీయ సఫాయీ కర్మచారీ కమిషన్ చట్టం…1993 సెప్టెంబర్ లో అమల్లోకి వచ్చింది. ఆగస్టు 1994లో జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ ఏర్పాటైంది.
*****