భారత్‌లో పారిశుధ్యం-మరుగుదొడ్ల సౌలభ్యంగల కుటుంబాలకు ఏటా సుమారు ₹70,000 దాకా ఆదా చేస్తున్నట్లు ‘యునిసెఫ్’ అంచనాలు పేర్కొనడాన్ని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ అభియాన్, మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్ర తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలతో సామాన్య కుటుంబాలకు ఒనగూడిన ప్రయోజనాలను విశదీకరించారు.
ముఖ్యంగా ‘కొళాయి ద్వారా నీరు’ (నల్ సే జల్) పథకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్ర నీటి లభ్యత వల్ల ఇతరత్రా వైద్య ఖర్చుల రూపేణా సామాన్య కుటుంబీకులకు ఏటా సగటున ₹40,000 వరకూ ఆదా అయినట్లు తన నివేదికలో పేర్కొన్నదని ప్రధానమంత్రి తెలిపారు. సాధారణ పౌరుల ఖర్చులు తగ్గించడంలో ఇలాంటి అనేక పథకాలు దోహదం చేశాయని చెప్పారు.
దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే అర్బన్ నక్సల్స్ భాషను కొందరు బాహాటంగా ఉపయోగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేసిన శ్రీ మోదీ… ఈ భాషను మాట్లాడేవారు, భారత దేశాన్ని సవాలు చేసేవారు రాజ్యాంగాన్ని గానీ, దేశ సమైక్యతను గానీ అర్థం చేసుకోలేరని అన్నారు.
ఏడు దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్, లడఖ్ రాజ్యాంగ హక్కులను కోల్పోయాయని, ఇది రాజ్యాంగానికి, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు జరిగిన అన్యాయమని ప్రధాని పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో, ఈ ప్రాంతాల ప్రజలు ఇప్పుడు దేశంలోని ఇతర పౌరులతో సమానమైన హక్కులను పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని జీవిస్తున్నారని, అందుకే ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
రాజ్యాంగం ఏ విధంగానూ వివక్షను అనుమతించదని స్పష్టం చేస్తూ, పక్షపాత మనస్తత్వంతో జీవించే వారిని శ్రీ మోదీ విమర్శించారు. ముస్లిం మహిళలపై విధించిన ఆంక్షలను ప్రస్తావిస్తూ, ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం ద్వారా రాజ్యాంగం ప్రకారం ముస్లిం ఆడపిల్లలకు సరైన సమానత్వం కల్పించామని ప్రధానమంత్రి తెలిపారు.
తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడల్లా ముందుచూపుతో పనిచేసినట్లు ఆయన చెప్పారు. నిరాశ, నిస్పృహలతో కొందరు ఉపయోగిస్తున్న ద్రోహపూరిత భాషపై ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ కలలుగన్న విధంగా తమ దృష్టి ఎప్పుడూ వెనుకబడిన వారిపైనే ఉందని ఆయన పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాలకు, గిరిజన వ్యవహారాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేయడం సమ్మిళిత అభివృద్ధి పట్ల వారి నిబద్ధతను చాటిచెప్పిందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
భారతదేశ దక్షిణ, తూర్పు తీర రాష్ట్రాలలో మత్స్యకార జనాభా అధికంగా ఉందని, సమాజాలను కలిగి ఉన్నాయని, చిన్న నీటి వనరుల ప్రాంతాలతో ఉన్న వారితో సహా ఈ వర్గాల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన ప్రాముఖ్యతను గుర్తించి మత్స్యకారుల అవసరాలను తీర్చేందుకు, వారి జీవనోపాధి కోసం ప్రత్యేకంగా మత్స్యకారుల మంత్రిత్వ శాఖను సృష్టించిన ప్రభుత్వం తమదేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సమాజంలోని అట్టడుగు వర్గాల్లో ఉన్న సామర్ధ్యాలను ప్రస్తావిస్తూ, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా, కొత్త అవకాశాలను సృష్టించవచ్చని, ఇది వారి ఆకాంక్షలకు జీవం పోస్తుందని ప్రధాని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అత్యంత సాధారణ పౌరులకు కూడా అవకాశాలు కల్పించడమే ప్రజాస్వామ్య ప్రాథమిక కర్తవ్యమని స్పష్టం చేశారు. కోట్లాది మంది ప్రజలను కలిపే భారతదేశ సహకార రంగాన్ని ప్రోత్సహించడానికి, బలోపేతం చేయడానికి ప్రభుత్వం సహకార సంఘాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని, ఇది తమ దార్శనికతకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.
కులం గురించి చర్చించడం కొందరికి ఒక ఫ్యాషన్ గా మారిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత 30-35 ఏళ్లుగా వివిధ పార్టీలకు చెందిన ఓబీసీ ఎంపీలు ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని, ఈ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చిన ప్రభుత్వం తమదేనని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వెనుకబడిన తరగతుల కమిషన్ ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలో భాగమైందని ఆయన పేర్కొన్నారు. ప్రతి రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు గరిష్ఠ అవకాశాలు కల్పించేందుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఒకే ఎస్సీ కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు ఒకేసారి పార్లమెంటులో పనిచేసిన సందర్భం లేదా ఒకే ఎస్టీ కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు ఒకేసారి పనిచేసిన సందర్భం ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారు. కొంతమంది వ్యక్తుల మాటలకు, చేతలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఆయన ప్రస్తావించారు. , ఇది వారి వాగ్దానాలకు, వాస్తవానికి మధ్య చాలా అంతరాన్ని సూచిస్తుందని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారత అవసరమని, సామాజిక ఉద్రిక్తతలు సృష్టించకుండా ఐక్యతను కాపాడుకోవడం ముఖ్యమని ప్రధాని స్పష్టం చేశారు. 2014కు ముందు దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉండేవని, ప్రస్తుతం ఆ సంఖ్య 780కి పెరగడంతో ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 2014కు ముందు ఎస్సీ విద్యార్థులకు 7,700 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవన్నారు. పది సంవత్సరాల శ్రమ ఫలితంగా, ఆ సంఖ్య 17,000కి పెరిగింది. ఇది దళిత సమాజం నుంచి వైద్యులు కావడానికి భారీగా అవకాశాలను పెంచింది. ఎలాంటి సామాజిక ఉద్రిక్తతలను సృష్టించకుండా, పరస్పర గౌరవాన్ని కాపాడుతూ దీనిని సాధించినట్టు చెప్పారు. 2014కు ముందు ఎస్టీ విద్యార్థులకు 3,800 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవని, ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 9 వేలకు పెరిగిందని చెప్పారు. 2014కు ముందు ఓబీసీ విద్యార్థులకు 14 వేల కంటే తక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఉండేవని, నేడు, ఈ సంఖ్య సుమారుగా పెరిగి, 32,000 మంది ఒబిసి విద్యార్థులు డాక్టర్లు కావడానికి వీలు కల్పించిందని చెప్పారు. గత పదేళ్లుగా ప్రతి వారం ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని, ప్రతిరోజూ ఒక కొత్త ఐటీఐని ప్రారంభించామని, ప్రతి రెండు రోజులకు ఒక కొత్త కళాశాలను ప్రారంభించామని ప్రధాని వివరించారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యువతకు అవకాశాలు గణనీయంగా పెరిగాయన్నారు.
ఏ ఒక్క లబ్దిదారునీ కూడా విడవకుండా అన్ని పథకాల ప్రయోజనాలను నూటికి నూరు మందికీ అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రయోజనాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని పొందాలని, అవి కొందరికే పరిమతమనే కాలం చెల్లిపోయిందని ఆయన పేర్కొన్నారు.
బుజ్జగింపు రాజకీయాలను ప్రధాన మంత్రి దుయ్యబట్టారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం, బుజ్జగింపు నుండి సంతృప్తి మార్గంలోకి వెళ్లాలని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి ఎలాంటి వివక్ష లేకుండా న్యాయం జరగాలని ఆయన ఉద్ఘాటించారు. 100 శాతం సంతృప్తతను సాధించడం అంటే నిజమైన సామాజిక న్యాయం, లౌకికవాదం, రాజ్యాంగం పట్ల గౌరవం అని స్పష్టం చేశారు.
అందరికీ మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమే రాజ్యాంగ స్ఫూర్తి అని అంటూ, ఈ రోజు క్యాన్సర్ దినోత్సవం గురించి ప్రస్తావించారు. ఆరోగ్యం గురించి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోందని అన్నారు. రాజకీయ స్వార్థంతో కొందరు వ్యక్తులు పేదలు, వృద్ధులకు వైద్య సేవలు అందించేందుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక ప్రైవేటు ఆసుపత్రులతో సహా 30,000 ఆసుపత్రులను ఆయుష్మాన్ భారత్ పథకానికి అనుసంధానమై ఆయుష్మాన్ భారత్ కార్డుదారులకు ఉచిత చికిత్సను అందిస్తున్నాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు తమ సంకుచిత దృక్పథం, తప్పుడు విధానాల కారణంగా ఈ ఆసుపత్రుల ద్వారాలను పేదలకు మూసివేయడంతో క్యాన్సర్ రోగులు ప్రభావితులయ్యారని పేర్కొన్నారు. ఆయుష్మాన్ పథకం కింద సకాలంలో క్యాన్సర్ చికిత్స ప్రారంభమైందని పబ్లిక్ హెల్త్ జర్నల్ ‘లాన్సెట్’ ఇటీవల చేసిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ.. క్యాన్సర్ స్క్రీనింగ్ , చికిత్సలో ప్రభుత్వ నిబద్ధతను శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రారంభ రోగ నిర్ధారణ, చికిత్స క్యాన్సర్ రోగులను రక్షించగలదని అన్నారు. ఆయుష్మాన్ పథకాన్ని లాన్సెట్ ప్రశంసించింది, భారతదేశంలో ఈ దిశలో గణనీయమైన పురోగతిని గుర్తించింది.
క్యాన్సర్ మందులను మరింత చౌకగా అందించడానికి ఈ బడ్జెట్ లో తీసుకున్న ముఖ్యమైన చర్యను ప్రముఖంగా పేర్కొన్న శ్రీ మోదీ… ముఖ్యంగా క్యాన్సర్ దినోత్సవం రోజున ఇది క్యాన్సర్ రోగులకు ప్రయోజనం చేకూర్చే ఒక ముఖ్యమైన నిర్ణయం అని పేర్కొన్నారు. గౌరవ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లోని రోగులు ఈ ప్రయోజనాన్ని వినియోగించుకునేలా చూడాలని ఆయన కోరారు. పరిమిత సంఖ్యలో ఆస్పత్రులు ఉండటం వల్ల రోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి 200 డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ కేంద్రాలు రోగులకు, వారి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి.
రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా విదేశాంగ విధానంపై జరిగిన చర్చలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, కొందరు వ్యక్తులు విదేశాంగ విధానంపై పరిణతి ఉన్నట్టు అవి దేశ ప్రయోజనాలకు హాని కలిగించేవైనా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు కనబడిందని ప్రధాని వ్యాఖ్యానించారు. విదేశీ విధానంపై నిజంగా ఆసక్తి ఉన్నవారు ప్రఖ్యాత విదేశాంగ విధాన పండితుడు రాసిన “జెఎఫ్ కె ఫర్గాటెన్ క్రైసిస్” పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీల మధ్య క్లిష్ట సమయాల్లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, చర్చలను ఈ పుస్తకంలో వివరించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ అయిన రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆమె పట్ల చూపిన అగౌరవం పట్ల ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు రాజకీయ నైరాశ్యం అర్థమవుతుందని, అయితే రాష్ట్రపతి పట్ల ఇంత అగౌరవం వెనుక కారణాలేమిటని ప్రశ్నించారు. తిరోగమన మనస్తత్వాలను వదిలి మహిళల నేతృత్వంలోని అభివృద్ధి మంత్రాన్ని స్వీకరించడం ద్వారా భారతదేశం ముందుకు వెళ్తోందని పేర్కొన్న శ్రీ మోదీ, జనాభాలో సగం ఉన్న మహిళలకు పూర్తి అవకాశాలు కల్పిస్తే, భారతదేశం రెట్టింపు వేగంతో పురోగతి సాధిస్తుందని స్పష్టం చేశారు. ఈ రంగంలో 25 ఏళ్లు పనిచేసిన తర్వాతనే తన ఆత్మవిశ్వాసం మరింత దృఢపడిందని అన్నారు. గడచిన పదేళ్లలో 10 కోట్ల మంది మహిళలు, ప్రధానంగా అట్టడుగు, గ్రామీణ నేపథ్యం నుంచి స్వయం సహాయక సంఘాల్లో చేరారని ప్రధాని చెప్పారు. ఈ మహిళల సామర్థ్యాలు పెరిగాయి, వారి సామాజిక స్థితి మెరుగుపడింది, వారి పనిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం వారి సహాయాన్ని రూ.20 లక్షల వరకు పెంచింది. ఈ ప్రయత్నాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో లక్‌పతి దీదీ పథకం ప్రస్తావనపై ప్రధానమంత్రి మాట్లాడుతూ.. మూడోసారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 50 లక్షలకు పైగా లక్‌పతి దీదీలు నమోదయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 1.25 కోట్ల మంది మహిళలు లక్‌పతి దీదీలుగా మారారని, ఆర్థిక అంశాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాల ద్వారా మూడు కోట్ల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా తయారు చేయడమే లక్ష్యమని అన్నారు. నమో డ్రోన్ దీదీలుగా పిలిచే మహిళలు డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో వచ్చిన గణనీయమైన మానసిక మార్పును ఆయన ప్రస్తావించారు. ఈ డ్రోన్ దీదీలు పొలాల్లో పనిచేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మహిళా సాధికారతలో ముద్రా యోజన పాత్రను కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీని ద్వారా కోట్లాది మంది మహిళలు మొదటిసారిగా పారిశ్రామిక రంగంలోకి వెళ్లి పారిశ్రామికవేత్తల పాత్రలను పోషిస్తున్నారు.
భారత్‌లో పారిశుధ్యం-మరుగుదొడ్ల సౌలభ్యంగల కుటుంబాలకు ఏటా సుమారు ₹70,000 దాకా ఆదా చేస్తున్నట్లు ‘యునిసెఫ్’ అంచనాలు పేర్కొనడాన్ని శ్రీ మోదీ ప్రముఖంగా ప్రస్తావించారు. స్వచ్ఛ భారత్ అభియాన్, మరుగుదొడ్ల నిర్మాణం, పరిశుభ్ర తాగునీటి సరఫరా వంటి కార్యక్రమాలతో సామాన్య కుటుంబాలకు ఒనగూడిన ప్రయోజనాలను విశదీకరించారు.
ముఖ్యంగా ‘కొళాయి ద్వారా నీరు’ (నల్ సే జల్) పథకాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసించిందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమం ద్వారా పరిశుభ్ర నీటి లభ్యత వల్ల ఇతరత్రా వైద్య ఖర్చుల రూపేణా సామాన్య కుటుంబీకులకు ఏటా సగటున ₹40,000 వరకూ ఆదా అయినట్లు తన నివేదికలో పేర్కొన్నదని ప్రధానమంత్రి తెలిపారు. సాధారణ పౌరుల ఖర్చులు తగ్గించడంలో ఇలాంటి అనేక పథకాలు దోహదం చేశాయని చెప్పారు.
దేశవ్యాప్తంగా లక్షలాది మంది పౌరులకు ఉచిత ధాన్యం పంపిణీతో పేద కుటుంబాల్లో గణనీయ పొదుపు సాధ్యమైందని శ్రీ మోదీ తెలిపారు. అలాగే ‘ప్రధానమంత్రి సూర్య ఉచిత గృహవిద్యుత్ పథకం’ ద్వారా ఏటా సగటున ₹25,000 నుంచి ₹30,000 వరకు విద్యుత్ బిల్లు రూపేణా ఆదా అయిందని పేర్కొన్నారు. మరోవైపు ఈ పథకం తోడ్పాటుతో తమ ఇళ్లపై ఉత్పత్తయిన అదనపు విద్యుత్తు విక్రయం ద్వారా సామాన్య కుటుంబాలకు ఆదాయం కూడా సమకూరుతుందని వివరించారు. ఈ విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలతో సామాన్య కుటుంబాలకు ఖర్చులు తగ్గి, గణనీయ పొదుపు సాధ్యమవుతున్నదని ప్రధాని స్పష్టం చేశారు. ఇదే క్రమంలో ‘ఎల్‌ఈడీ’ బల్బుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ- తాము అధికారంలోకి రాకముందు వాటి ధర ₹400 దాకా ఉండేదని, ఆ తర్వాత ₹40 స్థాయికి దిగివచ్చిందని పేర్కొన్నారు. దీనివల్ల విద్యుత్ ఆదాతోపాటు పేదల జీవితాలు మరింత కాంతిమంతం అయ్యాయని అభివర్ణించారు. ఈ విధంగా ప్రజలకు ₹20,000 కోట్ల మేర ఆదా అయిందన్నారు. వ్యవసాయం విషయానికొస్తే- భూసార కార్డుల శాస్త్రీయ వినియోగంతో రైతులు కూడా గణనీయ ప్రయోజనం పొందారని, ఎకరాకు సగటును ₹30,000 ఆదా అయిందని వివరించారు.
మధ్య తరగతికి ఆదాయపు పన్ను భారం తగ్గడాన్ని ప్రస్తావిస్తూ- గత పదేళ్లలో ప్రభుత్వం పన్ను రేట్లను తగ్గించడంవల్ల పొదుపు కూడా పెరిగిందని ప్రధాని స్పష్టం చేశారు. ఈ మేరకు 2013-14నాటికి పన్ను మినహాయింపు కేవలం ₹2 లక్షలకు పరిమితం కాగా, నేడు ₹12 లక్షల వార్షికాదాయంపై పూర్తి మినహాయింపు లభిస్తున్నదని వివరించారు. అలాగే 2014, 2017, 2019, 2023 సంవత్సరాల్లో వేతన జీవులకు పన్ను ఉపశమనం దిశగా ప్రభుత్వం తన కృషిని కొనసాగించిందని చెప్పారు. తదనుగుణంగా ఇప్పుడు ప్రామాణిక మినహాయింపు పరిమితిని ₹75,000కు పెంచడం వల్ల ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వారికి ₹12.75 లక్షల దాకా ఆదాయంపై ఎలాంటి పన్ను భారం ఉండదని ప్రధాని పేర్కొన్నారు.
గత ప్రభుత్వాల హయాంలో చర్చలు వాస్తవాలకు దూరంగా వాగాడంబరానికి పరిమితంగా ఉండేవని ప్రధానమంత్రి విమర్శించారు. ఆనాడు దేశాన్ని 21వ శతాబ్దంలోకి తీసుకెళ్తామని ఊదరగొట్టిన నాయకులు చివరకు 20వ శతాబ్దపు అవసరాలను కూడా తీర్చలేకపోయారని ఎద్దేవా చేశారు. దేశంలో దశాబ్దాల కిందటే వినియోగంలోకి రావాల్సిన అనేక ప్రాజెక్టులు విపరీత జాప్యం ఫలితంగా 40-50 ఏళ్లు ఆలస్యం కావడంపై ఆయన ఆవేదన వెలిబుచ్చారు. ప్రజలు 2014లో తమకు సేవచేసే అవకాశం ఇచ్చినప్పటి నుంచీ ప్రభుత్వం యువతపై నిశితంగా దృష్టి కేంద్రీకరించిందని చెప్పారు. యువతరం ఆకాంక్షలకు ప్రాధాన్యమిస్తూ వారికి అనేక అవకాశాలను చేరువ చేసిందని శ్రీ మోదీ అన్నారు. అందుకే వారిప్పుడు తమ ప్రతిభాపాటవాలను సగర్వంగా ప్రదర్శిస్తూ విజయపథంలో సాగుతున్నారని తెలిపారు. అంతరిక్ష, రక్షణ రంగాల్లో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించడం సహా సెమీకండక్టర్ మిషన్ ప్రారంభం గురించి ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. ఆవిష్కరణలకు ప్రోత్సాహం లక్ష్యంగా అనేక కొత్త పథకాలను ప్రవేశపెట్టడంతోపాటు ‘స్టార్టప్ ఇండియా’ వ్యవస్థను సంపూర్ణంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు. ప్రస్తుత బడ్జెట్‌లో ₹12 లక్షల దాకా వార్షికాదాయంపై పూర్తి పన్ను మినహాయింపు ప్రకటించడం ఓ కీలక నిర్ణయమని, దీనిపై దేశవ్యాప్తంగా హర్షం వెల్లువెత్తిందని ఈ సందర్భంగా ప్రధాని గుర్తుచేశారు. దేశంపై సానుకూల ప్రభావం, దీర్ఘకాలిక ప్రయోజనాల దిశగా అణుశక్తి రంగంలోనూ పెట్టుబడులను ప్రోత్సహిస్తున్నట్లు ప్రకటించారు.
కృత్రిమ మేధ (ఎఐ), త్రీడీ ప్రింటింగ్, రోబోటిక్స్, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికతల ప్రాధాన్యాన్ని ప్రధాని స్పష్టం చేశారు. ముఖ్యంగా గేమింగ్ రంగంలో ప్రభుత్వ కృషిని వివరిస్తూ- ఈ రంగంలో ఇప్పటికే ఎంతో ముందంజ వేసిన నేపథ్యంలో భారత్‌ను ప్రపంచ సృజనాత్మక గేమింగ్ రాజధానిగా తీర్చిదిద్దడంపై దృష్టి సారించాలని శ్రీ మోదీ యువతకు పిలుపునిచ్చారు. తన దృష్టిలో ‘ఎఐ’ అంటే కేవలం కృత్రిమ మేధ కాదని, ‘ఆకాంక్షాత్మక భారత్’ కూడా అని ఆయన అభివర్ణించారు. దేశవ్యాప్తంగా పాఠశాలల్లో 10,000 అటల్ టింకరింగ్ లేబొరేటరీలను ప్రారంభించడాన్ని ప్రస్తావిస్తూ- విద్యార్థులు ఇక్కడ రోబోటిక్స్ లో తమ సృజనాత్మకతను చాటుకుంటూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో మరో 50,000 లేబొరేటరీల ఏర్పాటుకు ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదించినట్లు గుర్తుచేశారు. భారత ‘ఎఐ’ మిషన్ ప్రపంచవ్యాప్తంగా ఆశావాహ వాతావరణం సృష్టించడంతోపాటు అంతర్జాతీయ ‘ఎఐ’ వేదికపై భారత్ గణనీయ స్థానంలో నిలిచిందని ప్రధాని వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో ‘డీప్ టెక్’ రంగంలోనూ పెట్టుబడులను ప్రస్తుత బడ్జెట్ ప్రతిపాదించినట్లు పేర్కొన్నారు. ఈ 21వ శతాబ్దం సాంకేతిక పరిజ్ఞానాధారితం కాబట్టి, ప్రగతిపథంలో వేగం పుంజుకోవాలంటే ‘డీప్ టెక్’ రంగంలో త్వరగా ముందంజ వేయడం అత్యావశ్యకమని స్పష్టం చేశారు. దేశ యువతరం భవిష్యత్తు లక్ష్యంగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుండగా, కొన్ని రాజకీయ పార్టీలు మాత్రం ఎన్నికల వేళ నిరుద్యోగ భత్యం వంటి హామీలు ఇస్తున్నాయని ఆరోపించారు. చివరకు ఆ హామీలను నెరవేర్చకుండా యువతను మోసగిస్తూ వారి భవితకు ముప్పుగా మారాయని విమర్శించారు.
ఈ నేపథ్యంలో హర్యానాలో ఇటీవలి పరిణామాలను ప్రధాని ప్రస్తావించారు. ఎలాంటి ఖర్చులు దళారీల బెడద లేకుండా ఉద్యోగావకాశాలు కల్పిస్తామని యువతకు తామిచ్చిన హామీని గుర్తుచేశారు. తదనుగుణంగా రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఏర్పడగానే ఆ వాగ్దానాన్ని నెరవేర్చామని, తమ నిబద్ధతకు ఇదే నిదర్శనమని స్పష్టం చేశారు. హర్యానాలో వరుసగా మూడోసారి చరిత్రాత్మక విజయం సాధించడంపై హర్షం వెలిబుచ్చుతూ, ఇది రాష్ట్ర చరిత్రలో ఓ కీలక ఘట్టంగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. అదేవిధంగా మహారాష్ట్రలోనూ చారిత్రక ఫలితాలు రావడాన్ని ప్రధాని ప్రస్తావించారు. అధికార పార్టీ అత్యధిక శాసనసభ స్థానాలను గెలుచుకున్నదని, ఇది ప్రజల ఆశీర్వాద ఫలితమేనని పేర్కొన్నారు.
రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రాష్ట్రపతి ప్రసంగం ఈ అంశాన్ని విస్తృతంగా ప్రస్తావించిందని ప్రధాని ఉటంకించారు. రాజ్యాంగ నిర్దేశాలకు కట్టుబాటుతోపాటు దాని స్ఫూర్తిని కొనసాగించడం అవశ్యమని, దీన్ని తాము ఆచరించి చూపామని పేర్కొన్నారు. రాష్ట్రాల్లో ప్రభుత్వ కార్యకలాపాలను గవర్నర్లు తమ ప్రసంగంలో ప్రస్తావించే రీతిలోనే రాష్ట్రపతి కూడా గత సంవత్సర ప్రభుత్వ కార్యకలాపాలను వివరించడం ఒక సంప్రదాయమని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. గుజరాత్‌లో తాను ముఖ్యమంత్రిగా ఉన్నపుడు రాజ్యాంగ స్వర్ణోత్సవం (50వ వార్షికోత్సవం) సందర్భంగా రాజ్యాంగం, ప్రజాస్వామ్యాల వాస్తవ స్ఫూర్తిని చాటుతూ కార్యక్రమాలు నిర్వహించడాన్ని ప్రధాని గుర్తుచేశారు. అందులో భాగంగా గత 50 ఏళ్లుగా శాసనసభల్లో గవర్నర్ల ప్రసంగాలన్నింటినీ ఓ పుస్తకంగా రూపొందించాలని తాను కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అది నేడు అన్ని గ్రంథాలయాలలో అందుబాటులో ఉందని వెల్లడించారు. ఈ ప్రసంగాల ప్రచురణను ఆనాటి తమ ప్రభుత్వ యంత్రాంగం గర్వకారణంగా భావించిందని పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకోవడం, దానికి అనుగుణంగా నడచుకోవడం, అంకిత భావం ప్రదర్శించడంలోని ప్రాముఖ్యాన్ని ఆయన స్పష్టం చేశారు.
తమ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన సందర్భంలో గుర్తింపు పొందిన ప్రతిపక్ష పార్టీ అంటూ లేదన్నారు. ఏ రాజకీయ పార్టీకీ అందుకు తగినన్ని స్థానాలు దక్కలేదని గుర్తుచేశారు. పరిపాలనలో ప్రతిపక్ష నాయకుడి పాత్రకు అనేక చట్టాలు వీలు కల్పిస్తున్నా విపక్షమనేదే లేనందువల్ల తమ ప్రభుత్వం స్వతంత్రంగా వ్యవహరించే వెసులుబాటు లభించిందని ప్రధాని చెప్పారు. అయినప్పటికీ తాము రాజ్యాంగ స్ఫూర్తికి, ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడి నడచుకున్నామని తెలిపారు. గుర్తింపు పొందిన ప్రతిపక్షం లేకపోయినా, అతిపెద్ద పార్టీ నాయకుడికి ఆహ్వానం ఉండాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రజాస్వామ్య ఆవశ్యకతపై తమ నిబద్ధతకు ఇది నిదర్శనమన్నారు. దేశ ప్రధానమంత్రులు లోగడ స్వతంత్రంగా ఫైళ్లను నిర్వహించేవారని, తన పాలన ప్రక్రియలో ప్రతిపక్ష నాయకుడి పాత్రకూ అవకాశం కల్పించామని శ్రీ మోదీ వ్యాఖ్యానించారు. తదనుగుణంగా వారి భాగస్వామ్యానికి వీలు కల్పిస్తూ చట్టాలను కూడా రూపొందించామని తెలిపారు. ఎన్నికల సంఘం ఏర్పాటు నిర్ణయ ప్రక్రియలోనూ ప్రతిపక్ష నాయకుడు భాగస్వామిగా ఉంటారని, రాజ్యాంగానుసారం నడచుకోవడంలో తమ నిబద్ధతకు ఇది తార్కాణమని చెప్పారు.
ఢిల్లీలోని అనేక ప్రదేశాలలో కుటుంబాలు సృష్టించిన ప్రైవేట్ మ్యూజియంలు ఉన్నాయని శ్రీ మోదీ ప్రస్తావిస్తూ- ప్రభుత్వ నిధుల వినియోగంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజ్యాంగ అనుసరణకు కట్టుబాటు చాలా ముఖ్యమని వ్యాఖ్యానించారు. ఈ మేరకు తనకు ముందున్న వారు సహా అందరు ప్రధానమంత్రుల జీవిత విశేషాలను, దేశం కోసం వారి కృషిని ప్రదర్శించే ప్రధానమంత్రుల మ్యూజియం ఏర్పాటు చేశామని వివరించారు. ఈ మ్యూజియంలో ప్రదర్శితమవుతున్న గొప్ప నాయకులకు చెందిన కుటుంబాలు దీన్ని సందర్శించాలని కోరారు. ఈ ప్రదర్శనశాలను యువతరానికి స్ఫూర్తినిచ్చేలా మరింత చక్కగా తీర్చిదిద్దడానికి సూచనలు, సలహాలివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఎవరి జీవితం వారు జీవించడం సర్వసాధారణమైనా, రాజ్యాంగబద్ధంగా నడచుకోవడం అత్యున్నత ఆదర్శమని స్పష్టం చేశారు.
“అధికారాన్ని సేవ కోసం వినియోగిస్తే అది దేశ ప్రగతికి తోడ్పడుతుంది. కానీ, అధికారం వారసత్వంగా మారితే అది ప్రజలపాలిట విధ్వంసకారిగా మారుతుంది” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. కాబట్టి తాము రాజ్యాంగ స్ఫూర్తికి కట్టుబడి ఉంటామని, విచ్ఛిన్న రాజకీయాలకు పాల్పడబోమని స్పష్టం చేశారు. జాతీయ సమైక్యత ప్రాధాన్యాన్ని వివరిస్తూ- రాజ్యాంగ స్ఫూర్తిపై నిబద్ధత తమ కార్యాచరణకు మూలమని చెప్పారు. అందుకే ‘సమైక్యతా ప్రతిమ’ (స్టాచ్యూ ఆఫ్ యూనిటీ) పేరిట ప్రపంచంలోనే ఎత్తయిన సర్దార్ వల్లభ్‌భాయ్ విగ్రహాన్ని రూపొందించామని ప్రధాని గుర్తుచేశారు.
దేశానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే అర్బన్ నక్సల్స్ భాషను కొందరు బాహాటంగా ఉపయోగించడం దురదృష్టకరమని ఆందోళన వ్యక్తం చేసిన శ్రీ మోదీ… ఈ భాషను మాట్లాడేవారు, భారత దేశాన్ని సవాలు చేసేవారు రాజ్యాంగాన్ని గానీ, దేశ సమైక్యతను గానీ అర్థం చేసుకోలేరని అన్నారు.
ఏడు దశాబ్దాలుగా జమ్మూ కాశ్మీర్, లడఖ్ రాజ్యాంగ హక్కులను కోల్పోయాయని, ఇది రాజ్యాంగానికి, జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్ ప్రజలకు జరిగిన అన్యాయమని ప్రధాని పేర్కొన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడంతో, ఈ ప్రాంతాల ప్రజలు ఇప్పుడు దేశంలోని ఇతర పౌరులతో సమానమైన హక్కులను పొందుతున్నారని ప్రధానమంత్రి అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని అర్థం చేసుకుని జీవిస్తున్నారని, అందుకే ఇలాంటి సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు.
రాజ్యాంగం ఏ విధంగానూ వివక్షను అనుమతించదని స్పష్టం చేస్తూ, పక్షపాత మనస్తత్వంతో జీవించే వారిని శ్రీ మోదీ విమర్శించారు. ముస్లిం మహిళలపై విధించిన ఆంక్షలను ప్రస్తావిస్తూ, ట్రిపుల్ తలాక్ ను రద్దు చేయడం ద్వారా రాజ్యాంగం ప్రకారం ముస్లిం ఆడపిల్లలకు సరైన సమానత్వం కల్పించామని ప్రధానమంత్రి తెలిపారు.
తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడల్లా ముందుచూపుతో పనిచేసినట్లు ఆయన చెప్పారు. నిరాశ, నిస్పృహలతో కొందరు ఉపయోగిస్తున్న ద్రోహపూరిత భాషపై ఆందోళన వ్యక్తం చేశారు. మహాత్మాగాంధీ కలలుగన్న విధంగా తమ దృష్టి ఎప్పుడూ వెనుకబడిన వారిపైనే ఉందని ఆయన పేర్కొన్నారు. అటల్ బిహారీ వాజ్ పేయి నాయకత్వంలో ఈశాన్య రాష్ట్రాలకు, గిరిజన వ్యవహారాలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖలను ఏర్పాటు చేయడం సమ్మిళిత అభివృద్ధి పట్ల వారి నిబద్ధతను చాటిచెప్పిందని శ్రీ మోదీ పేర్కొన్నారు.
భారతదేశ దక్షిణ, తూర్పు తీర రాష్ట్రాలలో మత్స్యకార జనాభా అధికంగా ఉందని, సమాజాలను కలిగి ఉన్నాయని, చిన్న నీటి వనరుల ప్రాంతాలతో ఉన్న వారితో సహా ఈ వర్గాల సంక్షేమాన్ని పరిగణనలోకి తీసుకోవలసిన ప్రాముఖ్యతను గుర్తించి మత్స్యకారుల అవసరాలను తీర్చేందుకు, వారి జీవనోపాధి కోసం ప్రత్యేకంగా మత్స్యకారుల మంత్రిత్వ శాఖను సృష్టించిన ప్రభుత్వం తమదేనని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
సమాజంలోని అట్టడుగు వర్గాల్లో ఉన్న సామర్ధ్యాలను ప్రస్తావిస్తూ, నైపుణ్యాభివృద్ధిపై దృష్టి పెట్టడం ద్వారా, కొత్త అవకాశాలను సృష్టించవచ్చని, ఇది వారి ఆకాంక్షలకు జీవం పోస్తుందని ప్రధాని అన్నారు. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. అత్యంత సాధారణ పౌరులకు కూడా అవకాశాలు కల్పించడమే ప్రజాస్వామ్య ప్రాథమిక కర్తవ్యమని స్పష్టం చేశారు. కోట్లాది మంది ప్రజలను కలిపే భారతదేశ సహకార రంగాన్ని ప్రోత్సహించడానికి, బలోపేతం చేయడానికి ప్రభుత్వం సహకార సంఘాల కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసిందని, ఇది తమ దార్శనికతకు నిదర్శనమని ప్రధాని పేర్కొన్నారు.
కులం గురించి చర్చించడం కొందరికి ఒక ఫ్యాషన్ గా మారిందని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. గత 30-35 ఏళ్లుగా వివిధ పార్టీలకు చెందిన ఓబీసీ ఎంపీలు ఓబీసీ కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించాలని డిమాండ్ చేస్తున్నారని, ఈ కమిషన్‌కు రాజ్యాంగ హోదా ఇచ్చిన ప్రభుత్వం తమదేనని ఆయన వెల్లడించారు. ప్రస్తుతం వెనుకబడిన తరగతుల కమిషన్ ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలో భాగమైందని ఆయన పేర్కొన్నారు. ప్రతి రంగంలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాలకు గరిష్ఠ అవకాశాలు కల్పించేందుకు తాము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని ప్రధాని పేర్కొన్నారు. ఒకే ఎస్సీ కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు ఒకేసారి పార్లమెంటులో పనిచేసిన సందర్భం లేదా ఒకే ఎస్టీ కుటుంబానికి చెందిన ముగ్గురు ఎంపీలు ఒకేసారి పనిచేసిన సందర్భం ఎప్పుడైనా ఉందా అని ప్రశ్నించారు. కొంతమంది వ్యక్తుల మాటలకు, చేతలకు మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని ఆయన ప్రస్తావించారు. , ఇది వారి వాగ్దానాలకు, వాస్తవానికి మధ్య చాలా అంతరాన్ని సూచిస్తుందని అన్నారు.
ఎస్సీ, ఎస్టీ వర్గాల సాధికారత అవసరమని, సామాజిక ఉద్రిక్తతలు సృష్టించకుండా ఐక్యతను కాపాడుకోవడం ముఖ్యమని ప్రధాని స్పష్టం చేశారు. 2014కు ముందు దేశంలో 387 మెడికల్ కాలేజీలు ఉండేవని, ప్రస్తుతం ఆ సంఖ్య 780కి పెరగడంతో ఎక్కువ సీట్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. 2014కు ముందు ఎస్సీ విద్యార్థులకు 7,700 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవన్నారు. పది సంవత్సరాల శ్రమ ఫలితంగా, ఆ సంఖ్య 17,000కి పెరిగింది. ఇది దళిత సమాజం నుంచి వైద్యులు కావడానికి భారీగా అవకాశాలను పెంచింది. ఎలాంటి సామాజిక ఉద్రిక్తతలను సృష్టించకుండా, పరస్పర గౌరవాన్ని కాపాడుతూ దీనిని సాధించినట్టు చెప్పారు. 2014కు ముందు ఎస్టీ విద్యార్థులకు 3,800 ఎంబీబీఎస్ సీట్లు ఉండేవని, ప్రస్తుతం ఈ సంఖ్య దాదాపు 9 వేలకు పెరిగిందని చెప్పారు. 2014కు ముందు ఓబీసీ విద్యార్థులకు 14 వేల కంటే తక్కువ ఎంబీబీఎస్ సీట్లు ఉండేవని, నేడు, ఈ సంఖ్య సుమారుగా పెరిగి, 32,000 మంది ఒబిసి విద్యార్థులు డాక్టర్లు కావడానికి వీలు కల్పించిందని చెప్పారు. గత పదేళ్లుగా ప్రతి వారం ఒక కొత్త విశ్వవిద్యాలయం ఏర్పాటు చేశామని, ప్రతిరోజూ ఒక కొత్త ఐటీఐని ప్రారంభించామని, ప్రతి రెండు రోజులకు ఒక కొత్త కళాశాలను ప్రారంభించామని ప్రధాని వివరించారు. ఇప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ యువతకు అవకాశాలు గణనీయంగా పెరిగాయన్నారు.
ఏ ఒక్క లబ్దిదారునీ కూడా విడవకుండా అన్ని పథకాల ప్రయోజనాలను నూటికి నూరు మందికీ అందించేందుకు తాము కట్టుబడి ఉన్నామని శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రయోజనాలకు అర్హులైన ప్రతి ఒక్కరూ వాటిని పొందాలని, అవి కొందరికే పరిమతమనే కాలం చెల్లిపోయిందని ఆయన పేర్కొన్నారు.
బుజ్జగింపు రాజకీయాలను ప్రధాన మంత్రి దుయ్యబట్టారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం, బుజ్జగింపు నుండి సంతృప్తి మార్గంలోకి వెళ్లాలని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి వర్గానికి ఎలాంటి వివక్ష లేకుండా న్యాయం జరగాలని ఆయన ఉద్ఘాటించారు. 100 శాతం సంతృప్తతను సాధించడం అంటే నిజమైన సామాజిక న్యాయం, లౌకికవాదం, రాజ్యాంగం పట్ల గౌరవం అని స్పష్టం చేశారు.
అందరికీ మెరుగైన ఆరోగ్యాన్ని అందించడమే రాజ్యాంగ స్ఫూర్తి అని అంటూ, ఈ రోజు క్యాన్సర్ దినోత్సవం గురించి ప్రస్తావించారు. ఆరోగ్యం గురించి దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా చర్చ జరుగుతోందని అన్నారు. రాజకీయ స్వార్థంతో కొందరు వ్యక్తులు పేదలు, వృద్ధులకు వైద్య సేవలు అందించేందుకు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ప్రత్యేక ప్రైవేటు ఆసుపత్రులతో సహా 30,000 ఆసుపత్రులను ఆయుష్మాన్ భారత్ పథకానికి అనుసంధానమై ఆయుష్మాన్ భారత్ కార్డుదారులకు ఉచిత చికిత్సను అందిస్తున్నాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. అయితే, కొన్ని రాజకీయ పార్టీలు తమ సంకుచిత దృక్పథం, తప్పుడు విధానాల కారణంగా ఈ ఆసుపత్రుల ద్వారాలను పేదలకు మూసివేయడంతో క్యాన్సర్ రోగులు ప్రభావితులయ్యారని పేర్కొన్నారు. ఆయుష్మాన్ పథకం కింద సకాలంలో క్యాన్సర్ చికిత్స ప్రారంభమైందని పబ్లిక్ హెల్త్ జర్నల్ ‘లాన్సెట్’ ఇటీవల చేసిన అధ్యయనాన్ని ఉటంకిస్తూ.. క్యాన్సర్ స్క్రీనింగ్ , చికిత్సలో ప్రభుత్వ నిబద్ధతను శ్రీ మోదీ పేర్కొన్నారు. ప్రారంభ రోగ నిర్ధారణ, చికిత్స క్యాన్సర్ రోగులను రక్షించగలదని అన్నారు. ఆయుష్మాన్ పథకాన్ని లాన్సెట్ ప్రశంసించింది, భారతదేశంలో ఈ దిశలో గణనీయమైన పురోగతిని గుర్తించింది.
క్యాన్సర్ మందులను మరింత చౌకగా అందించడానికి ఈ బడ్జెట్ లో తీసుకున్న ముఖ్యమైన చర్యను ప్రముఖంగా పేర్కొన్న శ్రీ మోదీ… ముఖ్యంగా క్యాన్సర్ దినోత్సవం రోజున ఇది క్యాన్సర్ రోగులకు ప్రయోజనం చేకూర్చే ఒక ముఖ్యమైన నిర్ణయం అని పేర్కొన్నారు. గౌరవ ఎంపీలందరూ తమ నియోజకవర్గాల్లోని రోగులు ఈ ప్రయోజనాన్ని వినియోగించుకునేలా చూడాలని ఆయన కోరారు. పరిమిత సంఖ్యలో ఆస్పత్రులు ఉండటం వల్ల రోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను గుర్తించి 200 డేకేర్ సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. ఈ కేంద్రాలు రోగులకు, వారి కుటుంబాలకు ఎంతో ఉపశమనం కలిగిస్తాయి.
రాష్ట్రపతి ప్రసంగం సందర్భంగా విదేశాంగ విధానంపై జరిగిన చర్చలను ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ, కొందరు వ్యక్తులు విదేశాంగ విధానంపై పరిణతి ఉన్నట్టు అవి దేశ ప్రయోజనాలకు హాని కలిగించేవైనా మాట్లాడే ప్రయత్నం చేసినట్టు కనబడిందని ప్రధాని వ్యాఖ్యానించారు. విదేశీ విధానంపై నిజంగా ఆసక్తి ఉన్నవారు ప్రఖ్యాత విదేశాంగ విధాన పండితుడు రాసిన “జెఎఫ్ కె ఫర్గాటెన్ క్రైసిస్” పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు. భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీల మధ్య క్లిష్ట సమయాల్లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు, చర్చలను ఈ పుస్తకంలో వివరించారు.
నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ అయిన రాష్ట్రపతి ప్రసంగం అనంతరం ఆమె పట్ల చూపిన అగౌరవం పట్ల ప్రధాని అసంతృప్తి వ్యక్తం చేశారు. తనకు రాజకీయ నైరాశ్యం అర్థమవుతుందని, అయితే రాష్ట్రపతి పట్ల ఇంత అగౌరవం వెనుక కారణాలేమిటని ప్రశ్నించారు. తిరోగమన మనస్తత్వాలను వదిలి మహిళల నేతృత్వంలోని అభివృద్ధి మంత్రాన్ని స్వీకరించడం ద్వారా భారతదేశం ముందుకు వెళ్తోందని పేర్కొన్న శ్రీ మోదీ, జనాభాలో సగం ఉన్న మహిళలకు పూర్తి అవకాశాలు కల్పిస్తే, భారతదేశం రెట్టింపు వేగంతో పురోగతి సాధిస్తుందని స్పష్టం చేశారు. ఈ రంగంలో 25 ఏళ్లు పనిచేసిన తర్వాతనే తన ఆత్మవిశ్వాసం మరింత దృఢపడిందని అన్నారు. గడచిన పదేళ్లలో 10 కోట్ల మంది మహిళలు, ప్రధానంగా అట్టడుగు, గ్రామీణ నేపథ్యం నుంచి స్వయం సహాయక సంఘాల్లో చేరారని ప్రధాని చెప్పారు. ఈ మహిళల సామర్థ్యాలు పెరిగాయి, వారి సామాజిక స్థితి మెరుగుపడింది, వారి పనిని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం వారి సహాయాన్ని రూ.20 లక్షల వరకు పెంచింది. ఈ ప్రయత్నాలు గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై అత్యంత సానుకూల ప్రభావాన్ని చూపాయని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలో లక్‌పతి దీదీ పథకం ప్రస్తావనపై ప్రధానమంత్రి మాట్లాడుతూ.. మూడోసారి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి 50 లక్షలకు పైగా లక్‌పతి దీదీలు నమోదయ్యారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రారంభమైనప్పటి నుంచి సుమారు 1.25 కోట్ల మంది మహిళలు లక్‌పతి దీదీలుగా మారారని, ఆర్థిక అంశాలకు సంబంధించిన వివిధ కార్యక్రమాల ద్వారా మూడు కోట్ల మంది మహిళలను లక్‌పతి దీదీలుగా తయారు చేయడమే లక్ష్యమని అన్నారు. నమో డ్రోన్ దీదీలుగా పిలిచే మహిళలు డ్రోన్లను ఆపరేట్ చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో వచ్చిన గణనీయమైన మానసిక మార్పును ఆయన ప్రస్తావించారు. ఈ డ్రోన్ దీదీలు పొలాల్లో పనిచేస్తూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. మహిళా సాధికారతలో ముద్రా యోజన పాత్రను కూడా ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. దీని ద్వారా కోట్లాది మంది మహిళలు మొదటిసారిగా పారిశ్రామిక రంగంలోకి వెళ్లి పారిశ్రామికవేత్తల పాత్రలను పోషిస్తున్నారు.
ప్రజలకు అందించిన 4 కోట్ల గృహాల్లో సుమారు 75 శాతం మహిళల పేరిటే నమోదయ్యాయని.. “ఈ మార్పు 21వ శతాబ్దపు బలమైన, సాధికారిక భారత్‌కు పునాది వేస్తోంది” అని ప్రధాని ఉద్ఘాటించారు. “గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయకుండా అభివృద్ధి చెందిన దేశం అనే లక్ష్యాన్ని సాధించలేం” అని ఆయన వ్యాఖ్యానించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించారు. అభివృద్ధి చెందిన భారత్‌కు రైతులు బలమైన మూలస్తంభమని పేర్కొన్నారు. గత దశాబ్ద కాలంలో, 2014 నుంచి వ్యవసాయ బడ్జెట్ పది రెట్లు పెరగటంతో ఈ విషయంలో గణనీయమైన పెరుగుదల నమోదైంది.
2014కు ముందు యూరియా విషయంలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని, డిమాండ్ చేసిన ప్రాంతాల్లో రైతులు పోలీసు చర్యలను కూడా ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. రాత్రంతా క్యూలైన్లలో నిల్చునేవాళ్లని, రైతులకు అందాల్సిన ఎరువులు తరచూ బ్లాక్ మార్కెట్లలో విక్రయం అయ్యేవని అన్నారు. నేడు రైతులకు పుష్కలంగా ఎరువులు అందుతున్నాయని ఆయన పేర్కొన్నారు. కోవిడ్-19 సంక్షోభ సమయంలో సరఫరా వ్యవస్థలు దెబ్బతిన్నాయని, ప్రపంచవ్యాప్తంగా ధరలు పెరిగాయని అన్నారు. దిగుమతి చేసుకుంటున్న యూరియాపై దేశం ఆధారపడి ఉన్నప్పటికీ, ప్రభుత్వం ఆ ఖర్చును భరించగలిగిందని తెలిపారు. ప్రభుత్వం రూ. 3 వేల విలువైన యూరియా బస్తాను రూ.300 కంటే తక్కువకే రైతులకు అందిస్తోందన్నారు. నిరంతరం ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలు రైతులకు గరిష్ట ప్రయోజనాలను చేకూరుస్తాయని పేర్కొన్నారు.
గత పదేళ్లలో రైతులకు అందుబాటు ధరల్లో ఎరువులను అందించడానికి రూ .12 లక్షల కోట్లు ఖర్చు చేశామని, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా సుమారు రూ. 3.5 లక్షల కోట్లను నేరుగా రైతు ఖాతాలకు బదిలీ చేశామని తెలిపారు. ఎంఎస్పీ రికార్డు స్థాయిలో పెరిగిందని, గత దశాబ్ద కాలంలో కొనుగోళ్లు మూడు రెట్లు పెరిగాయని పేర్కొన్నారు. రైతు రుణాలను మరింత అందుబాటులోకి తెచ్చామని.. ఇచ్చే రుణ మొత్తాన్ని మూడింతలు పెంచామని పేర్కొన్నారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు గతంలో రైతులు స్వంతంగా నష్టాన్ని భరించేవారని, కానీ పీఎం ఫసల్ బీమా యోజన కింద రైతులకు రూ.2 లక్షల కోట్లు పంపిణీ చేసినట్లు గుర్తు చేశారు. గత దశాబ్ద కాలంలో నీటిపారుదల రంగంలో మునపెన్నడూ లేనంతగా తీసుకున్న చర్యల గురించి ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. నీటి నిర్వహణ విషయంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సమగ్ర, సమ్మిళిత దార్శనికతను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న 100కు పైగా భారీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి పొలాలకు నీరందించామన్నారు. డాక్టర్ అంబేద్కర్ నదులు అనుసంధానం చెయ్యాలని చెప్పేవారని, ఇది ఏళ్ల తరబడి నెరవేర లేదని ప్రధాని గుర్తు చేశారు. నేడు కెన్–బెట్వా లింక్ ప్రాజెక్ట్, పార్వతి–కాళిసింధ్–చంబల్ లింక్ ప్రాజెక్ట్ వంటివి ప్రారంభమయ్యాయి. నదుల అనుసంధానం విషయంలో గుజరాత్‌లో విజయవంతంగా చేపట్టిన పనులకు సంబంధించిన అనుభవాన్ని ఆయన పంచుకున్నారు.
“ప్రపంచవ్యాప్తంగా తినేందుకు కూర్చునే టేబుళ్లపై భారత్‌తో తయారైన ఆహార ప్యాకెట్లను చూడాలని ప్రతి భారతీయుడు కలలు కనాలి” అని మోదీ పేర్కొన్నారు. భారతీయ టీ, కాఫీలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయని.. కోవిడ్ తర్వాత పసుపుకు డిమాండ్ పెరగటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో శుద్ధి చేసిన భారత సముద్ర ఆహారం, బిహార్ మఖానా కూడా ప్రపంచవ్యాప్తంగా తమదైన ముద్ర వేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రీ అన్న అని పిలుచుకునే భారత చిరుధాన్యాలు అంతర్జాతీయ మార్కెట్లలో దేశ ఖ్యాతిని పెంచుతాయని ప్రధానంగా చెప్పారు.
అభివృద్ధి చెందిన భారతదేశం కోసం భవిష్యత్‌కు సిద్ధంగా ఉన్న నగరాల ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్తావించిన మోదీ.. దేశం వేగంగా పట్టణీకరణ చెందుతోందని, దీనిని ఒక సవాలుగా కాకుండా ఒక అవకాశంగా చూడాలన్నారు. మౌలిక సదుపాయాలను పెంచటం అనేది అవకాశాలను సృష్టించేందుకు దారితీస్తుందని.. అనుసంధానం పెరగడం వల్ల అవకాశాలు వృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. దిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్‌లను కలిపే తొలి నమో రైలు ప్రారంభోత్సవాన్ని ప్రస్తావిస్తూ.. అందులో ప్రయాణించిన అనుభవాన్ని పంచుకున్నారు. భారత భవిష్యత్ దిశను నిర్దేశించేలా దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు ఇటువంటి అనుసంధాన, మౌలిక సదుపాయాలు చేరాల్సిన అవసరాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావించారు. ఢిల్లీ మెట్రో రైల్ మార్గం రెట్టింపు అయిందని, ఇప్పుడు మెట్రో మార్గాలు ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు విస్తరిస్తున్నాయని అన్నారు. భారత మెట్రో నెట్‌వర్క్ 1,000 కిలోమీటర్లను దాటిందని.. ప్రస్తుతం మరో 1,000 కిలోమీటర్ల మెట్రో నిర్మాణంలో ఉందని, ఇది శరవేగంగా పురోగతి సాధిస్తోందని ప్రధాని సగర్వంగా తెలియజేశారు. కాలుష్యాన్ని తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన అనేక కార్యక్రమాలను ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా 12,000 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడం, డిల్లీకి అందిన పలు ప్రయోజనాలు ఇందులో ఉన్నాయి.
ప్రధాన నగరాల్లో గిగ్ ఎకానమీ విస్తరణ గురించి ప్రస్తావిస్తూ.. లక్షలాది మంది యువత ఇందులో చేరుతున్నారని, ఈ–శ్రమ్ పోర్టల్‌లో గిగ్ వర్కర్లను నమోదు చేస్తామని, తనిఖీ తర్వాత ఐడీ కార్డును కూడా అందించనున్నట్లు ప్రకటించారు. ఆయుష్మాన్ పథకం ద్వారా గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలుగుతుందని, ఆరోగ్య సంరక్షణ వారికి అందుబాటులో ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో కోటి మంది గిగ్ వర్కర్లు ఉన్నారని, ఈ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం తీసుకుంటోన్న చర్యలను ప్రధానంగా ప్రస్తావించారు.
ఎంఎస్‌ఎంఈ రంగం కల్పిస్తోన్న గణనీయమైన ఉద్యోగావకాశాలను గురించి ప్రధాని ప్రధానంగా మాట్లాడారు. చిన్న పరిశ్రమలు స్వావలంబన భారత్‌కు ప్రతీక అని.. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎనలేని దోహదం చేస్తాయని అన్నారు. సరళత, సౌలభ్యం, ఎంఎస్ఎంఈలకు మద్దతు, తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి, నైపుణ్యాభివృద్ధి ద్వారా యువతకు ఉద్యోగాలను కల్పించేందుకు మిషన్ మాన్యుఫాక్చరింగ్‌పై ప్రభుత్వ విధాం దృష్టి పెడుతుందని తెలియజేశారు.
ఎంఎస్ఎంఈ రంగాన్ని మెరుగుపరిచేందుకు అనేక కార్యక్రమాలను ప్రారంభించామని అన్న ఆయన.. 2006లో తీసుకొచ్చిన ఎంఎస్ఎంఈ నిర్వచనాన్ని గత దశాబ్దంలో రెండుసార్లు నవీకరించామని తెలిపారు. 2020లో, ప్రస్తుత బడ్జెట్‌లో ఈ విషయంలో గణనీయమైన మార్పులు వచ్చాయని మోదీ అన్నారు. ఎంఎస్ఎంఈలకు అందించిన ఆర్థిక మద్దతు, వ్యవస్థీకృత ఆర్థిక సహాయం అందటంలో సవాళ్లను పరిష్కరించడం, కోవిడ్ సంక్షోభ సమయంలో ఎంఎస్ఎంఈ రంగానికి ఇచ్చిన ప్రత్యేక సహాయాన్ని వివరించారు. బొమ్మలు, వస్త్రాలు వంటి పరిశ్రమలపై దృష్టి సారించటం, నగదు ప్రవాహం ఉండేలా చూసుకోవటం, పూచీకత్తు లేకుండా రుణాలు అందించడం వల్ల ఉద్యోగ కల్పన, ఉద్యోగ భద్రత లభిస్తుందని వ్యాఖ్యానించారు. చిన్న పరిశ్రమల వ్యాపార కార్యకలాపాలను సులభతరం చేయడానికి కస్టమైజ్డ్ క్రెడిట్ కార్డులు, క్రెడిట్ గ్యారంటీ కవరేజీని ప్రవేశపెట్టడాన్ని కూడా ప్రస్తావించారు. 2014కు ముందు దేశం బొమ్మలను దిగుమతి చేసుకునేదని.. కానీ నేడు భారతీయ బొమ్మల తయారీదారులు ప్రపంచవ్యాప్తంగా బొమ్మలను ఎగుమతి చేస్తున్నారని, దిగుమతులు గణనీయంగా తగ్గాయని, ఎగుమతులు 239% పెరిగాయని తెలిపారు. ఎంఎస్ఎంఈలు కార్యకలాపాలు నిర్వహిస్తోన్న వివిధ రంగాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతున్నాయని.. దుస్తులు, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ వస్తువులు వంటి భారత్‌లో తయారైన ఉత్పత్తులు ఇతర దేశాల్లో దైనందిన జీవితంలో భాగమవుతున్నాయని ప్రధాని వివరించారు.
అభివృద్ధి చెందిన భారతదేశం కల కేవలం ప్రభుత్వానిది కాదని, 140 కోట్ల మంది భారతీయులదని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దేశం ఎంతో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని, ఈ కలను సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ తమ శక్తియుక్తులను అందించాలని కోరారు. 20-25 ఏళ్లలో ఒక దేశం అభివృద్ధి చెందుతుంది అనటానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ ఉదాహరణలు ఉన్నాయన్నారు. జనాభా విషయంలో ప్రయోజనాలు, ప్రజాస్వామ్యం, డిమాండ్ ఉన్న భారత్ 2047 నాటికి.. 100 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు జరుపుకునే నాటికి ఇది సాధించగలదని ధీమా వ్యక్తం చేశారు.
గొప్ప లక్ష్యాలను సాధించాల్సిన అవసరాన్ని ప్రధానమంత్రి ప్రధానంగా తెలియజేశారు. ఆధునిక, సమర్థవంతమైన, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని సృష్టించడానికి రాబోయే అనేక సంవత్సరాల పాటు కట్టుబడి ఉండవలసిన అవసరాన్ని గట్టిగా తెలిపారు. అన్ని రాజకీయ పార్టీలు, నాయకులు, పౌరులు అన్నింటికీ మించి దేశానికి ప్రాధాన్యత ఇవ్వాలని.. అభివృద్ధి చెందిన భారత్ కల కోసం కలిసి పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. తన ప్రసంగాన్ని ముగించిన ప్రధాన మంత్రి.. రాష్ట్రపతి ప్రసంగానికి కృతజ్ఞతలు తెలిపి, సభలోని సభ్యులకు అభినందనలు తెలియజేశారు.
***
The President’s address clearly strengthens the resolve to build a Viksit Bharat! pic.twitter.com/0LkMOVGe9t
— PMO India (@PMOIndia) February 4, 2025
A Government that has worked for all sections of society. pic.twitter.com/NkQ2caCc9p
— PMO India (@PMOIndia) February 4, 2025
We believe in ensuring resources are spent towards public welfare. pic.twitter.com/IYl8D4jaeT
— PMO India (@PMOIndia) February 4, 2025
Our Government is proud of the middle class and will always support it! pic.twitter.com/j7VYFXx5Bk
— PMO India (@PMOIndia) February 4, 2025
Proud of India's Yuva Shakti. pic.twitter.com/9Ttm8DaajG
— PMO India (@PMOIndia) February 4, 2025
Leveraging the power of AI to build an Aspirational India. pic.twitter.com/Mnbk5IwdUQ
— PMO India (@PMOIndia) February 4, 2025
An unwavering commitment to strengthening the values enshrined in our Constitution. pic.twitter.com/j3i0zegzQ1
— PMO India (@PMOIndia) February 4, 2025
Public service is all about nation building. pic.twitter.com/B2ilXOHjoq
— PMO India (@PMOIndia) February 4, 2025
Our commitment to the Constitution motivates us to take strong and pro-people decisions. pic.twitter.com/4ALSCOulBk
— PMO India (@PMOIndia) February 4, 2025
Our Government has worked to create maximum opportunities for people from SC, ST and OBC Communities. pic.twitter.com/ft4vTHtaOr
— PMO India (@PMOIndia) February 4, 2025
Our Government has shown how to strengthen unity as well as care for the poor and downtrodden. pic.twitter.com/APfORBYryb
— PMO India (@PMOIndia) February 4, 2025
Emphasis on saturation is generating outstanding results. pic.twitter.com/Q5c1WU08NR
— PMO India (@PMOIndia) February 4, 2025
In the last decade, unprecedented support has been given to the MSME sector. pic.twitter.com/C6P3sguBH1
— PMO India (@PMOIndia) February 4, 2025
Speaking in the Lok Sabha. https://t.co/5cGIgu7G00
— Narendra Modi (@narendramodi) February 4, 2025
गरीबों की झोपड़ियों में फोटो सेशन से अपना मनोरंजन करने वालों को हमारे गरीब भाई-बहनों की बात बोरिंग ही लगेगी! pic.twitter.com/6WXdUuluAf
— Narendra Modi (@narendramodi) February 4, 2025
हमारी योजनाओं से जन-सामान्य की अधिक से अधिक बचत हो, इस पर शुरू से ही हमारा पूरा फोकस रहा है। pic.twitter.com/4mwF3FIDbj
— Narendra Modi (@narendramodi) February 4, 2025
2014 से हमने देश के युवाओं की आकांक्षाओं पर बल दिया है। उसी का नतीजा है कि हमारे युवा आज हर क्षेत्र में सफलता का परचम लहरा रहे हैं। pic.twitter.com/dGzZju6FC1
— Narendra Modi (@narendramodi) February 4, 2025
संविधान को मजबूती देने के लिए, संविधान की भावना को जीना पड़ता है और हम वही कर रहे हैं। pic.twitter.com/wP9bzx7Ige
— Narendra Modi (@narendramodi) February 4, 2025
समाज में एकता की भावना को बरकरार रखते हुए वंचितों का कल्याण कैसे किया जाता है, हमारी सरकार ने इसके अनेक उदाहरण पेश किए हैं। pic.twitter.com/RC8EF5yDj4
— Narendra Modi (@narendramodi) February 4, 2025
मेरा दृढ़ विश्वास है कि हमारी माताओं-बहनों-बेटियों को पूरा अवसर मिले तो भारत दोगुनी रफ्तार से आगे बढ़ सकता है। इस दिशा में लखपति दीदी और ड्रोन दीदी के साथ ही सेल्फ हेल्प ग्रुप से जुड़ी महिलाएं देशभर के लिए मिसाल बनी हैं। pic.twitter.com/rvb6dlT6w8
— Narendra Modi (@narendramodi) February 4, 2025
हमारे किसान भाई-बहन विकसित भारत के चार आधारस्तंभों में से एक हैं। उनका जीवन अधिक से अधिक आसान बने, इसके लिए हमने बीते एक दशक में खेती के बजट में 10 गुना वृद्धि की है। pic.twitter.com/Y9PnQPdv5x
— Narendra Modi (@narendramodi) February 4, 2025
‘विकसित भारत’ कोई सरकारी सपना नहीं, बल्कि मेरे 140 करोड़ देशवासियों का सपना है। pic.twitter.com/efk3cVuoas
— Narendra Modi (@narendramodi) February 4, 2025