Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బెల్జియం ప్రధానిగా శ్రీ బార్ట్ డీ వేవర్ పదవీబాధ్యతలు.. ప్రధానమంత్రి అభినందనలు


బెల్జియం ప్రధాని గా శ్రీ బార్ట్ డీ వేవర్ పదవీబాధ్యతలను స్వీకరించిన సందర్భంగా ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆయనకు ఈ రోజు అభినందనలు తెలిపారు. భారత్-బెల్జియం సంబంధాల్ని మరింత బలపర్చుకోవడానికి, ప్రపంచ అంశాలపై సహకారాన్ని పెంపొందింపచేసుకోవడానికి ఇద్దరం కలిసి పనిచేస్తామన్న విశ్వాసం తనకు ఉందని శ్రీ మోదీ అన్నారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు :

 

‘‘ప్రధాని శ్రీ బార్ట్ డీ వేవర్ (@Bart_DeWever) .. మీరు పదవీబాధ్యతల్ని స్వీకరించిన సందర్బంగా మీకు నా హృదయపూర్వక అభినందనలు. భారత్-బెల్జియం సంబంధాల్ని మరింత పటిష్టపర్చుకోవడంతోపాటు ప్రపంచ అంశాల్లో మన సహకారాన్ని పెంపొందింపచేసుకోవడానికి మనం కలిసి పనిచేయాలని నేను ఆశిస్తున్నాను. మీ భావి పదవీకాలం ఫలప్రదం కావాలని కోరుకుంటూ, మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.’’