కేంద్ర బడ్జెటు 2025 భారత ప్రగతి పయనంలో ఒక గొప్ప మేలిమలుపు అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ‘వికసిత్ భారత్’ (అభివృద్ధి చెందిన భారతదేశం) దిశలో మన దేశ పయనానికి జోరందించడంలో ఈ బడ్జెటుకు ప్రాధాన్యం ఉందని ఆయన ఉద్ఘాటించారు.
నవకల్పన (ఇన్నొవేషన్), ఔత్సాహిక పారిశ్రామికత్వం, కృత్రిమ మేధ (ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సు ..ఏఐ), ఆటవస్తువుల తయారీ, వ్యవసాయం, పాదరక్షల తయారీ, ఆహార శుద్ధి రంగం, గిగ్ ఆర్థిక వ్యవస్థ సహా అనేక రంగాల్లో స్థిర ప్రాతిపదికన వృద్ధి.. వీటన్నిటికి కేంద్ర బడ్జెటు బాట పరుస్తుందన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో మైగవ్ (MyGov) పొందుపరిచిన కొన్ని సందేశాలకు ప్రధాని శ్రీ మోదీ స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘ఈ బడ్జెటు వికసిత్ భారత్ దిశగా పయనించాలన్న మన ఉమ్మడి సంకల్పానికి ప్రేరణను అందించనుంది.#ViksitBharatBudget2025”
A Budget that will add momentum towards our collective resolve of building a Viksit Bharat! #ViksitBharatBudget2025 https://t.co/kDONUwP4b2
— Narendra Modi (@narendramodi) February 1, 2025
**************
MJPS/ST
A Budget that will add momentum towards our collective resolve of building a Viksit Bharat! #ViksitBharatBudget2025 https://t.co/kDONUwP4b2
— Narendra Modi (@narendramodi) February 1, 2025