Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఊబకాయంతో పోరాడటానికి, నూనెల వినియోగాన్ని తగ్గించడానికి ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపునకు వైద్యులు, క్రీడాకారులు, వివిధ రంగాలకు చెందిన ప్రజల మద్దతు


ఊబకాయంపై పోరాడాలని, నూనెల వినియోగాన్ని తగ్గించాలని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇటీవల పిలుపునిచ్చారు. దీనికి వైద్యులు, క్రీడాకారులతో పాటు వివిధ వర్గాల ప్రజల నుంచి విస్తృత మద్దతు లభించింది.

డెహ్రాడూన్ లో జరిగిన 38వ జాతీయ క్రీడల ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, దేశంలో ఊబకాయం సమస్య వేగంగా పెరగడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మధుమేహం, గుండె జబ్బులు వంటి వ్యాధుల ప్రమాదాన్ని ఊబకాయం పెంచుతుందని అన్నారు. ఫిట్ ఇండియా ఉద్యమం గురించి మాట్లాడుతూ, వ్యాయామం, సమతుల ఆహారం ప్రాముఖ్యత గురించి ప్రస్తావించారు. ఆహారంలో అనారోగ్యకరమైన కొవ్వు నూనెను తగ్గించ వలసిన అవసరాన్ని స్పష్టం చేసిన ఆయన, రోజువారీ నూనె వినియోగాన్ని 10% తగ్గించాలని వినూత్న సూచన చేశారు.

ప్రధాని సందేశాన్ని ప్రశంసించిన నటుడు అక్షయ్ కుమార్ మంచి ఆరోగ్యం ప్రాముఖ్యత గురించి మాట్లాడారు.

ప్రధాని పిలుపునకు ఆరోగ్య శాఖ పెద్ద ఎత్తున స్పందించింది. క్రమం తప్పకుండా శారీరక శ్రమ, సమతుల్య పౌష్టికాహారం అవసరమని ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపును  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆగ్నేయాసియా ప్రత్యేకంగా ప్రస్తావించింది.

ఊబకాయం, దానితో ముడిపడి ఉన్న ఆరోగ్య ప్రమాదాలను తగ్గించేందుకు ఇది సమయానుకూల సందేశం అని పి.డి.హిందూజా హాస్పిటల్ సిఇఒ గౌతమ్ ఖన్నా అన్నారు.

స్థూలకాయంపై పోరాటానికి చర్యలు తీసుకోవాలని ప్రధాని ఇచ్చిన పిలుపును మహాజన్ ఇమేజింగ్ అండ్ ల్యాబ్స్ ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ హర్ష్ మహాజన్ ప్రశంసించారు.

ఉజాలా సిగ్నస్ హెల్త్ కేర్ సర్వీసెస్ ఫౌండర్ డైరెక్టర్ డాక్టర్ సుచిన్ బజాజ్ మాట్లాడుతూ,  ఊబకాయం తీవ్రమైన సవాలు అని, దీనిపై ఒక దేశంగా మనం తక్షణం కలిసి పోరాడాలని అన్నారు.

ఊబకాయాన్ని ఎదుర్కోవడం ప్రాముఖ్యతను సమర్థిస్తూ ఇతర వైద్యులు కూడా మాట్లాడారు.

ఇండియన్ డెంటల్ అసోసియేషన్, టాటా మెమోరియల్ హాస్పిటల్, ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఢిల్లీతో సహా అనేక ఆసుపత్రులు, వైద్య సంస్థలు, సంఘాలు కూడా ఊబకాయానికి వ్యతిరేకంగా ఉద్యమానికి మద్దతు తెలిపాయి.

క్రీడాకారులు కూడా ప్రధాని ఇచ్చిన పిలుపునకు మద్దతుగా మాట్లాడారు. సమతుల ఆహారం, వ్యాయామం, ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ ప్రారంభించిన ప్రచారం ప్రశంసనీయమని బాక్సర్ విజేందర్ సింగ్ అన్నారు.

ఫిట్నెస్ కోచ్ మిక్కీ మెహతా, ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ కాంస్య పతక విజేత గౌరవ్ బిధురి కూడా ప్రధాని చొరవకు మద్దతుగా మాట్లాడారు.

 

****