గౌరవనీయ ఇండోనేషియా అధ్యక్షులు, నా సోదరుడు ప్రబోవో సుబియాంటో,
ఇరు దేశాల ప్రతినిధులు,
మీడియా మిత్రులారా,
నమస్కారం!
భారత తొలి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఇండోనేషియా మన ముఖ్య అతిథిగా ఉంది. ఇప్పుడు మన 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా, ఇండోనేషియా మరోసారి ఈ చిరస్మరణీయ సందర్భంలో భాగం కావడానికి అంగీకరించడం మాకు చాలా గర్వకారణం. ఈ సందర్భంగా, ఆ దేశ అధ్యక్షులు ప్రబోవో సహా వారి బృందానికి నేను హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను.
మిత్రులారా,
2018లో నేను ఇండోనేషియాను సందర్శించినప్పుడు, మేం మా భాగస్వామ్యాన్ని సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంగా ముందుకు తీసుకెళ్లాం. ఈరోజు, వివిధ రంగాల్లో పరస్పర సహకారం గురించి ఆ దేశ అధ్యక్షులు ప్రబోవోతో మేం విస్తృత చర్చలు జరిపాం. రక్షణ రంగంలో మా సహకారాన్ని బలోపేతం చేయాలని, రక్షణ రంగ తయారీతో పాటు సప్లయ్ చెయిన్ వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని మేం నిర్ణయించుకున్నాం.
సముద్ర భద్రత, సైబర్ భద్రత, ఉగ్రవాదాన్ని అణిచేయడం అలాగే తీవ్రవాదాన్ని నిర్మూలించడం వంటి రంగాల్లో సహకారానికి సైతం మేం ప్రాధాన్యమిచ్చాం. సముద్ర భద్రత, రక్షణ గురించి ఈరోజు సంతకం చేసిన ఒప్పందం నేరాల నివారణ, శోధన, రక్షణ అలాగే సామర్థ్యాలను పెంపొందించుట వంటి రంగాల్లో మా సహకారాన్ని బలోపేతం చేస్తుంది. గత కొన్ని సంవత్సరాలుగా, మా ద్వైపాక్షిక వాణిజ్యం వేగంగా అభివృద్ధి చెందింది. అలాగే గతేడాది, ఇది 30 బిలియన్ అమెరికన్ డాలర్ల మార్కును దాటింది.
ఈ చర్యలను మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో, బహుముఖ మార్కెట్ యాక్సెస్, ట్రేడ్ బాస్కెట్ కోసం మేం చర్చించాం. ఈ ప్రయత్నాల్లో ప్రైవేట్ రంగం సైతం సమాన భాగస్వామిగా ఉంది. ఈరోజు నిర్వహించిన సీఈవో ఫోరమ్ సమావేశాన్ని అలాగే ప్రైవేట్ రంగంలో ఖరారైన ఒప్పందాలను మేం స్వాగతిస్తున్నాం. ఫిన్‌టెక్, కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వంటి రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని కూడా మేం నిర్ణయించాం.
ఆరోగ్యం, ఆహార భద్రత రంగాల్లో, మధ్యాహ్న భోజన పథకం, ప్రజా పంపిణీ వ్యవస్థల నుండి నేర్చుకున్న విషయాలు, అనుభవాలను భారత్ ఇండోనేషియాతో పంచుకుంటోంది. ఇంధనం, ముఖ్య ఖనిజాలు, సైన్స్, టెక్నాలజీ, అంతరిక్షం అలాగే ఎస్టీఈఎమ్ ఎడ్యుకేషన్ వంటి రంగాల్లో సైతం ఇరుదేశాలు కలిసి పనిచేయాలని మేం నిర్ణయించాం. ఇరు దేశాల విపత్తు నిర్వహణ అథారిటీలు సైతం సంయుక్త కార్యాచరణ కోసం కలిసి పనిచేస్తాయి.
మిత్రులారా,
భారత్, ఇండోనేషియా బంధం వేల సంవత్సరాల నాటిది. రామాయణ, మహాభారతాల నుండి ప్రేరణ పొందిన కథలు, ‘బలి జాత్ర‘ మన రెండు గొప్ప దేశాల మధ్య నాటి సాంస్కృతిక, చారిత్రక సంబంధాలకు సజీవ సాక్ష్యాలు. బౌద్ధ బోరోబుదూర్ ఆలయం తర్వాత, ఇప్పుడు ప్రంబనన్ హిందూ ఆలయ పరిరక్షణకు సైతం భారత్ సహకారం అందించడం నాకు చాలా ఆనందంగా ఉంది.
అదనంగా, 2025 సంవత్సరాన్ని ఇండో–ఆసియాన్ పర్యాటక సంవత్సరంగా జరుపుకోనున్నాం. ఇది భారత్ – ఇండోనేషియా మధ్య సాంస్కృతిక వినిమయం, పర్యాటక రంగాలకు ప్రోత్సాహం అందిస్తుంది.
మిత్రులారా,
ఆసియాన్, ఇండో–పసిఫిక్ ప్రాంతాల్లో ఇండోనేషియా మా ముఖ్యమైన భాగస్వామిగా ఉంది. ఈ మొత్తం ప్రాంతంలో శాంతి, భద్రత, శ్రేయస్సు అలాగే నియమాల ఆధారిత జీవనాన్ని కొనసాగించడానికి ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా స్వేచ్ఛాయుతమైన జల, వాయు రవాణాకు భరోసా కల్పించుటకు మేం అంగీకారానికి వచ్చాం.
మా యాక్ట్ ఈజీ పాలసీలో, ఆసియాన్ ఐక్యంగా, కేంద్ర స్థానంగా ఉండేందుకు మేం ప్రాధాన్యమిచ్చాం. జీ-20, ఆసియాన్ అలాగే హిందూ మహాసముద్ర రిమ్ అసోసియేషన్ వంటి వేదికలపై మేం కలిసి పనిచేయుటను కొనసాగించనున్నాం.
ఇప్పుడు బ్రిక్స్‌లో ఇండోనేషియా సభ్యత్వాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఈ అన్ని వేదికల్లో, గ్లోబల్ సౌత్ దేశాల ప్రయోజనాలు, ప్రాధాన్యాల కోసం మేం సమన్వయంతో, పరస్పర సహకారంతో పని చేస్తాం.
గౌరవ అధ్యక్షా,
రేపటి మా గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా మీరు భారతదేశానికి రావడం మాకు ఎంతో గర్వకారణం. ఈ కార్యక్రమంలో మొదటిసారిగా ఇండోనేషియా కవాతు బృందాన్ని చూడటానికి మేమంతా ఆసక్తిగా ఉన్నాం. మరోసారి, మీకు, మీ ప్రతినిధి బృందానికి భారత్ హృదయపూర్వక స్వాగతం పలుకుతోంది.
ధన్యవాదాలు.
గమనిక – ఇది ప్రధానమంత్రి వ్యాఖ్యలకు దాదాపు అనువాదం మాత్రమే. నిజానికి ఆయన హిందీలో ప్రసంగించారు.
***
Addressing the press meet with President @prabowo of Indonesia. https://t.co/yX7RLt0RSs
— Narendra Modi (@narendramodi) January 25, 2025
2018 में मेरी इंडोनेशिया यात्रा के दौरान, हमने अपनी साझेदारी को Comprehensive Strategic Partnership का रूप दिया था।
— PMO India (@PMOIndia) January 25, 2025
आज राष्ट्रपति प्रबोवो के साथ आपसी सहयोग के विभिन्न पहलुओं पर व्यापक चर्चा हुई: PM @narendramodi
रक्षा क्षेत्र में सहयोग बढ़ाने के लिए, हमने तय किया है, कि Defence Manufacturing और Supply Chain में साथ काम किया जायेगा।
— PMO India (@PMOIndia) January 25, 2025
हमने Maritime Security, Cyber Security, Counter-Terrorism और De-radicalisation में सहयोग पर भी बल दिया है: PM @narendramodi
FinTech, Artificial Intelligence, Internet of Things और Digital Public Infrastructure जैसे क्षेत्रों में हमने आपसी सहयोग को और सशक्त करने का निर्णय लिया है।
— PMO India (@PMOIndia) January 25, 2025
Health और Food Security के sectors में भारत अपने अनुभव, जैसे कि Mid-Day Meal स्कीम और Public Distribution System,…
भारत और इंडोनेशिया के संबंध हजारों वर्ष पुराने हैं।
— PMO India (@PMOIndia) January 25, 2025
रामायण और महाभारत से प्रेरित गाथाएं, और ‘बाली जात्रा’, हमारे लोगों के बीच अनवरत सांस्कृतिक और ऐतिहासिक संबंधों के जीते जागते प्रमाण हैं: PM @narendramodi
आसियान और Indo-Pacific क्षेत्र में इंडोनेशिया हमारा महत्वपूर्ण पार्टनर है।
— PMO India (@PMOIndia) January 25, 2025
इस पूरे क्षेत्र में शांति, सुरक्षा, समृद्धि और Rules-based Order को बनाए रखने के लिए हम दोनों प्रतिबद्ध हैं: PM @narendramodi
अब हम इंडोनेशिया की BRICS सदस्यता का भी स्वागत करते हैं।
— PMO India (@PMOIndia) January 25, 2025
इन सभी मंचों पर, Global South के देशों के हितों और उनकी प्राथमिकताओं पर, हम सहयोग और समन्वय से काम करेंगे: PM @narendramodi