Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు ప్రధానమంత్రి శ్రద్ధాంజలి


పరాక్రమ్ దివస్ (పరాక్రమ దినోత్సవం) ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు శ్రద్ధాంజలి ఘటించారు.  భారత స్వాతంత్ర్య ఉద్యమానికి నేతాజీ అందించిన తోడ్పాటు అసమానమైందని, ధైర్య సాహసాలు, దృఢ సంకల్పం ఆయనలో మూర్తీభవించాయని ప్రధాని అభివర్ణించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ రెండు వేరు వేరు సందేశాలను పొందుపరుస్తూ, వాటిలో ఇలా పేర్కొన్నారు:

‘‘ఈ రోజు, పరాక్రమ్ దివస్ సందర్భంగా నేతాజీ సుభాష్ చంద్ర బోస్‌కు నేను శ్రద్ధాంజలి సమర్పిస్తున్నాను. భారత స్వాతంత్ర్య ఉద్యమానికి ఆయన అందించిన తోడ్పాటు సాటిలేనిది. ధైర్య సాహసాలకు, దృఢ సంకల్పానికి మరో పేరుగా ఆయన నిలిచారు. ఆయన కలలుగన్న భారత్‌ను నిర్మించే దిశలో మనం పనిచేస్తున్న క్రమంలో ఆయన దార్శనికత మనకు సదా ప్రేరణను అందిస్తూనే ఉంటుంది.’’

‘‘ఈ రోజు ఉదయం 11గంటల 25నిమిషాల ప్రాంతంలో, పరాక్రమ్ దివస్ కార్యక్రమంలో నేను నా సందేశాన్ని ఇవ్వబోతున్నాను. సవాళ్లు ఎదురైనప్పుడల్లా సుభాష్ బాబు మాదిరిగానే ధైర్యంతో ముందడుగు వేసేటట్లు మన భావి తరాల వారికి ఈ రోజు ప్రేరణను అందించాలని నేను కోరుకొంటున్నాను.’’