Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

బాలాసాహెబ్ థాకరే గారి జయంతి.. ప్రధానమంత్రి శ్రద్ధాంజలి


బాలాసాహెబ్ థాకరే గారికి ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీ థాకరేను అంతా గౌరవిస్తారని, ప్రజాసంక్షేమానికి, మహారాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తానని ఆయన కంకణం కట్టుకున్నారని, అందుకుగాను మనమంతా ఆయనను స్మరించుకొంటున్నామని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, అందులో:

‘‘బాలాసాహెబ్ థాకరే జీ కి ఆయన జయంతి సందర్భంగా నేను శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఆయనను అన్ని వర్గాల వారు గౌరవిస్తారు.  ప్రజాసంక్షేమానికి, మహారాష్ట్ర అభివృద్ధికి కట్టుబడ్డందుకు ఆయనను మనం స్మరించుకొంటూ ఉంటాం. తాను దృఢంగా నమ్మిన అంశాల్లో ఆయన ఎంతమాత్రం రాజీపడే మనిషి కారు. భారతీయ సంస్కృతి ఔన్నత్యాన్ని పెంపొందింప చేయడానికి ఆయన నిరంతరం పాటుపడ్డార’ని పేర్కొన్నారు.