Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ ఆరోగ్య మిషన్ (2021-24) కింద సాధించిన విజయాల గురించి మంత్రిమండలికి నివేదన: భారతదేశ ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడంలో ఒక కీలక విజయం


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో 2021-22, 2022-23, 2023-24 సంవత్సరాలలో జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ ఎంకింద సాధించిన పురోగతిని నివేదించారుమాతాశిశు మరణాల రేటుశిశు మరణాల రేటు, 5 ఏళ్లలోపు మరణాల రేటుమొత్తం సంతానోత్పత్తి రేటుటీబీమలేరియాకాలా అజార్డెంగ్యూక్షయకుష్టువైరల్ హెపటైటిస్ వంటి వివిధ వ్యాధుల కార్యక్రమాలకు సంబంధించి పురోగతినేషనల్ సికిల్ సెల్ ఎనీమియా ఎలిమినేషన్ మిషన్ వంటి కొత్త కార్యక్రమాల వివరాలను మంత్రిమండలి ముందు ఉంచారు.

మానవ వనరులను విస్తరించడంలోక్లిష్టమైన ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలోఆరోగ్య అత్యవసర పరిస్థితులకు సమగ్ర ప్రతిస్పందనను పెంపొందించడంలో నిరంతర ప్రయత్నాల ద్వారా జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్ హెచ్ఎంభారతదేశ ప్రజారోగ్య ఫలితాలను మెరుగుపరచడానికి గణనీయంగా దోహదం చేసిందిగత మూడేళ్లలోమాతా శిశు ఆరోగ్యంవ్యాధి నిర్మూలనఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలతో సహా బహుళ రంగాలలో ఎన్ హెచ్ ఎం గణనీయమైన పురోగతిని సాధించిందిఈ మిషన్ ప్రయత్నాలు భారతదేశ ఆరోగ్య మెరుగుదలలో అంతర్భాగంగా ఉన్నాయిముఖ్యంగా కోవిడ్ -19 మహమ్మారి సమయంలో దేశవ్యాప్తంగా మరింత నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులో ఉంచడంలో కీలక పాత్ర పోషించాయి.

ఆరోగ్య సంరక్షణ రంగంలో మానవ వనరులు గణనీయంగా పెరగడం ఎన్ హెచ్ ఎం సాధించిన కీలక విజయం. 2021-22 ఆర్థిక సంవత్సరంలోజనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్లు (జిడిఎంఓలు), నిపుణులుస్టాఫ్ నర్సులుఎఎన్ఎంలుఆయుష్ వైద్యులుఅనుబంధ ఆరోగ్య కార్యకర్తలుపబ్లిక్ హెల్త్ మేనేజర్లతో సహా 2.69 లక్షల మంది అదనపు ఆరోగ్య కార్యకర్తలను నియమించడానికి ఎన్ హెచ్ ఎం వీలు కల్పించిందిఅదనంగా 90,740 మంది కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లను నియమించారుతరువాతి సంవత్సరాలలో ఈ సంఖ్య మరింత పెరిగింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో 4.21 లక్షల మంది అదనపు ఆరోగ్య సంరక్షణ నిపుణులు చేరారుఇందులో 1.29 లక్షల మంది సిహెచ్ఓలు ఉన్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 5.23 లక్షల మంది ఆరోగ్య కార్యకర్తలు చేరారుఇందులో 1.38 లక్షల సిహెచ్ఓలు ఉన్నారుముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఆరోగ్య సంరక్షణను మెరుగుపరచడంలో ఈ ప్రయత్నాలు గణనీయంగా దోహదం చేశాయి.

ముఖ్యంగా కోవిడ్-19 మహమ్మారికి ప్రతిస్పందనగా ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో ఎన్ హెచ్ ఎం ప్రణాళిక కీలక పాత్ర పోషించిందిఇప్పటికే ఉన్న ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలుఆరోగ్య కార్యకర్తలను ఉపయోగించడం ద్వారాజనవరి 2021, మార్చి 2024 మధ్య 220 కోట్లకు పైగా కోవిడ్ -19 వ్యాక్సిన్ మోతాదులను అందించడంలో ఎన్ హెచ్ ఎం ముఖ్య భూమిక పోషించిందిఅదనంగాఎన్ హెచ్ ఎం కింద రెండు దశల్లో అమలు చేసిన ఇండియా కోవిడ్ -19 ఎమర్జెన్సీ రెస్పాన్స్ అండ్ హెల్త్ సిస్టమ్స్ ప్రిపేర్డ్నెస్ ప్యాకేజీ (ఇ సి ఆర్ పి మహమ్మారిని సమర్థవంతంగా నిర్వహించడానికిఆరోగ్య సంరక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి సహాయపడింది.

భారతదేశం ఎన్ హెచ్ ఎం క్రింద ముఖ్యమైన ఆరోగ్య సూచికల్లో కూడా గణనీయమైన ప్రగతిని సాధించింది. 2014-16 లో ప్రతి లక్ష జననాలకు 130గా ఉన్న ప్రసూతి మరణాల నిష్పత్తి (ఎంఎంఆర్) 2018-20 నాటికి ప్రతి లక్షకు 97 కి తగ్గిందిఇది 25% తగ్గింపును సూచిస్తుంది. 1990 నుంచి ఇది 83% తగ్గిందిఇది ప్రపంచ స్థాయి 45% తగ్గింపుతో పోలిస్తే ఎంతో ఎక్కువఅయిదు ఏళ్ల లోపు పిల్లల మరణాల రేటు (యు5ఎంఆర్) 2014లో ప్రతి 1,000 జననాలకు 45గా ఉండగా, 2020 నాటికి 32 కి తగ్గిందిఇది 1990 నుండి ప్రపంచ స్థాయి 60% తగ్గింపుతో పోలిస్తే 75% అధిక తగ్గింపును సూచిస్తుందిశిశు మరణాల రేటు (ఐఎంఆర్కూడా 2014లో ప్రతి వెయ్యి జననాలకు 39 గా ఉండగా, 2020 నాటికి 28కి తగ్గిందిజాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ ఎఫ్ హెచ్ ఎస్-5) ప్రకారంమొత్తం సంతానోత్పత్తి రేటు (టిఎఫ్ఆర్) 2015 లో 2.3 నుండి 2020 లో 2.0 కు తగ్గిందిఈ మెరుగుదల 2030 కంటే ముందే మాతాశిశుపిల్లల మరణాలపై భారతదేశం తన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకునే మార్గంలో ఉందని సూచిస్తున్నాయి.

వివిధ వ్యాధుల నిర్మూలననియంత్రణలో కూడా ఎన్ హెచ్ ఎం కీలక పాత్ర పోషించిందిఉదాహరణకుజాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం (ఎన్ టి ఇ పికిందక్షయవ్యాధి (టీబీవ్యాప్తి 2015 లో 1,00,000 జనాభాకు 237 నుండి 2023 లో 195 కు తగ్గిందిఅదే కాలంలో మరణాల రేటు 28 నుండి 22 కు తగ్గిందిమలేరియా విషయానికొస్తే, 2022 సంవత్సరంలోమలేరియా కేసుల గుర్తింపు 32.92% పెరగ్గాకేసులు 9.13% పెరిగాయిమలేరియా మరణాలు 2021తో పోలిస్తే 7.77% తగ్గాయి. 2022తో పోలిస్తే, 2023 సంవత్సరంలో మలేరియా గుర్తింపుకేసులు వరుసగా 8.34%, 28.91% పెరిగాయికాలాఅజర్ నిర్మూలన ప్రయత్నాలు కూడా విజయవంతమయ్యాయి, 2023 చివరి నాటికి 10,000 జనాభాకు ఒక కేసు కంటే తక్కువ కేసుల లక్ష్యాన్ని 100% స్థానిక బ్లాకులు సాధించాయిఇంటెన్సివ్ మిషన్ ఇంద్రధనుష్ (ఐఎంఐ) 5.0 కింద మీజిల్స్రూబెల్లా ఎలిమినేషన్ క్యాంపెయిన్ లో 34.77 కోట్ల మంది పిల్లలకు టీకాలు వేసి, 97.98% కవరేజీని సాధించారు.

ప్రత్యేకంగా ఆరోగ్యానికి సంబంధించినవి చూసుకున్నట్లయితే 2022 సెప్టెంబర్‌లో ప్రారంభించిన ప్రధానమంత్రి టీబీ  ముక్త్ భారత్ అభియాన్‌లో 1,56,572 మంది నిక్షయ్ మిత్ర వాలంటీర్లు నమోదు అయ్యారువారు 9.40 లక్షల మందికి పైగా టీబీ రోగులకు సహయాన్ని అందిస్తున్నారుప్రధానమంత్రి జాతీయ డయాలసిస్ కార్యక్రమాన్ని (పీఎంఎన్‌డీపీకూడా విస్తరించారుదీని కింద 2023-24 ఆర్థిక సంవత్సరంలో 62.35 లక్షలకు పైగా హీమో డయాలసిస్ సెషన్లు జరిగాయిదీని వల్ల మొత్తంగా 4.53 లక్షలకు పైగా డయాలసిస్ రోగులకు ప్రయోజనం చేకూరిందిఅంతేకాకుండా 2023 లో ప్రారంభించిన జాతీయ సికిల్ సెల్ ఎనీమియా నిర్మూలన మిషన్ కింద గిరిజన ప్రాంతాల్లోని 2.61 కోట్ల మందికి పైగా వ్యక్తులను వ్యాధి నిర్ధారణ పరీక్షలు జరిగాయి. 2047 నాటికి సికిల్ సెల్ వ్యాధిని నిర్మూలించే లక్ష్యంతో ఈ మిషన్ పని చేస్తోంది.

డిజిటల్ మాధ్యమంగా జరిగే ఆరోగ్య కార్యక్రమాలపై కూడా ప్రధానంగా దృష్టి సారించారు. 2023 జనవరిలో యూవిన్ ప్లాట్‌ఫామ్‌ ప్రారంభించడం వల్ల దేశమంతటా గర్భిణీ స్త్రీలుశిశువులుపిల్లలకు సకాలంలో టీకాలు అందాయి. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఈ ప్లాట్‌ఫామ్ 36 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లోని 65 జిల్లాలకు విస్తరించిందిరియల్ టైమ్ వ్యాక్సినేషన్ ట్రాకింగ్ ఉండేలా చూసుకునే ఈ ప్లాట్‌ఫామ్‌ రోగనిరోధక టీకాల కవరేజీని మెరుగుపరిచింది.

నేషనల్ క్వాలిటీ అస్యూరెన్స్ స్టాండర్డ్స్‌ (ఎన్‌క్యూఏఎస్కింద ప్రజారోగ్య సదుపాయాలను ధృవీకరించటంతో సహా ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడంపై ఎన్‌హెచ్ఎం దృష్టి సారించిందిమార్చి 2024 నాటికి 7,998 ప్రజారోగ్య కేంద్రాలు ధ్రువపత్రాలు అందుకున్నాయివీటిలో 4,200 కంటే ఎక్కువ జాతీయ స్థాయి ధ్రువీకరణ పొందాయిఅంతేకాకుండా అనేక రకాల ఆరోగ్య సేవలను అందించే ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ (ఏఏఎంకేంద్రాల సంఖ్య 2023-24 చివరి నాటికి 1,72,148 కు పెరిగిందిఇందులో 1,34,650 కేంద్రాలు 12 రకాల కీలక ఆరోగ్య సేవలను అందిస్తున్నాయి.

నిరంతరం పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), ఫస్ట్ రిఫరల్ యూనిట్ల (ఎఫ్‌ఆర్‌యూ)ను ఏర్పాటు చేయటం ద్వారా అత్యవసర సేవలను మెరుగుపరిచేందుకు కూడా ఎన్‌హెచ్‌ఎం చర్యలు చేపట్టింది. 2024 మార్చి నాటికి 12,348 పీహెచ్‌సీలను 24×7 సేవలు అందించే కేంద్రాలుగా మార్చిందిదేశవ్యాప్తంగా 3,133 ఎఫ్ఆర్‌యూలు పనిచేస్తున్నాయిఅదనంగా మొబైల్ మెడికల్ యూనిట్ల (ఎంఎంయూ)ను కూడా పెంచిందిమారుమూల వెనుకబడిన ప్రాంతాలలో ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులో ఉంచేందుకు ప్రస్తుతం 1,424 ఎంఎంయూలు పనిచేస్తున్నాయి. 2023‌లో ఎంఎంయూ పోర్టల్‌ను ప్రారంభించటంతో బలహీనమైన గిరిజన సమూహాలకు సంబంధించి వివిధ ఆరోగ్య సూచికల విషయంలో పర్యవేక్షణసమాచార సేకరణను మరింత మెరుగుపడింది

పొగాకు వాడకంపాముకాటు వంటి ప్రజారోగ్య సమస్యలపై కూడా ఎన్‌‍హెచ్‌ఎం పనిచేసిందిప్రజలకు అవగాహన కల్పించేందుకు నిరంతరం కార్యక్రమాలు నిర్వహించటంపొగాకు నియంత్రణ చట్టాల అమలు ద్వారా ఎన్‌హెచ్ఎం.. గత దశాబ్దంలో పొగాకు వాడకాన్ని 17.3% తగ్గించడంలో తన వంతు పాత్రను పోషించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో పాము కాటు విషయంలో అవగాహననివారణనిర్వహణపై దృష్టి సారిస్తూ పాముకాటు విషప్రభావాన్ని తగ్గించేందుకు జాతీయ కార్యాచరణ ప్రణాళిక (ఎన్‌ఏపీఎస్‌ఈ– నేషనల్ యాక్షన్ ప్లాన్ ఫర్ స్నేక్‌బైట్ ఎన్‌వీనమింగ్ప్రారంభమైంది

 

ఎన్‌హెచ్ఎంలో కొనసాగుతున్న వివిధ కార్యక్రమాలు భారతదేశ ఆరోగ్య సంరక్షణ ముఖచిత్రంలో భారీ మార్పులకు దారితీశాయిమానవ వనరులను పెంచటంఆరోగ్య రంగ చర్యల ఫలితాలను మెరుగుపరచడంక్లిష్టమైన ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం ద్వారా ఎన్‌హెచ్‌ఎం.. దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణ సేవలను అందుబాటులో ఉండేలా చేయటమే కాకుండా నాణ్యతను మెరుగుపరుస్తూనే ఉందిసుస్థిర అభివృద్ధి లక్ష్యాలను (ఎస్‌డీజీసాధించే దిశగా గణనీయమైన పురోగతితో అడుగులు వేస్తున్న భారత్ 2030 గడువు కంటే ముందే తన ఆరోగ్య లక్ష్యాలను దిశలో పయనిస్తోంది

నేపథ్యం:
జిల్లా ఆసుపత్రుల (డీహెచ్స్థాయి వరకు గ్రామీణ ప్రజలకుముఖ్యంగా బలహీన వర్గాలు ఉపయోగించుకునేలా అందుబాటు ధరల్లో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణను అందించే లక్ష్యంతో పనిచేసే ప్రజారోగ్య వ్యవస్థలను తయారు చేయాలన్న లక్ష్యంతో 2005‌లో జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ప్రారంభమైంది. 2012లో జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ (ఎన్‌యూహెచ్‌ఎం)ను రూపొందించి ఎన్‌ఆర్‌హెచ్ఎంను పునర్వ్యవస్థీకరించారుఅప్పటి నుంచి ఎన్‌ఆర్‌హెచ్‌ఎంఎన్‌యూహెచ్‌ఎం అనే రెండు సబ్ మిషన్‌లతో జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హెచ్‌ఎంకొనసాగుతోంది

జాతీయ ఆరోగ్య మిషన్‌ను 2017 ఏప్రిల్ నుంచి 2020 మార్చి 31 మధ్య కొనసాగించేందుకు 2018 మార్చి 21న జరిగిన మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించింది.

2021 మార్చి 31 లేదా 15‌వ ఆర్థిక కమిషన్‌ సిఫార్సులు అమల్లోకి వచ్చే వరకు జాతీయ ఆరోగ్య మిషన్‌ను కొనసాగించేందుకు (మధ్యంతర పొడిగింపుఆర్థిక మంత్రిత్వ శాఖవ్యయ విభాగం 2020 జనవరి 10 నాటి ఆఫీస్ మెమోరాండం నం.42 (02/‌పీఎఫ్-2.2014) ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది.

01.04.2021 నుంచి 31.03.2026 వరకు లేదా తదుపరి సమీక్ష వరకు జాతీయ ఆరోగ్య మిషన్‌ను కొనసాగించడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖవ్యయ విభాగం ఆమోదం తెలుపుతూ.. 2022 ఫిబ్రవరి 01న ఓఎం నం. 01(01)/పీఎఫ్‌సీ/2022 ద్వారా ఉత్తర్వులు జారీ చేసింది

క్యాబినెట్ ఆమోదం పొందిన ఎన్‌హెచ్‌ఎం ఫ్రేమ్‌వర్క్ ప్రకారం.. ఈ అధికారాల వినియోగం ఆర్థిక నిబంధనల్లో మార్పుకొనసాగుతోన్న పథకాల్లో మార్పులుకొత్త పథకాల వివరాలతో పాటు ఎన్‌ (ఆర్హెచ్‌ఎం పురోగతి నివేదికను వార్షిక ప్రాతిపదికన మంత్రిమండలి ముందు ఉంచాలనే షరతుకు లోబడి ఉంటుంది.

అమలు వ్యూహంఎన్‌హెచ్ఎం ప్రకారం ఆరోగ్యకుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ.. రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాలకు(యూటీఆర్థికసాంకేతిక మద్దతును అందించనుందితద్వారా జిల్లా ఆసుపత్రుల(డీహెచ్వరకుముఖ్యంగా పేదబలహీన వర్గాలకు అందుబాటులోఅందుబాటు ధరల్లోబాధ్యతాయుతమైనసమర్థవంతమైన ఆరోగ్య సంరక్షణను అందిస్తోందిమెరుగైన ఆరోగ్య మౌలిక సదుపాయాలుమానవ వనరులను పెంచటంగ్రామీణ ప్రాంతాల్లో సేవలను అందించటాన్ని మెరుగపరచటం ద్వారా గ్రామీణ ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సేవల్లో అంతరాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకుందిఅవసరాన్ని బట్టి సహాయాన్ని అందించటంఅంతర్గత సమన్వయంవివిధ విభాగాల మధ్య సమన్వయంవనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునేందుకు జిల్లా స్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని వికేంద్రీకరిస్తోంది.

 

***