Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో ఓ ప్రమాదంలో ప్రాణహాని.. ప్రధానమంత్రి సంతాపం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియా ప్రకటన


కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో జరిగిన ఓ బస్సు ప్రమాదం ప్రాణహానికి దారితీసినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సంతాపం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల దగ్గరి సంబంధికులకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్ఆర్ఎఫ్) నుంచి రూ.2 లక్షల వంతున, గాయపడ్డ వారికి రూ.50,000 వంతున ఎక్స్‌గ్రేషియాను ఆయన ప్రకటించారు.

ప్రధానమంత్రి కార్యాలయం హ్యాండిల్ సామాజిక మాధ్యమం ఎక్స్‌లో నమోదు చేసిన ఒక సందేశంలో ఇలా తెలిపింది:

‘‘కర్ణాటకలోని ఉత్తర కన్నడ జిల్లాలో బస్సు దుర్ఘటన ప్రాణనష్టానికి దారితీయడం చాలా బాధ కలిగించింది. ప్రియతములను కోల్పోయిన వారికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఈ దుర్ఘటనలో గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. బాధితులకు స్థానిక పాలనా యంత్రాంగం సహాయకచర్యలు చేపడుతోంది.

మృతుల దగ్గరి సంబంధికులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ.2లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ఇస్తాం. గాయపడ్డవారికి రూ.50,000 ఇస్తాం: ప్రధానమంత్రి @narendramodi”