Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మన భారతీయ అంకుర సంస్థలు అత్యాధునిక రంగాల్లో అంతర్జాతీయ స్థాయి ప్రభావాన్ని కలగజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను: ప్రధానమంత్రి


భారతీయ అంకుర సంస్థలు (స్టార్ట్అప్స్అంతర్జాతీయ స్థాయిలో బలమైన ముద్రను వేస్తున్నందుకుఅత్యాధునిక రంగాల్లో ప్రభావాన్ని కలగజేస్తున్నందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ‘‘భారతదేశ యువ శక్తి బలాన్నీవారి నైపుణ్యాన్నీ చూస్తే గర్వంగా ఉందిఅంకుర సంస్థల్ని ఏర్పాటు చేయడం ద్వారా అత్యంత ఆకర్షణీయ దేశాల్లో భారతదేశాన్ని ఒకటిగా మార్చారు’’ అని శ్రీ మోదీ ప్రశంసించారు.

మైగవ్ఇండియా (MyGovIndiaపోస్టుకు ప్రధాని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో స్పందిస్తూ ఇలా పేర్కొన్నారు:

‘‘మన భారతదేశ అంకుర సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో ముద్రను వేస్తుండడంముఖ్యంగా అత్యాధునిక రంగాల్లో ఈ విధంగా ప్రభావాన్ని కలగజేస్తుండడం ఆనందాన్ని ఇస్తోంది’’

#9YearsOfStartupIndia

‘‘భారతదేశ యువ శక్తి బలాన్నీనైపుణ్యాల్నీ చూస్తే గర్వంగా ఉందిఅంకుర సంస్థల్ని ఏర్పాటు చేయడానికి అనువైన అత్యంత ఆకర్షణీయ దేశాల్లో ఒక దేశంగా భారత్‌ను వారు మార్చేశారు.’’  

#9YearsOfStartupIndia