Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైన్యం అచంచల ధైర్యసాహసాలకు అభివాదం చేసిన ప్రధానమంత్రి


ఈ రోజు సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైన్యం అచంచల ధైర్యసాహసాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభివాదం చేశారుభారత సైన్యం పట్టుదలవృత్తిపరమైన నైపుణ్యంఅంకితభావానికి ప్రతీక అని అన్నారు. “సాయుధ బలగాలువారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందికొన్నేళ్లుగా మేము అనేక సంస్కరణలను ప్రవేశపెట్టాంఆధునికీకరణపై దృష్టి పెట్టాం” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.

ఈ రోజుసైనిక దినోత్సవం సందర్భంగా మన దేశ భద్రతకు రక్షణగా నిలుస్తున్న భారత సైన్యం అచంచల ధైర్యసాహసాలకు నా వందనంఅలాగేప్రతిరోజూ కోట్లాది మంది భారతీయుల భద్రతకు భరోసా ఇస్తున్న వీర జవాన్ల త్యాగాలను కూడా స్మరించుకుంటున్నాంభారత సైన్యం సంకల్పంవృత్తి సామర్ధ్యంఅంకితభావానికి ప్రతీకమన సరిహద్దులను కాపాడడంతో పాటు ప్రకృతి వైపరీత్యాల సమయంలో మానవతా సహాయం అందించడంలో కూడా మన సైన్యం తన ప్రత్యేకతను చాటిందిసాయుధ బలగాలువారి కుటుంబాల సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉందికొన్నేళ్లుగా అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి ఆధునికీకరణపై దృష్టి సారించాంరానున్న రోజుల్లోనూ ఇది కొనసాగుతుంది” అని ప్రధానమంత్రి సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.

 

***