Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా…దేశంలోని తత్వవేత్తలు, కవులు, ఆలోచనాపరులలో ఒకరైన తిరువళ్లువర్ ను స్మరణకు తెచ్చుకుంటున్నాం: ప్రధాన మంత్రి


నేడు తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా గొప్ప తమిళ తత్వవేత్తకవిఆలోచనాపరుడు తిరువళ్లువర్ ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్మరించుకున్నారుతమిళ సంస్కృతి సారాన్నీమన తాత్విక వారసత్వాన్నీ తిరువళ్లువర్ గొప్ప పద్యాలు ప్రతిబింబిస్తాయని ఆయన అన్నారు. “అజరామరమైన ఆయన కృతి ‘తిరుక్కురల్’ అనేక అంశాలపై లోతైన పరిజ్ఞానాన్ని అందిస్తూ ప్రేరణకు దీప్తిగా నిలుస్తుంది” అని శ్రీ మోదీ తెలిపారు.

తిరువళ్లువర్ దినోత్సవం సందర్భంగా… మన దేశ గొప్ప తత్వవేత్తకవిఆలోచనాపరుడైన మహానుభావుడు తిరువళ్లువర్ ను స్మరించుకుంటాముఆయన పద్యాలు తమిళ సంస్కృతినీమన తాత్త్విక వారసత్వాన్నీ ప్రతిబింబిస్తాయిఆయన బోధనలు ప్రధానంగా ధర్మంకరుణన్యాయాన్ని ఉపదేశిస్తాయిఅజరామరమైన ఆయన కృతి ‘తిరుక్కురల్’ అనేక అంశాలపై లోతైన బోధలను అందిస్తూ ప్రేరణకు దీప్తిగా నిలుస్తుందిమన సమాజానికి ఆయనా చూపిన దిశలో కొనసాగడానికి కృషి చేస్తూనే ఉంటాము” అని ప్రధానమంత్రి ‘ఎక్స్‘ లో పేర్కొన్నారు.  

 

***