ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఢిల్లీలోని నరైనాలో జరిగిన లోహ్రీ వేడుకల్లో పాల్గొన్నారు. చాలా మందికి, ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందిన వారికి లోహ్రీ పర్వదినానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని ప్రధానమంత్రి ఈ సందర్భంగా అన్నారు. ” కొత్త ఉత్సాహానికి, కొత్త ఆశలకు లోహ్రీ ప్రతీక. ఇది వ్యవసాయం, కష్టపడి పనిచేసే మన రైతులతో కూడా ముడిపడి ఉంది” అని శ్రీ మోదీ పేర్కొన్నారు.
సామాజిక మాధ్యమం ఎక్స్ లో ప్రధాని ఇలా పేర్కొన్నారు:
“లోహ్రీ చాలా మందికి, ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి చెందిన వారికి ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది కొత్త ఉత్సాహానికి, కొత్త ఆశలకు ప్రతీక. ఇది వ్యవసాయం, కష్టపడి పనిచేసే మన రైతులతో కూడా ముడిపడి ఉంది. ఈ రోజు సాయంత్రం ఢిల్లీలోని నరైనాలో లోహ్రీ వేడుకల్లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. ఈ వేడుకల్లో వివిధ వర్గాల ప్రజలు, ముఖ్యంగా యువత, మహిళలు పాల్గొన్నారు. అందరికీ లోహ్రీ శుభాకాంక్షలు‘ అని ప్రధానమంత్రి ట్వీట్ చేశారు.
Lohri has a special significance for several people, particularly those from Northern India. It symbolises renewal and hope. It is also linked with agriculture and our hardworking farmers.
— Narendra Modi (@narendramodi) January 13, 2025
This evening, I had the opportunity to mark Lohri at a programme in Naraina in Delhi.… pic.twitter.com/WUv6pnQZNP
Some more glimpses from the Lohri programme in Delhi. pic.twitter.com/bMbGuLwR3i
— Narendra Modi (@narendramodi) January 13, 2025