మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళాలో తొలి అమృత స్నానాన్ని ఆచరించిన భక్తులను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.
సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్‘ లో మహాకుంభమేళా విశేషాలను, చిత్రాలను పంచుకుంటూ మోదీ– ‘’మహా కుంభమేళా భక్తి, ఆధ్యాత్మికతల అద్భుత సంగమం! మకర సంక్రాంతి సందర్భంగా మహాకుంభ మేళాలో మొదటి అమృత స్నానం చేసిన భక్తులందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశారు.
महाकुंभ में भक्ति और अध्यात्म का अद्भुत संगम!
— Narendra Modi (@narendramodi) January 14, 2025
मकर संक्रांति महापर्व पर महाकुंभ में प्रथम अमृत स्नान में शामिल सभी श्रद्धालुओं का हार्दिक अभिनंदन।
महाकुंभ की कुछ तस्वीरें… pic.twitter.com/xAemEtfa5c