దేశ భవిష్యత్తుకు బాలలనే పునాదిగా చాటే దేశవ్యాప్త వేడుక అయిన వీర బాల దివస్లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. న్యూ ఢిల్లీలోని భారత్ మండపంలో గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఈ కార్యక్రమం జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలోనూ ఆయన ప్రసంగిస్తారు.
‘సుపోషిత్ గ్రామ పంచాయితీ అభియాన్’ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. పోషకాహార సంబంధిత సేవల అమలును విస్తతం చేయడం, క్రియాశీల సామాజిక భాగస్వామ్యం ద్వారా మెరుగైన ఫలితాలను సాధించడంతోపాటు ప్రజా శ్రేయస్సును పెంపొందించడం దీని లక్ష్యం.
యువతను భాగస్వాములను చేయడానికి, ఈ రోజు ప్రాధాన్యాన్ని ప్రాచుర్యంలోకి తేవడానికి, దేశంలో ధైర్యం – అంకితభావంతో కూడిన సంస్కృతిని పెంపొందించడానికీ దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. మై గవ్, మైభారత్ పోర్టల్ ల ద్వారా క్విజ్ లతోపాటు వరుస ఆన్లైన్ పోటీలను నిర్వహిస్తారు. కథాకథనం, సృజనాత్మక రచన, పోస్టర్ తయారీ తదితర ఆసక్తికరమైన కార్యక్రమాలను పాఠశాలలు, బాలల సంరక్షణ కేంద్రాలు, అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తారు.
ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ (పీఎంఆర్ బీపీ) గ్రహీతలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.