Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రముఖ సినీ దర్శకుడు శ్రీ శ్యామ్ బెనెగల్ కన్నుమూత: ప్రధానమంత్రి సంతాపం


ప్రముఖ సినీదర్శకుడు శ్రీ శ్యామ్ బెనెగల్ మృతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘శ్రీ శ్యామ్ బెనెగల్ ఇక మన మధ్య లేరని తెలిసి చాలా విచారానికి లోనయ్యాను. ఆయన చిత్రకథను చెప్పే తీరు భారతీయ సినిమాపైన అమిత ప్రభావాన్ని కలగజేసింది. ఆయన తీసిన చలనచిత్రాలను వివిధ జీవన రంగాల వారు ఎప్పటికీ మెచ్చుకొంటూ ఉంటారు. ఆయన కుటుంబానికీ, ఆయన అభిమానులకూ నేను నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను. ఓం శాంతి’’.  

 

 

***

MJPS/TS