Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా కపూర్ కుటుంబ సభ్యులతో ప్రధానమంత్రి సంభాషణ

రాజ్ కపూర్ శతజయంతి సందర్భంగా కపూర్ కుటుంబ సభ్యులతో ప్రధానమంత్రి సంభాషణ


ణ్ బీర్ కపూర్:  మిమ్మల్ని ప్రైమ్ మినిస్టర్ గారూ లేదా ప్రధాన మంత్రి గారూ.. ఈ రెండు సంబోధనల్లో ఎలా పలకరించాలంటూ గత వారం రోజులుగా మేం మా వాట్సాప్ ఫ్యామిలీ గ్రూపులో పెద్ద ఎత్తున చర్చించుకున్నాంరీమా అత్త రోజూ నాకు ఫోన్ చేసి ఏమని పలకరిద్దాం  రాఈ విషయంలో ఎలా ముందుకు పోదాం… చెప్పవేంరా.. అంటూ ఒకటే ప్రశ్నలు వేసేది.

ప్రధానమంత్రి: తమ్ముడూమీ కుటుంబంలో నేనూ ఓ భాగమేనయ్యామీకు ఏమని పిలవాలనిపిస్తే అలానే పిలవండి.

మహిళ: గౌరవనీయులైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారూ.

ప్రధానమంత్రి: కట్.

మహిళ: మీరు మమ్మల్ని ఈరోజు ఇక్కడికి రమ్మని ఎంతో ప్రేమతో పిలిచారువిలువైన మీ టైంని మా కోసం కేటాయించారురాజ్ కపూర్ వందో పుట్టినరోజు సందర్భంగా మేం మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాంనాన్నగారి సినిమాల్లో ఓ సినిమాలో కొన్ని పదాలు నాకు గుర్తుకొస్తున్నాయి. ‘మై న రహూంగీతుమ్ న రహోగేలేకిన్ రహేంగీ నిశానియా (నేను ఉండనునువ్వు ఉండవుఅయితే గుర్తులు మాత్రం ఉండిపోతాయి).

ప్రధానమంత్రి: బాగుంది.

మహిళ: మాపైన అనంతమైన ప్రేమను చూపించారునరేంద్ర మోదీ గారుప్రధానమంత్రిగా మీరు ఈ రోజు కపూర్ కుటుంబంపై చూపించిన గౌరవం ఎంతటిదో దేశం మొత్తం గమనిస్తుంది.

ప్రధానమంత్రి:  కపూర్ సాహెబ్ గొప్ప సేవ చేశారుమీ అందరినీ ఇక్కడికి రమ్మని మీకు స్వాగతం పలకడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానురాజ్ సాహెబ్ వందో పుట్టిన రోజు భారతీయ సినిమా ప్రయాణంలో ఒక బంగారు మజీలీని సూచిస్తున్నది. ‘నీల్ కమల్’ వచ్చిన 1947 నుంచి 2047 వరకూ ఈ నూరేళ్ళ యాత్ర దేశానికొక అసాధారణ తోడ్పాటును అందిస్తుందిప్రస్తుత కాలంలో దౌత్య వర్గాల్లో ‘సాఫ్ట్ పవర్’ గురించి ఎంతో చర్చ జరుగుతోంది. ‘సాఫ్ట్ పవర్’ అనే మాట ఇంకా పుట్టని కాలంలోనే రాజ్ కపూర్ సాహెబ్ తన కృషితో ప్రపంచ రంగస్థలం మీద భారత్ ప్రభావాన్ని అప్పటికే సుప్రతిష్ఠితం చేశారుదేశానికి చేసిన మహత్తర సేవ ఇది.

మహిళ: రణ్ బీర్ విషయంలోనూ ఇలాంటిదే జరిగిందిరష్యా వెళ్లినపుడు టాక్సీ డ్రైవరు.. మీరు భారత్ నుంచి వచ్చారా అని అడిగివెంటనే పాట పాడడం మొదలుపెట్టాడునేను రాజ్ కపూర్ మనవడిని.. అంటూ (రణ్ బీర్చెప్పాడుఆయనకు చెప్పు… (రణ్ బీర్ ని ఉద్దేశించి).

రణ్‌బీర్ కపూర్:  నేను ఆయన మనవడిని అంటూ అతనితో చెప్పానుఇక ఆ కారణంగా నాకు ప్రతిసారీ టాక్సీ ఉచితంగా దొరికేది.

ప్రధానమంత్రి: ముఖ్యంగా మధ్య ఆసియా విషయంలో బహుశా ఏదో ఒక పని చేయాలిఅక్కడి వారి మనసులను గెలుచుకునేందుకు ఒక చిత్రాన్ని తీయాలిఇన్నేళ్ళయ్యాక కూడా రాజా సాహెబ్ తో ఉన్న ఆత్మీయ బంధం కొనసాగుతున్నదిచూడబోతే ఇదొక అద్భుతం సుమా.

మహిళ: ఈ కాలంలోచిన్నపిల్లలకు కూడా రకరకాల పాటలను నేర్పిస్తున్నారు.

ప్రధానమంత్రి: అది వారి జీవితాల్లో చెరగని ముద్రను వేసిందని చాటిచెబుతోందిమధ్య ఆసియాలో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను నమ్ముతున్నాఈ బంధానికి ప్రాణం పోసేందుకు మనం పాటుపడాలిదీనిని కొత్త తరంతో ముడివేయాలిఈ అనుబంధాన్ని బలపరిచేందుకు ఆ తరహా సృజనాత్మక ప్రయత్నాల్ని మొదలుపెట్టాలిమరి వాటిని తప్పక సాధించవచ్చును.

మహిళ:  ఆయన ఎంతటి ప్రేమను అందుకొన్నారంటే… ఆయన పేరు దేశ దేశాల్లో ప్రసిద్ధి చెందిందిమీరు ఆయనను ఒక చిన్నపాటి ‘సాంస్కృతిక రాయబారి’ అని పిలవొచ్చుఅయితే ఈ రోజు నేను ఇది చెప్పి తీరాలి.  ఆయన ఒక చిన్న సాంస్కృతిక రాయబారి కావచ్చుక కానీమన ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని ప్రపంచ రంగస్థలం మీదకు తీసుకుపోయారుమరి మేం ఎంతో గర్వపడుతున్నాంమా కుటుంబంలో ప్రతి ఒక్కరూ చాలా గర్వపడుతున్నారు.

ప్రధానమంత్రి: నిజానికిప్రపంచంలో దేశానికున్న హోదా చెప్పుకోదగినంతగా పెరిగింది.  ఒక ఉదాహరణకు యోగానే తీసుకోండి..  ఈరోజుప్రపంచంలో మీరు ఏమూలకు వెళ్ళినా సరేయోగాకు తిరుగులేని ఆదరణ లభిస్తుంది.

మహిళ:  మా అమ్మగారుఇంకా నేనుబేబోలోలో… మా అందరికీయోగ అంటే ఆసక్తి.

ప్రధానమంత్రి: నేను ప్రపంచ నాయకులను కలుసుకొన్నప్పుడల్లాఅది మధ్యాహ్న భోజనంలోగానీ లేదా డిన్నర్‌లోగానీనా చుట్టుపక్కల సాగే సంభాషణలు ఒక్క యోగ పైనే సాగుతుంటాయి.

 

వ్యక్తి: ఈ చిత్రం మా తాతగారికొక ప్రేమపూర్వకమైన నివాళిఇది వాస్తవానికి నిర్మాతగా నా మొట్టమొదటి చిత్రంనేనేమో నా కుటుంబంతో కలిసి ఏదైనా చేయాలని కలలు కనేవాడినిమాకు ఇష్టమైనవన్నీ ఈ ప్రాజెక్టులో ఉన్నాయి.

మహిళ: నేను మీకు ఓ విషయం చెప్పవచ్చా?  వీళ్ళు నా మునిమనవలునా పిల్లలువాళ్ళకి వాళ్ళ తాతగారిని చూసే అవకాశం రాలేదుఅయినప్పటికీ వాళ్ళు ఆయన గౌరవార్థం ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.  అర్మాన్ చాలా పరిశోధన చేశాడుఇదిదీనిలో కొంత భాగాన్ని ఆయనకు నివాళి అని చెప్పాలి.

వ్యక్తి: మేం నేర్చుకున్నదంతా సినిమాల్లోనుంచేదీనిలో చాలా విషయాలను మా అమ్మగారు మాకు నేర్పించారు.

ప్రధానమంత్రి: మీరు పరిశోధనలోకి దిగారా అంటేఒకరకంగామీరు ఆ ప్రపంచంలో మునిగిపోతారు.  అనుక్షణమూ దానిలోనే జీవిస్తారుమీరు నిజంగా అదృష్టవంతులుఎందుకంటేమీరు మీ తాతగారిని ఏనాడూ కలుసుకోకపోయినాఈ పని పుణ్యమాని ఆయన జీవితం ఎలా సాగిందో తెలుసుకొనే వీలు మీకు చిక్కింది

వ్యక్తి:  అవునుముమ్మాటికీ.  ఇది నాకో పెద్ద కలగా ఉంటూ వచ్చింది.  ఈ ప్రాజెక్టులో నా పూర్తి కుటుంబ సభ్యులకు ఓ భాగం లభించినందుకు నేను ఎంత కృతజ్ఞతతో నిండిపోయానో చెప్పలేను.

ప్రధానమంత్రి: ఆయన చిత్రాలు ఎంతటి ప్రభావాన్ని కలిగించిందీ నేను మళ్ళీ ఒకసారి గుర్తుకు తెచ్చుకొంటాను.  జన్ సంఘ్ కాలంలో ఢిల్లీలో ఒకసారి ఎన్నికలు జరిగాయి.  జన్ సంఘ్ ఓడిపోయింది.  ఓటమి ఎదురయ్యాక అద్వానీ గారుఅటల్ గారు అన్నారు కదా, ‘‘ఇప్పుడు మనం ఏం చేద్దాం?’’ అనిఉత్సాహాన్ని నింపుకోవడానికి ఒక చిత్రాన్ని చూడాలని వారు నిర్ణయించుకొన్నారు.  వాళ్ళు రాజ్ కపూర్ సినిమా ఒకటి చూడడానికి వెళ్ళారు.  ఆ రాత్రి గడిచిపోయిందితెల్లవారేసరికల్లా వాళ్ళలో మళ్ళీ ఆశలు రేకెత్తాయి.  అది ఎలా ఉందంటేవాళ్ళు ఓడిపోయినా ఒక నవోదయం వారికోసం వేచి ఉంది.

నాకు జ్ఞాపకం ఉంది.  నేను చైనాలో ఉండగామీ నాన్నగారి పాటల్లో ఒక పాట నా చెవులకు సోకిందిదానిని మొబైల్ ఫోన్‌లో రికార్డు చేయాలని నా పక్కన ఉన్న వ్యక్తిని కోరానుఆ పాటను నేను రిషి సాహెబ్‌కు పంపించాను.  ఆయన ఉప్పొంగిపోయారు.

ఆలియా: మీరు ఈ మధ్యే ఆఫ్రికా వెళ్ళినట్లున్నారునా పాటల్లో ఒక పాటను పాడుతున్న జవాను పక్కన మీరు నిలబడి ఉన్న దృశ్యాన్ని నేను చూశానుఆ దృశ్యం వైరల్ అయిందిచాలా మంది ఆ దృశ్యాన్ని నాకు పంపించారు.  దానిని చూసిన ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషించారు.  పాటలకు ప్రపంచాన్ని ఏకం చేసే అపూర్వ శక్తి ఉందని నాకు ఎప్పుడూ అనిపిస్తుంటుందిహిందీ పాటలుముఖ్యంగా వాటికొక ప్రత్యేక స్థానమంటూ ఉందిఅవి భాషల ఎల్లలను దాటిపోతాయిప్రజలకు అందులో మాటలకు అర్థం తెలియకపోవచ్చుఅయినా కానీవాళ్ళు తాము కూడా గొంతు కలుపుతారునేను ప్రయాణాలు చేసేటప్పుడు తరచుగా ఈ విషయాన్ని గమనించాను.  ముఖ్యంగా రాజ్ కపూర్ పాటల విషయం.  ఈ రోజుకు కూడా మన సంగీతంలో అందరినీ ఆకట్టుకొనే భావద్వేగాలు ఏవో ఉన్నాయనిపిస్తుంది.  అది వెంటనే మనల్ని హత్తుకుపోతుంది.  ఈ విషయాలు మాట్లాడుతూ ఉంటేనాలో ఒక ప్రశ్న పుట్టింది.. మీకు ఇప్పటికీ పాటలు వినే అవకాశం లభిస్తోందా?

ప్రధానమంత్రి:  అవునునేను సంగీతాన్ని ఆస్వాదిస్తానువీలుచిక్కినప్పుడల్లా నేను తప్పక సంగీతాన్ని వింటూ ఉంటాను.

సైఫ్ అలీ ఖాన్: నేను కలుసుకున్న మొట్టమొదటి ప్రధానమంత్రి మీరేమీరు ఒకసారికాదు రెండుసార్లు మమ్మల్ని ముఖాముఖి కలుసుకున్నారుమీలో పాజిటివ్ ఎనర్జీ చాలా ఉందిపని అంటే మీరు చూపే అంకితభావం నిజంగా ప్రశంసించదగ్గదిమీరు చేసే ప్రతి పనికి నేను మిమ్మల్ని అభినందించాలనుకొంటున్నానుమరి మీరు మాతో భేటీ అయినందుకుఇంత చనువుగా మాట్లాడినందుకు మీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నానుమీకు చాలా చాలా ధన్యవాదాలు.

ప్రధానమంత్రి: మీ నాన్నను కలుసుకోవడం నాకు జ్ఞాపకం ఉందిఈరోజున మీ కుటుంబంలో మూడు తరాలకు చెందినవారిని కలుసుకొనే అవకాశం నాకు దక్కుతుందని నేను ఆశపడ్డానుకానీమీరు మూడో తరాన్ని వెంటబెట్టుకురాలేదు.

కరిష్మా కపూర్: మేం వాళ్ళని తీసుకువద్దామనే అనుకున్నాం.

మహిళ: వాళ్ళంతా పెద్ద నటులుమేం మరింత పెద్ద రంగంలో లేంనా పిల్లలు వారి వంతు యథాశక్తి ప్రయత్నిస్తున్నారుఇక్కడ మమ్మల్ని పిలిచింది ప్రధానమంత్రి గారునాన్నామీకు థ్యాంక్స్.

రణ్‌బీర్ కపూర్: మేం డిసెంబరు 13, 14, 15 తేదీల్లో రాజ్ కపూర్ సినిమాలను గురించి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటుచేస్తున్నాంభారత ప్రభుత్వంఎన్ఎఫ్‌డీసీఇంకా ఎన్ఎఫ్ఏఐ గొప్పగా మద్దతునిచ్చాయిమేం ఆయన సినిమాలు పదింటిని– దృశ్యశ్రవణ మాధ్యమాల సాయంతో– పునరుద్ధరించాంవాటిని భారత్‌లో 40 నగరాల్లో 160 థియేటర్లలో ప్రదర్శిస్తారుప్రీమియర్‌ను 13వ తేదీన ముంబయిలో నిర్వహిస్తున్నాంఈ కార్యక్రమంలో మాతో కలవాల్సిందిగా యావత్తు చలనచిత్ర పరిశ్రమను మేం ఆహ్వానించాం.

గమనికకపూర్ కుటుంబ సభ్యులు– ప్రధానమంత్రి మధ్య సంభాషణ హిందీలో జరిగింది.

 

***