Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ సీ రాజగోపాలాచారి జయంతి రోజున ఆయనను స్మరించుకున్న ప్రధానమంత్రి


శ్రీ రాజగోపాలాచారి బహుముఖ ప్రజ్ఞాశాలి అని, ప్రభుత్వ పాలన, సాహిత్య, సామాజిక సాధికారతా రంగాల్లో ఆయన వేసిన ముద్ర బలమైందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శ్రీ సీ రాజగోపాలాచారి జయంతి సందర్భంలో ఈరోజు ప్రధాని దివంగత నేతను స్మరించుకున్నారు.  

 ‘ఎక్స్’ వేదికపై తమ సందేశాన్ని పంచుకుంటూ:

“నేడు శ్రీ సీ రాజగోపాలాచారి జయంతి సందర్భంలో వారిని సంస్మరించుకుంటున్నాను. స్వాతంత్ర్య పోరాటంలో వారి భాగస్వామ్యం విలువైంది. దేశ ప్రగతి కోసం ఎంతో శ్రమించారు. ఆయన ప్రజ్ఞ బహుముఖమైంది, ప్రభుత్వ పాలన, సాహిత్య, సామాజిక సాధికారతా రంగాల్లో ఆయన ముద్ర చెరిగిపోనిది. ప్రతి భారతీయుడూ గౌరవప్రదంగా, సమృద్ధితో జీవించేందుకు  రాజాజీ సిద్ధాంతాలు మనకు తోవ చూపుతాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.