Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

డిసెంబర్ 11న సుప్రసిద్ధ తమిళ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతి సాహితీ సర్వస్వాన్ని విడుదల చేయనున్న ప్రధానమంత్రి


సుప్రసిద్ధ తమిళ కవి, స్వాతంత్ర్య సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతి సాహితీ సర్వస్వాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ డిసంబర్ 11న (రేపు) మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో న్యూఢిల్లీ నంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్ వద్ద విడుదల చేస్తారు.

సుబ్రహ్మణ్య భారతి రచనలు ప్రజల్లో దేశభక్తిని జాగృతం చేసి, సాధారణ ప్రజలకు సులభంగా అర్ధమయ్య భాషలో భారతీయ సంస్కృతి వైభవాన్ని, ఆధ్యాత్మిక వారసత్వాన్ని వారికి పరిచయం చేశాయి. శీని విశ్వనాథన్ కూర్చి, సంపాదకత్వం వహించిన 23 సంపుటాల ‘భారతి’ సాహితీ సర్వసాన్ని అలయన్స్ పబ్లిషర్స్ ప్రచురించారు. ఈ ప్రచురణలో సుబ్రహ్మణ్య భారతి రచనల గురించిన వివరణలు, పత్రాలు, నేపథ్యం, తాత్వికపరమైన విశ్లేషణలు సహా సమగ్ర వివరాలు అందుబాటులోకి వస్తాయి.