Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ తొలి రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి నివాళులు


భారతదేశ తొలి రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జీ జయంతి సందర్భంగా ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు నివాళులు అర్పించారు. భారతదేశ ప్రజాస్వామ్యానికి ఒక బలమైన పునాదిని వేయడంలో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు అందించిన అమూల్య తోడ్పాటును ప్రధాని ప్రశంసించారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’లో శ్రీ నరేంద్ర మోదీ ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘దేశానికి ప్రధమ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన జయంతి సందర్భంగా గౌరవపూర్వక శ్రద్ధాంజలి. రాజ్యాంగ పరిషత్తు అధ్యక్షుని హోదాలో భారత ప్రజాస్వామ్యానికి శక్తిమంతమైన పునాదిని వేయడంలో ఆయన అమూల్యమైన తోడ్పాటును అందించారు. దేశవాసులుగా మనమంతా రాజ్యాంగానికి 75 సంవత్సరాలైన ఉత్సవాన్ని ప్రస్తుతం జరుపుకొంటున్న సందర్భంగా ఆయన జీవనం, ఆయన ఆదర్శాలు మరింత ఎక్కువ ప్రేరణను అందించేవేనని చెప్పాలి.’’

 

 

***

MJPS/SR