Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సురినామ్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ

సురినామ్ అధ్యక్షుడితో ప్రధానమంత్రి భేటీ


గయానా దేశం జార్జిటౌన్ లో భారత్-కరికామ్ రెండవ శిఖరాగ్ర సదస్సు నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సురినామ్ దేశాధ్యక్షుడు శ్రీ చంద్రికాపర్సాద్ సంతోఖీతో నవంబర్ 20వ తేదీన భేటీ అయ్యారు.

 
ప్రస్తుతం అమల్లో ఉన్న ద్వైపాక్షిక కార్యక్రమాల ప్రగతిని సమీక్షించిన ఇరువురు నేతలూ…  రక్షణ, భద్రత, వాణిజ్యం, వ్యవసాయం, డిజిటల్ రంగంలోని యూపీఐ, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి నూతన సాంకేతికతలు, ఆరోగ్యం, ఔషధాలు, సామర్థ్య పెంపు, తదితర  రంగాల్లో సహకారాన్ని పెంపొందించాలని, ఇరుదేశాల ప్రజల మధ్య మరింత సన్నిహిత సంబంధాలు నెలకొల్పేందుకు కృషి చేయాలని నిర్ణయించారు. సురినామ్ అభివృద్ధికి సహకారాన్ని అందిస్తున్న భారత్ కు ఆ దేశాధ్యక్షుడు కృతజ్ఞతలు తెలియజేశారు. సామాజిక అభివృద్ధి ప్రాజెక్టులు, ఆహార భద్రత, చిన్న, మధ్య తరహా పరిశ్రమల అభివృద్ధికి భారత్ అందిస్తున్న సహకారం మరువలేనిదన్నారు.  

ఇటీవలి కాలంలో ప్రాముఖ్యం సంతరించుకున్న పలు ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలను గురించి ఇరువురు నేతలు చర్చించారు.  ఐక్యరాజ్య సమితి భద్రతామండలిలో భారత్ అభ్యర్థిత్వానికి  మద్దతునిచ్చిన సురినామ్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర  మోదీ కృతజ్ఞతలు తెలియజేశారు.