Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సెయింట్ లూసియా ప్రధానితో భారత ప్రధాని భేటీ

సెయింట్ లూసియా ప్రధానితో భారత ప్రధాని భేటీ


భారత్-కారికోమ్ రెండో శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సెయింట్ లూసియా ప్రధానమంత్రి హెచ్.ఇ. ఫిలిప్ జె. పియర్ తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్చలు నిర్వహించారు. నవంబరు 20న జరిగిన ఈ చర్చలు ఫలప్రదంగా జరిగాయి.

సామర్థ్యాభివృద్ధి, విద్య, ఆరోగ్యం, పునరుత్పాదక ఇంధనం, క్రికెట్, యోగా సహా పలు అంశాల్లో ద్వైపాక్షిక సహకారంపై ఇరువురు నేతలూ చర్చించారు. భారత్-కారికోమ్ భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి భారత ప్రధానమంత్రి ఏడు సూత్రాల ప్రణాళికను సెయింట్ లూసియా ప్రధానమంత్రి పియర్ అభినందించారు.

చిన్న ద్వీపదేశాల్లో విపత్తు నిర్వహణ సామర్థ్యాల బలోపేతం, పునరుద్ధరణపై ప్రత్యేకంగా దృష్టిసారించి.. వాతావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కోవడంలో పరస్పర సహకారం ఆవశ్యకమని ఇరువురు నేతలు స్పష్టంచేశారు.