Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారత్ – ఆస్ట్రేలియా రెండో వార్షిక శిఖరాగ్ర సదస్సు

భారత్ – ఆస్ట్రేలియా  రెండో వార్షిక శిఖరాగ్ర సదస్సు


రియో డి జనీరో జి-20 శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న ప్రధానమంత్రి శ్రీ మోదీ, నవంబర్ 19న ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ ఆల్బనీజ్ తో కలిసి భారత్-ఆస్ట్రేలియా రెండో వార్షిక శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు. శ్రీ ఆల్బనీజ్ 2023 భారత అధికారిక పర్యటన సందర్భంగా ఈ సదస్సు తొలి విడత సమావేశాలు మార్చి 10వ తేదీన న్యూఢిల్లీలో జరిగాయి.

భారత్-ఆస్ట్రేలియా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠపరచేందుకు కృషి చేస్తామని ఇరువురు దేశాధినేతలూ తెలిపారు. రక్షణ, భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, విద్య, నైపుణ్యాలు, అనుసంధానం, పునర్వినియోగ ఇంధనం, అంతరిక్షం, క్రీడల రంగాల్లో సహకారం పెంపు సహా ఇరుదేశాల ప్రజల మధ్య స్నేహ సంబంధాల బలోపేతం గురించి నేతలిరువురూ చర్చించారు.

పరస్పర ఆసక్తి గల పలు అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై అభిప్రాయాల మార్పిడి అనంతరం, అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి సుస్థిరతల కోసం శ్రమిస్తామని శ్రీ మోదీ, శ్రీ ఆల్బనీజ్ చెప్పారు.

***